Search
  • Follow NativePlanet
Share
» »ప్ర‌యాణికుల‌కు గ‌మ‌నిక‌.. రెండు తెలుగురాష్ట్రాల్లో భారీ వ‌ర్షాలు..ఐఎండీ హెచ్చ‌రిక‌!

ప్ర‌యాణికుల‌కు గ‌మ‌నిక‌.. రెండు తెలుగురాష్ట్రాల్లో భారీ వ‌ర్షాలు..ఐఎండీ హెచ్చ‌రిక‌!

మార్చి నెల మొద‌లు కాక‌ముందు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండ‌లు మండిపోయాయి. ఉదయం ఏడు నుంచే భానుడు సెగ‌లు క‌క్కించాడు. మ‌రోవైపు తీవ్ర ఉక్క‌పోతతో ప్ర‌జ‌లు ఉక్కిరిబిక్కిరి అవుతున్న క్ర‌మంలో గ‌త రెండు రోజుల నుంచి వాత‌వ‌ర‌ణం కాస్త మార్పు చెందింది. గత మూడు రోజులుగా కాస్త ఉపశమనం కలిగించేలా రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తారు వ‌ర్షాలు కుర‌వ‌గా, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఉత్తర కోస్తాలో తేలిపాకపాటి వర్షాలు ప‌డే అవ‌కాశాలు ఉన్న‌ట్లు వాతావర‌ణ శాఖ తెలిపింది. ఇదిలా ఉండ‌గా మరో రెండు మూడు రోజులు కూడా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ భావిస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప‌లుప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవ‌కాశాలున్న‌ట్లు ఐఎండీ తెలిపింది. ఇలాంటి త‌రుణంలో తెలంగాణ‌లోని ప‌లు జిల్లాలో ఇప్ప‌టికే ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.

రానున్న రెండు మూడు రోజుల్లో కూడా ఏపీలో కూడా ఇదే ప‌రిస్థితి కొన‌సాగే అవ‌కాశం ఉన్న‌ట్లు అధికారులు సూచిస్తున్నారు. ప‌లు ప్రాంతాల్లో పిడుగుల‌తో కూడిన వ‌ర్షాలు ప‌డే సూచ‌న‌లున్నాయ‌ని ఐఎండీ తెలిపింది. కాబ‌ట్టి ఇత‌ర ప్రాంతాల‌కు ప్ర‌యాణం చేయాలనుకునేవారు వారి ప్ర‌ణాళిక‌ల‌ను మార్చుకోవ‌డం ఉత్త‌మమ‌ని వాతావ‌ర‌ణ‌శాఖ సూచిస్తుంది. ద‌క్షిణ తమిళనాడు నుంచి విదర్బ వరకు గల ద్రోణి ప్రభావంతో ఏర్పడిన గాలులు నిలిచిపోయినట్లు ఐఎండి వివ‌రించింది. అయితే కర్ణాటక నుంచి విదర్భ, పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. సముద్ర మట్టానికి 0.9 కిలోమీట‌ర్ల‌ ఎత్తులో జార్ఖండ్ రాష్ట్రం నుంచి ఒడిశా రాష్ట్రం మీదుగా ఉత్తర కోస్తా ఆంధ్ర‌ప్ర‌దేశ్ వరకు గల ద్రోణి బలహీనపడిందని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

heavyrainsinapandtelangana1

ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షాలు...

వాతావరాణశాఖ విడుద‌ల చేసిన బులిటెన్ ప్రకారం.. నేడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచ‌న‌లున్న‌ట్లు తెలిపింది. ఉరుములతో కూడిన జల్లులు కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఏపీలోని ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వెల్ల‌డించింది. ఇక దక్షిణ కోస్తాలో కూడా ఉరుములు, మెరుపులు, పిడుగుల‌తో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్న‌ట్లు తెలిపారు. రాయ‌ల‌సీమ‌లోని కొన్ని ప్రాంతాల్లో ఇవాళ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంద‌ని చెప్పారు. మ‌రో రెండు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తేలికపాటి వానలు కురిసే అకాశం ఉంద‌న్నారు.

అకాల వ‌ర్షంతో పంట‌న‌ష్టం..

తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉప‌రితల ద్రోణీ ప్ర‌భావం క‌నిపిస్తుంది. మంగ‌ళవారం నాడు ఉత్తర తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వడగళ్ల వ‌ర్షం కురిసింది. ఈ అకాల వ‌ర్షం కార‌ణంగా పంట న‌ష్టం వాటిల్లింద‌ని రైతులు తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. తెలంగాణ‌లోని ముస్తాబాద్ మండలంలోని పోతుగల్, గన్నేపల్లి, సేవాలాల్ తండా గ్రామాల్లో వడగళ్ల వాన కార‌ణంగా వరి పంట పూర్తిగా దెబ్బతిన్నది. ఇక‌, నేడు, రేపు కూడా తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరం భీమ్, ఆసిఫాబాద్, మంచిర్యాల. నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో అక్కడకక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు కూడా జారీ చేశారు. హైదరాబాద్ నగరంలో చూస్తే నేడు తేలికపాటి వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+