ప్రయాణికులకు తెలంగాణ ఆర్‌టీసీ ఓ శుభవార్తను అందించింది . హైదరాబాద్ నుంచి విజయవాడ రోడ్డు మార్గంలో ప్రయాణం చేసేవారికి తెలంగాణ ఆర్టీసీ టిక్కెట్లపై డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించేసింది. టికెట్ ధరలో 10 శాతం రాయితీని కల్పిస్తున్నట్లు తెలంగాణ ఆర్‌టీసీ తెలిపింది. ఈ మేరకు సంస్థ ఎండీ సజ్జనార్ ఓ ప్రకటనను కూడా విడుదల చేశారు. ఇప్పటికే పలు రైళ్లు రద్దయిన నేపథ్యంలో టీఎస్ ఆర్‌టీసీ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ప్రయాణికులు హర్షం వక్తం చేస్తున్నారు.
హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే ప్రయాణికుల కోసం తెలంగాణ ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రూట్లలో ప్రయాణించే వారికి టిక్కెట్లపై డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. ఈ మేరకు వాటి వివరాలను కూడా పేర్కొంది. ఈ మార్గాలలలో రాకపోకలు సాగించే వారి కోసం టికెట్ ధరలో 10 శాతం రాయితీని కల్పిస్తున్నట్లు తెలంగాణ ఆర్‌టిసి తెలిపింది. నిజానికి, తెలంగాణ నుంచి విజయవాడకు నిత్యం పెద్ద ఎత్తున ప్రయాణికులు జర్నీ చేస్తుంటారు. అయితే, గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఈ మార్గంలో ప్రయాణం పెద్ద సవాళుగా మారిపోయింది.
పలు రైలు సేవలు కూడా రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. అనేక చోట్ల వరదలకు రోడ్లు కూడా కొట్టుకుపోవడంతో ఈ రోడ్డు మార్గంలో రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. పైగా మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించిన నేపథ్యంతో రోడ్డు రవాణా వ్యవస్థ తీవ్ర నష్టాలలోకి వెళ్లింది.

రవాణా వ్యవస్థ కీలకం..
వరదల కారణంగా ఎదురవుతోన్న నష్టాలను నివారించేందుకు టీఎస్ ఆర్‌టీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే, విజయవాడలోని సింగ్‌నగర్, ప్రకాష్‌నగర్, వాంబే కాలనీ లాంటి ప్రాంతాలు పూర్తిగా నీటమునిగాయి. దీంతో ఆ ప్రాంతాలనుకు చెందిన కుటింబీకులను, బంధువులను కలిసేందుకు హైదరాబాద్ నగరం నుంచి బయలుదేరేవారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. కానీ, ఇప్పటికే రైలు మార్గంలో దాదావు చాలా రైళ్లను రద్దయ్యాయి.
ఈ నేపథ్యంతో రోడ్డు రవాణా వ్యవస్థ కీలకంగా మారింది. ఇప్పటికే పూర్తిగా నష్టపోయి, కష్టాల్లో ఉన్న వారికి తమవంతుగా సాయమందించేందుకు కూడా టీఎస్ ఆర్‌టీసీ తీసుకున్న నిర్ణయం అభినందనీయమని కొందరు అభిప్రాయపడుతున్నారు. రోడ్డు మార్గంలో రవాణా వ్యవస్థ పూర్తిగా అందుబాటులోకి రావడంతో ప్రయాణాలు చురుకుగా సాగుతున్నాయి.

ముందస్తు రిజర్వేషన్..
విజయవాడ రోడ్డు మార్గంలో ప్రయాణం చేయదలచిన ప్రయాణికులకు రాజధాని ఏసీ, సూపర్ లగ్జరీ బస్సులలో పది శాతం రాయితీ వర్తిస్తుందని తెలంగాణ ఆర్‌టిసి స్పష్టం చేసింది. ఈ డిస్కౌంట్ సదుపాయాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని సూచించింది. అయితే, ఈ మార్గాలల్లో ప్రయాణించే వారు ముందస్తు రిజర్వేషన్ కోసం తెలంగాణ ఆర్‌టిసి అధికారిక వెబ్‌సైట్‌ను https://tgsrtcbus.in సంప్రదించగలరని పేర్కొంది. ఈ మేరకు సంస్థ ఎండీ సజ్జనార్ పలు వివరాలను కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్‌టీసీ అందుస్తున్న ఈ రాయితీ సేవలను వినియోగించుకోగలరని అధికారులు కోరుతున్నారు.



Click it and Unblock the Notifications













