Search
  • Follow NativePlanet
Share
» »బంప‌ర్ ఆఫ‌ర్‌.. రూ. 150ల‌తో టికెట్ తీసుకుని.. విమాన ప్ర‌యాణం చేసేయండి!

బంప‌ర్ ఆఫ‌ర్‌.. రూ. 150ల‌తో టికెట్ తీసుకుని.. విమాన ప్ర‌యాణం చేసేయండి!

జీవితంలో ఒక్క‌సారైనా స‌ర‌దాగా విమానంలో ప్రయాణించాలని ప్రతి ఒక్కరూ ఆశ ప‌డుతుంటారు. అయితే, చాలామందికి ఇది క‌ల‌గానే మిగిలిపోతుంది. అందుకు కార‌ణం విమాన ఛార్జీలు. కేవ‌లం ధ‌నికులకు మాత్ర‌మే విమాన ప్ర‌యాణం సుల‌భం అనే భావ‌న నేటికీ ఉండిపోయింది. అలాంటి భావ‌నే మీ మ‌నసులో కూడా ఉంటే.. వెంట‌నే దానిని మ‌ర్చిపోండి. ఎందుకంటే, ఇప్పుడు విమాన ప్ర‌యాణం చాలా సుల‌భం అయిపోయింది. మీరు కేవ‌లం రూ. 150లో ఎంచక్కా విమానం ఎక్కేయ‌వ‌చ్చు. విన‌డానికి ఆశ్చ‌ర్యంగా ఉన్న‌ప్ప‌టికీ ఇది ముమ్మాటికీ నిజం. మ‌రి అతి త‌క్కువ ధ‌ర‌కే టికెట్ తీసుకుని, విమానంలో ప్ర‌యాణం చేసే వీలుక‌ల్పిస్తున్న‌ది ఎవ‌రు? ఈ ప్ర‌త్యేక ఆఫ‌ర్‌లో జ‌ర్నీ చేయాలంటే ఏం చేయాలి? ఇలా మీ మ‌న‌సులో త‌లెత్తుతోన్న అన్ని ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇక్క‌డ చూసేద్దాం రండి!

మ‌న దేశంలో విమాన ప్ర‌యాణం చాలా ఖ‌రీదైన‌దిగా భావిస్తున్నాంటారు. అయితే, దేశ వ్యాప్తంగా కొన్ని నగరాల్లో విమాన ఛార్జీలు చాలా త‌క్కువ అని చాలామందికి తెలియ‌దు. ఉదాహ‌ర‌ణ‌కు అస్సాంలోని లిలాబరి - తేజ్‌పూర్ రూట్‌లో విమాన ప్రయాణానికి కేవ‌లం రూ. 150 ఛార్జీ అవుతుందంటే అలాంటి వారికి ఆశ్చ‌ర్యంగానే ఉంటుంది. ఈ త‌ర‌హాలో ప్రాంతీయ కనెక్టివిటీ స్కీమ్(RCS) కింద నడిచే విమానాల‌లో ప్ర‌యాణ‌ వ్యవధి సుమారు 50 నిమిషాల వ‌ర‌కూ ఉంటుంది. అలాంటి మార్గాల్లో ప్రయాణ ఛార్జీలు చాలా అంటే.. చాలా తక్కువ. మ‌నం చేప్పుకుంటున్న ఈ మార్గంలోనే కాదు.. టికెట్ బేస్ ఫేర్ వెయ్యి రూపాయ‌ల‌ కంటే తక్కువ ఉన్న సర్వీస్‌లు కూడా ఉన్నాయి. ఇలాంటి రూట్‌లు ప్రాంతీయ ఎయిర్ కనెక్టివిటీ పథకం ప‌రిధిలోకి వ‌స్తాయి. ఎయిర్‌లైన్ ఆపరేటర్‌ల‌కు ఈ పథకం ద్వారా వివిధ ప్రోత్సాహకాలు కూడా అందుతాయి.

Bumper offer Take a ticket with Rs 150 travel by air

ఈశాన్య ప్రాంతంతోపాటు దక్షిణాదిలో..

మ‌న దేశంలో సుమారు 22 మార్గాల‌లో ప్రాథమిక విమాన ఛార్జీలు ఒక్కొక్కరికి రూ. 1,000 కంటే తక్కువగా ఉన్న‌ట్లు ట్రావెల్ పోర్టల్ ఇక్సిగో నివేదిక ప్రకారం తెలుస్తోంది. ఇలాంటి వాటిలో అస్సాంలోని లిలాబరి-తేజ్‌పూర్‌లను కలిపే విమానాలకు అతి తక్కువ వన్-వే ఛార్జీ రూ. 150గా ఉన్న‌ట్లు తెలిపింది. ఈ రూట్‌లో అలయన్స్ ఎయిర్ విమానాలను నడుపుతోంది. ఈశాన్య ప్రాంతంలో ఒక్కో వ్యక్తికి రూ. 150 నుండి రూ. 199 వరకు బేస్ విమాన ఛార్జీలు గ‌ల మార్గాలు చాల‌నే ఉన్నాయి. ఈ నివేదిక ప్రకారం.. ఈశాన్య ప్రాంతంతోపాటు దక్షిణాదిలో బెంగళూరు-సేలం, కొచ్చిన్-సేలం వంటి రూట్‌ల‌లోనూ త‌క్కువ ఛార్జీలు ఉన్న‌ట్లు స‌మాచారం.

డిమాండ్ తక్కువగా ఉన్న రూట్‌ల‌లో

త‌క్కువ ధ‌ర‌లు ఉన్న కొన్ని రూట్‌ల‌ను ప‌రిశీలిస్తే.. గౌహతి - షిల్లాంగ్ ప్రయాణాలకు బేస్ ఛార్జీ కేవ‌లం రూ. 400గా ఉంటుంది. అలాగే, ఇంఫాల్-ఐజ్వాల్, దిమాపూర్-షిల్లాంగ్, షిల్లాంగ్-లిలాబరీ చార్జీ రూ.500, బెంగళూరు-సేలం రూ.525, గౌహతి-పాసిఘాట్ విమాన ఛార్జీ రూ.999, లిలాబరి-గౌహతి మార్గంలో విమాన ఛార్జీ రూ.954గా ఉంది. నిజానికి, డిమాండ్ తక్కువగా ఉన్న రూట్‌ల‌లో ఛార్జీలు త‌క్కువ‌గా ఉంటాయి. ఇలాంటి రూట్‌లో ఇతర రవాణా మార్గాల ద్వారా ప్రయాణం చేస్తే సుమారు 5 గంటల వ‌ర‌కూ సమయం పట్టే అవ‌కాశం ఉంది. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) చెప్పిన దానిని బ‌ట్టీ.. మార్చి 31, 2024 వరకు ప్రాంతీయ కనెక్టివిటీ పథకం అంటే UDAN (ఉడే దేశ్ కా ఆమ్ నాగ్రిక్) కింద 559 రూట్‌లను గుర్తించిన‌ట్లు తెలుస్తోంది.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+