Search
  • Follow NativePlanet
Share
» »ప్ర‌యాణికుల‌కు ఏపీఎస్ఆర్‌టిసి శుభ‌వార్త‌... వ‌చ్చే నెల 3 నుంచి ద‌స‌రా స్పెష‌ల్ బ‌స్సులు..

ప్ర‌యాణికుల‌కు ఏపీఎస్ఆర్‌టిసి శుభ‌వార్త‌... వ‌చ్చే నెల 3 నుంచి ద‌స‌రా స్పెష‌ల్ బ‌స్సులు..

మ‌రికొద్దిరోజుల్లో రెండు తెలుగురాష్ట్రాల్లో ద‌స‌రా పండుగ సంబురాలు ప్రారంభంకానున్నాయి. ద‌స‌రా వేళ ప్ర‌యాణికుల కోసం ఏపీఎస్ఆర్‌టిసి స్పెష‌ల్ బ‌స్సులను అందుబాటులోకి తీసుకరానుంది. సాధార‌ణ రోజుల్లోనే బ‌స్సుల ర‌ద్దీ అధికంగా ఉంటుంది. ఇక‌, పండుగ వేళ ఆ ర‌ద్దీ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ద‌స‌రా పండుగ‌కు విద్యాసంస్థ‌ల‌కు ఎక్కువ సెల‌వులే వ‌స్తాయి. ఇలాంటి సంద‌ర్భంలో ప‌ట్ట‌ణాల్లో ఉండి చ‌దువుకునే వారు, ఉద్యోగులు త‌మ సొంత గ్రామాల‌కు వెళ్లి పండుగ చేసుకోవాల‌నుకుంటారు.

అలాంటివారిని దృష్టిలో పెట్టుకుని ఏపీఎస్ఆర్‌టిసి ఈ నిర్ణ‌యం తీసుకుంది. దసరా పండకు వెళ్లే ప్రయాణికుల కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను సిద్ధం చేసేందుకు రెడీ అవుతోంది. ఈసారి 900కు స్పెషల్ బస్సులను నడిపేందుకు నిర్ణ‌యం తీసుకుంది. ఈ స్పెష‌ల్ బ‌స్సులు అక్టోబర్ 3వ తేదీ నుంచి ప్ర‌యాణికుల‌కు అందుబాటులోకి రానున్నాయి. గత సంవ‌త్స‌రం దసరా స్పెష‌ల్ బ‌స్సులు సర్వీసుల ద్వారా ఆర్టీసికి రూ.2. 35 కోట్ల ఆదాయం వచ్చిన విష‌యం తెలిసిందే. దీంతో గ‌త ఏడాది కంటే ఈ సారి ఎక్కువ బ‌స్సుల‌ను న‌డపాల‌ని ఆర్‌టిసీ నిర్ణ‌యం తీసుకుంది.

శరన్నవరాత్రి ఉత్సవాలు...

ఈ ద‌స‌రా పండుగ‌కు ఏకంగా 960కిపైగా ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. రాష్ట్రం నలమూలల నుంచే కాకుండా, పక్క రాష్ట్రాల్లో ఉన్న ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చేలా ఏపీఎస్ఆర్‌టిసి ఈ కార్యాచరణను సిద్ధం చేసింది. విజ‌య‌వాడ ద‌స‌రా శ‌ర‌న్న‌వ‌రాత్రి ఉత్స‌వాలు వ‌చ్చే నెల 3వ తేది నుంచి ప్రారంభం కానున్నాయి. వ‌చ్చే నెల (అక్టోబ‌ర్‌) 12వ తేది ద‌స‌రా పండుగ‌. అదేరోజు శరన్నవరాత్రి ఉత్సవాలు కూడా ముగుస్తాయి.

APSRTC good news for travelers

అక్టోబర్ 4వ తేదీ నుంచి రెండు రాష్ట్రాల్లోని అన్నీ విద్యా సంస్థలకు కూడా సెలవులు రానున్నాయి. ఈ క్ర‌మంలో చాలా మంది సొంతూళ్ల‌కు వెళ్లేందుకు ప‌య‌న‌మ‌వుతారు. వీరిని త‌మ త‌మ గమ్యస్థానాలకు చేర్చే దిశగా ఏపీఎస్ఆర్‌టిసి స్పెష‌ల్ బస్సులను సిద్ధం చేసింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అక్టోబర్ 15వ తేదీ వరకు ప్ర‌త్యేక బ‌స్సుల‌ను న‌డ‌పాల‌ని నిర్ణ‌యం తీసుకుంది.

హైద‌రాబాద్‌కు అత్య‌ధిక బ‌స్సులు..

గ‌త సంవ‌త్స‌రం మాదిరిగానే ఈ సారి కూడా హైదరాబాద్ నగరానికి అత్యధిక బ‌స్సుల‌ను న‌డ‌పాల‌ని నిర్ణ‌యించుకుంది. ఈసారిక హైద‌రాబాద్‌కు 300కు పైగా ప్రత్యేక బస్సులు సర్వీసులు అందించే అవకాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. బెంగళూరుతో పాటు మరికొన్ని నగరాలకు కూడా ఈ స్పెష‌ల్ బ‌స్సు స‌ర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. అనంత‌రం రాజ‌మండ్రి రూట్​కి స్పెష‌ల్ బస్సులను ఏర్పాటు చేయ‌నున్నారు.

ద‌స‌రాకి స్పెష‌ల్ బ‌స్సుల్లో భాగంగా మొద‌టి మూడు రోజులు 37 సర్వీసులు చొప్పున నడుపుతున్న‌ట్లు అధికారులు పేర్కొన్నారు. అనంత‌రం అక్టోబర్​ 8వ తేది నుంచి బస్సుల సంఖ్యను గణనీయంగా పెంచుతున్న‌ట్లు అధికారులు తెలిపారు. అక్టోబర్​ 9న 105 బస్సులు, 10న 117 బస్సులు, 11న 128 బస్సులు న‌డ‌ప‌నున్న‌ట్లు వివ‌రించారు. ద‌స‌రా పండగ మ‌రుస‌టి రోజు 128 బస్సులు, 14న 103 బస్సులు నడపాలని అధికారులు నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+