Search
  • Follow NativePlanet
Share
» »ఎక్క‌డికి వెళ్లినా వెరైటీ రుచుల‌ను మిస్ కావొద్దు!!

ఎక్క‌డికి వెళ్లినా వెరైటీ రుచుల‌ను మిస్ కావొద్దు!!

ఎక్క‌డికి వెళ్లినా వెరైటీ రుచుల‌ను మిస్ కావొద్దు!!

సుదూర ప్రాంతాల‌కు ప‌ర్య‌టించ‌డం అంటే ఎన్నో అనుభూతుల‌ను మ‌నసులో ప‌దిల‌ప‌రుచుకోవ‌డ‌మే. అలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో ప్ర‌త్యేక‌త ఉంటుంది. ఆ ప్ర‌త్యేక‌త‌లు ప‌రిస‌రాల‌కే ప‌రిమితం కాకుండా రుచుల‌కు స్థానాన్ని క‌ల్పిస్తాయి. అలాంటి రుచుల‌ను ఆస్వాదించేందుకు నేటి త‌రం యువ‌త ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. మ‌రెందుకు ఆల‌స్యం ఎక్క‌డికి వెళ్లినా అక్క‌డి రుచులను ఎందుకు మిస్ కాకుడ‌దో చూద్దాం.

ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఆహారపు సంప్రదాయం ఉంటుంది. అయితే, పర్యటనలో భాగంగా విహారయాత్రలకు వెళ్ళే సందర్శకులకు అక్కడి ఆహారపు అలవాట్లు ఓ మంచి అనుభూతిని అందిస్తాయి. ఎందుకంటే, ఒకప్పుడు ప్రాంతాల వారీగా వున్న ఆహారపు అలవాట్లు దేశవ్యాప్తమయ్యాయి. విదేశీయులు సైతం ఇప్పుడు మన వంటకాలను రుచి చూసి, వహ్వా! అంటున్నారు. జనం మెచ్చింది తాము చేయడమా.. తాము చేసింది జనం తినడమా అన్న మీమాంస లేకుండా రెస్టారెంట్లు జనం కోరినవే వండి వార్చడంతో పాటు, కొత్త కొత్త రకాలు తెస్తూ, జనాల అభిరుచులకు మరింత మెరుగులు దిద్దుతున్నారు. అది ఎంతలా అంటే, ఆహారపు అలవాట్లను బట్టే మీరు ఫలానా రాష్ట్రం వారుకదూ? అంటూ గుర్తించేంతలా!

ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్షించే రుచులు..

ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్షించే రుచులు..

ఉదాహ‌ర‌ణ‌కు తెలంగాణ రాష్ట్రంలోని హైద‌రాబాదులో మంచి ఫేమస్ ఫుడ్ ఏంటి అంటే టక్కున గుర్తుకు వచ్చేది హైదరాబాద్ బిర్యానీ. ఇక్కడ నవాబుల కాలం నాటి మొఘలాయ్, ఆంధ్రా కుషన్లు చాలా ఫేమస్. ఈ నగరానికి వచ్చి, హైదరబాద్ ధమ్ బిర్యానీ రుచి చూడకుండా వెళ్ళేవారు ఉండరంటే నమ్మండి. అలా బిర్యాని పేరు చెప్ప‌గానే హైద‌రాబాద్ గుర్తొంచేంతగా ఫేమ‌స్ అయ్యింది ఇక్క‌డి బిర్యాని.

