Search
  • Follow NativePlanet
Share
» »ఏప్రిల్ 12 నుంచి మీనాక్షి అమ్మన్ ఆలయంలో చితిరై ఉత్సవాలు.

ఏప్రిల్ 12 నుంచి మీనాక్షి అమ్మన్ ఆలయంలో చితిరై ఉత్సవాలు.

భారతదేశంలో విభిన్న మ‌తాలు, విభిన్న వ‌ర్గాల ప్ర‌జ‌లు ఉంటారు. దేశంలో అనేక పండుగ‌లు వారి మ‌తాల‌కు, సంస్కృతి సంప్ర‌దాయాల‌కు ప్ర‌సిద్ధిచెందాయి. భారతదేశ వైవిధ్యం దాని అతిపెద్ద ప్రత్యేకత. ఇక్క‌డి ఒక్కో ప్రాంతం ఒక్కో పండుగ‌కు పేరుగాంచింది. దీని కారణంగా లక్షలాది మంది విదేశీ పర్యాటకులు వివిధ పండుగలు మరియు వేడుకలలో పాల్గొనడానికి భార‌త్‌కు త‌ర‌లివ‌స్తుంటారు. ఉత్తర భారతదేశంలోని ప్ర‌జ‌లు హోలీని ఏవిధంగా అయితే జ‌రుపుకుంటారు. హోలీ సందడిలో ఉండగానే, దక్షిణ భారతదేశంలోని తమిళనాడులోని ప్ర‌ధాన పండుగైన చితిరై పండుగకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి.

తమిళనాడులోని మధురైలో చితిరై ప్రధాన పండుగ. ఈ పండుగను ప్ర‌త్య‌క్షంగా వీక్షించేందుకు ఇతర రాష్ట్రాలు, ఖండాల నుంచి కూడా ప‌ర్యాట‌కులు త‌ర‌లివ‌స్తుంటారు. ఈ ఉత్స‌వం కోడియెట్రం (జెండా ఎగురవేయడం)తో మొదలవుతుంది, ఇది పండుగ ప్రారంభాన్ని సూచిస్తుంది. అన్ని పండుగల మాదిరిగా కాకుండా ఈ చితిరై పండుగ మన ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలు ఆచార వ్యవహారాలను చూపిస్తుంది. సాంప్రదాయకంగా, తమిళ మొదటి నెలలో జరిగే ఈ వేడుకను చితిరై పండుగ అని అంటారు. ఇది ఆంగ్ల గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్/మే నెల‌ల్లో జరుపుకుంటారు. మదురైలోని మీనాక్షి ఆలయంలో ఈ పండుగ ఉత్స‌వాలు జ‌రుగుతాయి. ఈ ఏడాది చితిరై పండుగ ఏప్రిల్ 12 నుంచి ప్రారంభం కానుంది.

chithiraiutsavsatmeenakshiammantemple

15 రోజులు మీనాక్షి అమ్మ‌న్ ఆల‌యంలో పూజ‌లు..

ఈ పండుగ మీనాక్షి అమ్మన్ ఆలయంలో ధ్వజారోహణంతో ప్రారంభమవుతుంది. దాదాపు నెల రోజుల‌పాటు జరిగే ఈ పండుగలో మొదటి 15 రోజులు భ‌క్తులు వివిధ నియమాలు మరియు సంప్రదాయాలు పాటిస్తారు. ఈ రోజుల్లో మీనాక్షి దేవి పట్టాభిషేకం, సుందరేశ్వరుని కల్యాణం జరుగుతుంది. నమ్మకం ప్రకారం, మీనాక్షి దేవి తల్లి పార్వతి మరియు సుందరేశ్వర్ మహాదేవుని ప్ర‌తిరూపంగా భావిస్తుంటారు. కల్లజగ (విష్ణువు అవతారం) తన సోదరి మీనాక్షి వివాహానికి హాజరయ్యేందుకు బంగారు గుర్రంపై స్వారీ చేసినట్టు చారిత్ర‌క క‌థ‌నాలు ఉన్నాయి. ఈ విధంగా, పురాతన కాలంలో ఈ పండుగను శైవ మరియు వైష్ణవ శాఖలు కలిసి జరుపుకునేవార‌ని ఇక్క‌డి వారు చెబుతుంటారు.

chithiraiutsavsatmeenakshiammantemple

ఏప్రిల్ 12 నుండి ఏప్రిల్ 23వ‌ర‌కు పండుగ వేడుక‌లు...

చితిరై పండుగలోని ప‌దిహేను రోజుల‌లో కల్లజగ భగవానుని అల్గర్ కోయిల్ ఆలయం నుండి మదురైకి తీసుకువెళ్లేందుకు ఊరేగింపులు మరియు ఉత్సవాల కార్య‌క్ర‌మం ఉంటుంది. ఈ పండుగ ఎంతో సాంప్రదాయకంగా వైగై నది ఒడ్డున పూజలు, ఇత‌ర ఆచారాల‌తో జ‌రుగుతుంది. ఈ వేడుకలు దాదాపు నెల రోజుల పాటు జరుగుతాయ‌ని, ఏప్రిల్ 12 నుండి ఏప్రిల్ 23 వరకు ఈపూజ‌లు ఉంటాయ‌ని అమ్మన్ ఆలయ నిర్వాహకులు ప్రకటించారు.

మొద‌టిరోజు ధ్వ‌జారోహ‌ణంతో ప్రారంభ‌మ‌య్యే ఉత్స‌వాలు..

"ఏప్రిల్ 12వ తేదిన ఉదయం 9.55 నుండి 10.19 మధ్య మిథున లగ్నంలో ధ్వజారోహణంతో ఈ ఉత్స‌వాలు ప్రారంభ‌మవుతాయి. ఉత్సవాల ప్రధాన కార్యక్రమాలలో ఏప్రిల్ 19న పట్టాభిషేకం, ఏప్రిల్ 20న మీనాక్షి అమ్మన్ దిక్ విజయం, ఏప్రిల్ 21న మీనాక్షి-సుందరేశ్వరుల స్వర్గీయ కళ్యాణం జ‌ర‌గ‌నున్నాయి. ఏప్రిల్ 22న రథోత్సవం, ఆ తర్వాత ప్రధాన కార్యక్రమం. ఉత్సవం, ఏప్రిల్ 23న లార్డ్ కళాఅలగర్ వైగైలోకి ప్రవేశించడం వ‌టి కార్య‌క్ర‌మాల‌న్నీ ఉంటాయ‌ని ఆల‌య నిర్వాహ‌కులు తెలిపారు.

More News

    Read more about: madurai tamil nadu
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+