Search
  • Follow NativePlanet
Share
» »మోడీ ప్ర‌త్యేక పూజ‌లు చేసిన మీనాక్షి అమ్మాన్​ ఆలయ ప్ర‌త్యేక‌త‌లు తెలుసా?!

మోడీ ప్ర‌త్యేక పూజ‌లు చేసిన మీనాక్షి అమ్మాన్​ ఆలయ ప్ర‌త్యేక‌త‌లు తెలుసా?!

తమిళనాడు పర్యటనలో భాగంగా మధురై మీనాక్షి అమ్మాన్​ ఆలయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సందర్శించి, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ సందర్శన సందర్భంగా మోడీ సంప్రదాయ దుస్తులు దోతి, చొక్కా ధరించారు. ఆలయ వేదపండితులు పూర్ణకుంభంతో ప్రధానికి స్వాగ‌తం ప‌లికారు. ప్ర‌ధాని సంద‌ర్శ‌న‌తో మ‌ధురై మినాక్షి అమ్మాన్ ఆల‌యం విశేషాల‌ను తెలుసుకునేందుకు చాలా మంది ఆస‌క్తి చూపుతున్నారు. ఈ ఆల‌య ప్ర‌త్యేక‌త‌లను తెలుసుకుందాం.

భారతదేశంలోని పురాతన నగరాలలో త‌మిళ‌నాడులోని మదురై ఒక‌టి. ఈ న‌గ‌రం ప్ర‌పంచ‌ఖ్యాతి గ‌డించ‌డంలో ఇక్క‌డ నిర్మిత‌మైన‌ మీనాక్షి అమ్మన్ దేవాలయం కార‌ణంగా చెప్పొచ్చు. ఇది ద్రావిడ వాస్తుశైలి యొక్క నిజమైన అద్భుతం నిర్మాణంగా.. భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ హిందూ దేవాలయాలలో ఒకటిగా పేరుగాంచింది. మీనాక్షి అమ్మన్ ఆలయ సముదాయం సంద‌ర్శ‌కులను ఎంత‌గానో ఆకట్టుకుంటుంది. మొత్తం 15 ఎకరాల విస్తీర్ణంలో నాలుగు ప్రవేశాలు ద్వారాల‌తో ఎంతో గంభీరంగా ద‌ర్శ‌న‌మిస్తుంది ఈ ఆల‌యం. అందంగా అలంకరించబడిన 15 గోపురాలు ఇక్క‌డికి వ‌చ్చే సందర్శకుల చూపును తిప్పుకోనియ‌వు అంటే అతిస‌యోక్తి కాదు.

meenakshiammantemple1

సంప్రదాయబద్ధంగా దుస్తులు

అయితే, ఈ నిర్మాణ అద్భుతాన్ని ఆస్వాదించడానికి ముందు మీరు ఆలయ సముదాయంలోకి అడుగుపెట్టాల్సి ఉంటుంది. అంటే, ఆలయ సందర్శనకు ముందు గుర్తుంచుకోవలసిన అనేక విషయాలు ఉన్నాయి. మీనాక్షి అమ్మన్ ఆలయం భారతదేశంలోని అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో ఒకటిగా విలాజిల్లుతుండ‌డంతో ఇక్క‌డి ఆలయ నియమ నిబంధనలను చాలా సీరియస్‌గా తీసుకుంటారు. అందులో ప్ర‌ధానంగా మీనాక్షి అమ్మన్ ఆలయానికి వ‌చ్చే సందర్శకులు సంప్రదాయబద్ధంగా దుస్తులు ధరించాల్సి ఉంటుంది. అంటే వారి భుజాలు, కాళ్ళను కప్పి ఉంచేలా అన్న‌మాట‌. పురుషులు, మహిళలు ఇద్దరూ ఈ సాంప్రదాయ భారతీయ దుస్తులు ధరించాల్సి ఉంటుంది.

ఆల‌య సిబ్బందితో స‌హ‌క‌రించాలి..

ఆల‌య‌ పూజారుల‌తోపాటు ఆలయ సిబ్బంది సూచనలను త‌ప్ప‌క‌ అనుసరించాల్సి ఉంటుంది. సందర్శకులు పరిగెత్తకుండా లేదా పెద్ద శబ్దాలు చేయకుండా త‌గు జాగ్ర‌త్తులు తీసుకుంటారు. మృదువుగా మాట్లాడాలని భావిస్తున్నారు. సురక్షితమైన సందర్శనను పూర్తి చేసుకునేందుకు ఆల‌య సిబ్బందితో స‌హ‌క‌రించాలి. మీనాక్షి అమ్మన్ ఆలయం ఉదయం 5 నుండి మధ్యాహ్నం 12:30 వరకు తెరిచి ఉంటుంది. మళ్లీ దర్శనం కోసం సాయంత్రం 4 నుండి రాత్రి 9:30 వరకు తెరవబడుతుంది. ఈ ఆలయం చాలా ప్రసిద్ధి చెందినందున, కొన్నిసార్లు దర్శనానికి 4-5 గంటల సమయం పడుతుంది.

meenakshiammantemple

లోతైన అవగాహన కలిగి ఉండేందుకు..

సందర్శకులు మీనాక్షి అమ్మన్ ఆలయ నిర్మాణ‌శైలిని వెలుపలి ఫోటోలు తీయవచ్చు. లోపలి గర్భగుడిలో ఫోటోగ్రఫీ పూర్తిగా నిషేధించబడింది. ఆలయ పవిత్రతను కాపాడేందుకు నిబంధనలను గౌరవించాల‌ని, నిషేధిత ప్రదేశాలలో ఫోటోలు తీయ‌కూడ‌ద‌నే బోర్డులు క‌నిపిస్తాయి. అంతేకాదు, ఆలయ సముదాయంలోకి మహిళల హ్యాండ్ బ్యాగులను కూడా అనుమతించరు. అలాగే, మీరు ఆలయాన్ని సందర్శించడం ఇదే మొదటిసారి అయితే, గైడెడ్ టూర్‌ల‌ను నియ‌మించుకోవ‌డం మంచిది.

ఆలయ చరిత్ర, నిర్మాణ‌శైలి, మతపరమైన ప్రాముఖ్యత గురించి లోతైన అవగాహన కలిగి ఉండటానికి ఇది ఉత్తమ మార్గం. శిల్పాలలో వర్ణించబడిన కథలు, ఆలయంలో నిర్వహించబడే ఆచారాల గురించి పరిజ్ఞానం గల గైడ్‌లు నిత్యం అందుబాటులో ఉంటారు. ఆల‌యం లోప‌ల‌ శిల్పాలను తాకే ప్ర‌య‌త్నం చేయ‌కండి. పేరుకుపోయిన నూనెలతో మ‌రికిప‌ట్టి ఉండ‌డంతోపాటు ఈ పురాతన నిర్మాణాల ఆకృతిని కోల్పోయే అవకాశం ఉంది.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+