అలాగే, పింక్ సిటీగా పేరుపొందిన జైపూర్ వెళ్లే సంద‌ర్శ‌కులు దాల్‌ బాతి చుర్మా రుచి చూడ‌కుండా తిరుగు ప్ర‌యాణం అయ్యేవారు బ‌హుశ ఉండ‌క‌పోవ‌చ్చు. ఆ ప్రాంతానికి ఈ రుచుల ఘుమ‌ఘుమ‌లు అంతలా పేరుతెచ్చాయి. ఇక కోల్‌క‌తా రసగుల్లా పేరు వింటేనే నోరూరిపోతుంది. తీపి రుచులకు కేరాఫ్ అడ్ర‌స్‌గా కోల్‌క‌తాను చెప్పొచ్చు. ఆహార ప్రియుల విడిది కేంద్రంగా ఇది పేరుపొందింది. ఇక్క‌డ ల‌భించే వెరైటీ రుచులు బ‌హుశా దేశంలో మ‌రెక్క‌డా దొర‌క‌వంటే అతిస‌యోక్తి కాదు. కేరళలో పరోటా, చికెన్ కర్రీ కాంబినేషన్ చాలా ఫేమస్. తీర ప్రాంతమైన కేరళలో చేపలతో వండే వెరైటీ వంటకాలకు చాలా గిరాకీ ఉంటుంది. ఇక్కడ చేసే ఫిష్ వెరైటీలు ప్రపంచంలో మరెక్కడా దొరకవు. స‌ముద్ర‌పు ఆహార రుచులు ఈ తీర ప్రాంతాల్లో నిత్యం ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్షిస్తూనే ఉన్నాయి.

నోరూరించే ప్ర‌త్యేక రుచులు..

నోరూరించే ప్ర‌త్యేక రుచులు..

అంతేకాదు, మన దేశ రాజధాని ఆహార‌ప్రియుల‌కు అడ్డా అనే చెప్పాలి. ఢిల్లీ సిటీవాసులు చాలా వరకూ స్ట్రీట్ చాట్స్, రొమాంటి చోలే భతుర స్టాల్స్ రుచులంటే బాగా ఇష్టపడతారు. తందూరీ చికెను ఉత్తమ స్థలాల్లో ఢిల్లీ కూడా ఒకటి. ఇక్కడ తందూరీ చికెన్ స్పైసీగా, పొగ‌లు క‌క్కుతూ మ‌న చేతికి అందిస్తారు. ఈ ప్రాంతంలో వెరైటీ గ్రిల్డ్ చికెన్ చాలా ప్రసిద్ధి. బెంగళూరులో బిసిబెలే బాత్, కీమా కోఫ్తా కర్రీ మంచి ఫేమస్. ఇలా చెప్పుకుంటూపోతే ఒక్కో ప్రాంతంలో ఒక్కో ప్రత్యేకత గల రుచులు నోరూరిస్తాయి. మరి మిస్ కావొద్దు!

ఎక్క‌డికి వెళ్లినా వెరైటీ రుచుల‌ను మిస్ కావొద్దు!!

ఎక్క‌డికి వెళ్లినా వెరైటీ రుచుల‌ను మిస్ కావొద్దు!!

ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఆహారపు సంప్రదాయం ఉంటుంది. అయితే, పర్యటనలో భాగంగా విహారయాత్రలకు వెళ్ళే సందర్శకులకు అక్కడి ఆహారపు అలవాట్లు ఓ మంచి అనుభూతిని అందిస్తాయి. ఎందుకంటే, ఒకప్పుడు ప్రాంతాల వారీగా వున్న ఆహారపు అలవాట్లు దేశవ్యాప్తమయ్యాయి. విదేశీయులు సైతం ఇప్పుడు మన వంటకాలను రుచి చూసి, వహ్వా! అంటున్నారు. జనం మెచ్చింది తాము చేయడమా.. తాము చేసింది జనం తినడమా అన్న మీమాంస లేకుండా రెస్టారెంట్లు జనం కోరినవే వండి వార్చడంతో పాటు, కొత్త కొత్త రకాలు తెస్తూ, జనాల అభిరుచులకు మరింత మెరుగులు దిద్దుతున్నారు. అది ఎంతలా అంటే, ఆహారపు అలవాట్లను బట్టే మీరు ఫలానా రాష్ట్రం వారుకదూ? అంటూ గుర్తించేంతలా!

More News

    Read more about: hyderabadi biryani
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+