Search
  • Follow NativePlanet
Share
» »తెలుగురాష్ట్రాల ప్ర‌యాణికుల‌కు గ‌మ‌నిక‌.. ప‌లు రైళ్లు ర‌ద్దు..మ‌రికొన్ని దారి మ‌ళ్లింపు..

తెలుగురాష్ట్రాల ప్ర‌యాణికుల‌కు గ‌మ‌నిక‌.. ప‌లు రైళ్లు ర‌ద్దు..మ‌రికొన్ని దారి మ‌ళ్లింపు..

తెలుగు రాష్ట్రాల రైలు ప్ర‌యాణికుల‌కు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే అల‌ర్ట్ జారీ చేసింది. నిర్వ‌హ‌ణ ప‌నుల కార‌ణంగా ప‌లు రైళ్ల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు రైల్వే అధికారులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల‌తో పాటు హైద‌రాబాద్ నుంచి ప‌లు ప్రాంతాల‌కు వెళ్లే ట్రైన్ల‌ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు, మ‌రికొన్ని రైళ్లను దారిమ‌ళ్లిస్తున్న‌ట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ విష‌యాన్ని ప్ర‌యాణికులు గ‌మ‌నంలో ఉంచుకుని ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను చూసుకోవాల‌ని రైల్వే అధికారులు కోరుతున్నారు.

నిర్మాణ‌, నిర్వహణ పనుల నిమిత్తం సికింద్రాబాద్‌-పుణె మధ్య తిరిగే శతాబ్ది సహా గోల్కొండ, శాతవాహన ఎక్స్‌ప్రెస్‌లతో పాటు మరికొన్ని రైళ్ల‌ను తాత్కాలికంగా ర‌ద్దు చేస్తున్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. సెంట్రల్‌ రైల్వే జోన్‌ పరిధిలోని దౌండ్‌ మార్గంతో పాటు ద‌క్షిణ మ‌ధ్య రైల్వేలోని విజయవాడ డివిజన్‌లోనూ మూడో ట్రైన్ లైను పనుల నిమిత్తం ప‌లు ట్రైన్ల‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్న‌ట్లు అధికారులు తెలిపారు. రద్దు చేసిన ట్రైన్ల జాబితాను కూడా అధికారులు విడుద‌ల చేసారు. అ జాబితా ఏంటో ఓసారి చూసేద్దాం..

many trains are cancelled some more are diverted

ర‌ద్ద‌యిన ట్రైన్ల జాబితా ఇదే..

12220 అనే నెంబ‌ర్‌గ‌ల‌ సికింద్రాబాద్‌-ముంబయి మధ్య నడిచే దురంతో ఎక్స్‌ప్రెస్‌ను జులై 30వ తేదిన ర‌ద్దు చేశారు.

12219 అనే నెంబ‌ర్‌గ‌ల ముంబయి-సికింద్రాబాద్‌ ఏసీ దురంతో ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ను జులై 31వ తేదిన తాత్కాలికంగా ర‌ద్దు చేశారు.

12205 అనే నెంబ‌ర్‌గ‌ల పుణె-సికింద్రాబాద్‌ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ ఈ నెల 29, 31, వ‌చ్చేనెల 1వ తేదీల్లో రద్దు చేశారు.

12206 అనే నెంబ‌ర్‌గ‌ల సికింద్రాబాద్‌-పుణె శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ను ఈ నెల 29, 31 తేదీల్లో రద్దు చేశారు.

11410 అనే నెంబ‌ర్‌గ‌ల నిజామాబాద్‌-పుణె మధ్య తిరిగే ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ను జులై 31వ తేదిన రద్దు చేశారు.

12714 అనే నెంబ‌ర్‌గ‌ల సికింద్రాబాద్ టు విజయవాడ న‌డిచే శాతవాహన ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఆగ‌స్టు 5 నుంచి 10 వ‌ర‌కు ర‌ద్ద‌య్యింది.

12713 అనే నెంబ‌ర్‌గ‌ల విజయవాడ-సికింద్రాబాద్ మ‌ధ్య న‌డిచే శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ వ‌చ్చేనెల 5వ తేది నుంచి 10వ‌ర‌కు ర‌ద్దు చేశారు. 17201 అనే నెంబ‌ర్‌గ‌ల గుంటూరు-సికింద్రాబాద్ మ‌ధ్య న‌డిచే గోల్కొండ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఆగ‌స్టు 5 నుంచి 10 వ‌ర‌కు ర‌ద్ద‌య్యింది. 17202 అనే నెంబ‌ర్‌గ‌ల సికింద్రాబాద్‌-గుంటూరు మ‌ధ్య న‌డిచే గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ వచ్చే నెల 5వ తేది నుంచి 10వ తేదివ‌ర‌కు ర‌ద్దు చేశారు.

07755 అనే నెంబ‌ర్‌గ‌ల డోర్నకల్‌-విజయవాడ మ‌ధ్య న‌డిచే శాతావ‌హ‌న ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను ఆగ‌స్టు 5 నుంచి 10 వ‌ర‌కు ర‌ద్దు చేశారు. 07756 అనే నెంబ‌ర్‌గ‌ల విజయవాడ-డోర్నకల్‌, 07979 అనే నెంబ‌ర్‌గ‌ల విజయవాడ-భద్రాచలం రోడ్ మ‌ధ్య న‌డిచే ట్రైన్, 07278 అనే నెంబ‌ర్‌గ‌ల భద్రాచలంరోడ్‌-విజయవాడ మ‌ధ్య న‌డిచే ట్రైన్ ఆగ‌స్టు 5వ తేది నుంచి 10వ తేదీ వరకు రద్దు చేసిన‌ట్లు అధికారులు తెలిపారు.

ప‌లు రైళ్లు దారి మ‌ళ్లింపు..

ర‌ద్దు చేసిన ట్రైన్ల జాబితాతో పాటు దారి మ‌ళ్లించిన ట్రైన్ల జాబితాను కూడా అధికారులు విడుద‌ల చేశారు. 18046 అనే నెంబ‌ర్‌గ‌ల హైదరాబాద్ టు షాలిమార్‌ ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌, సికింద్రాబాద్ టు తిరుపతి మధ్య న‌డిచే పద్మావతి ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్ టు విశాఖపట్నం మధ్య న‌డిచే గోదావరి, సికింద్రాబాద్ టు గూడూరు మధ్య న‌డిచే సింహపురి, ఆదిలాబాద్ టు తిరుపతి మధ్య తిరిగే కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లతో పాటు పలు రైళ్లను దారి మళ్లించిన‌ట్లు ద‌క్షిణ మధ్య రైల్వే అధికారులు పేర్కొన్నారు. ప్ర‌యాణికుల‌కు ఈ విష‌యాన్ని గ‌మ‌నించాల‌ని అధికారులు కోరారు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+