Search
  • Follow NativePlanet
Share
» »వేస‌వి విహారంలో వ‌డ‌గాల్పుల బారిన ప‌డొద్దు.. ఈ టిప్స్ పాటించండి!

వేస‌వి విహారంలో వ‌డ‌గాల్పుల బారిన ప‌డొద్దు.. ఈ టిప్స్ పాటించండి!

ఎక్క‌డ చూసినా ఎండ‌లు ఠారెత్తిస్తున్నాయి. ఇప్ప‌టికే ఆంధ్రప్రదేశ్‌లోని 38 మండలాల్లో తీవ్రమైన వేడిగాలులు, 75 మండలాల్లో సాధారణ వేడిగాలులు నమోదయ్యాయి. మొన్న‌ నంద్యాలలో అత్యధికంగా 43 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు, కర్నూలులో 41.8 డిగ్రీల సెల్సియస్, నందిగామలో 40.8, జంగమహేశ్వరపురంలో 40.6, తిరుపతి మరియు కడపలో 40.4, అనంతపురంలో 40.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌య్యాయి.

ఈ ప్ర‌భావం ముఖ్యంగా ప‌ర్యాట‌కరంగంపై తీవ్రంగా పడింద‌నే చెప్పాలి. ఇప్ప‌టికే అనేక ప‌ర్యాట‌క కేంద్రాలు సందర్శ‌కులు లేక వెల‌వెల‌బోతున్నాయి. చాలామంది ఔత్సాహికులు ఇప్ప‌టికే బుక్ చేసుకున్న త‌మ ప్ర‌యాణాల‌ను వాయిదా వేసుకుంటున్నారు. కొత్త ప్ర‌దేశాల‌కు వెళ్లేవారు ఉష్ణోగ్ర‌త‌ల‌ను దృష్టిలో పెట్టుకోవాల‌ని వైద్యులు సూచిస్తున్నారు.

summervacation tips

వేడిగాలుల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

రాబోయే రోజుల‌లో ఉష్ణోగ్రతలు మ‌రింత పెరిగే అవ‌కాశాలు ఉన్న‌ట్లు వ‌స్తోన్న‌ హెచ్చరిక అస్స‌లు మ‌ర్చిపోవ‌ద్దు. ఎక్కువసేపు సూర్యరశ్మి త‌గ‌ల‌డం లేదా బ‌హిరంగ ప్ర‌దేశాల‌లో విహ‌రించ‌డం వ‌ల్ల ప‌ర్యాట‌కులు వేడి తిమ్మిరి మరియు అలసటతో బాధపడే ప్రమాదం ఉంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు హీట్‌స్ట్రోక్‌కు దారితీయవచ్చు. ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు పసిపిల్లలు, పిల్లలు, వృద్ధులు విహారానికి దూరంగా ఉండ‌డం ఎంతో శ్రేయ‌స్క‌రం. దూర ప్రాంతాల‌కు వెళ్లేవారు ఈ స‌మ‌యంలో వేడిగాలుల బారిన‌ప‌డ‌కుండా త‌ప్పించుకునేందుకు అవ‌స‌ర‌మైన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది.

- కొత్త ప్ర‌దేశాల‌లో ఉన్న‌వారు అవ‌కాశం ఉన్నంత వ‌ర‌కూ టీవీ చూడటం, రేడియో వార్తలు వినడం మరియు వార్తాపత్రికలు చదవడం ద్వారా స్థానిక వాతావరణ పరిస్థితుల గురించి ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకోవాలి.

- త‌ప్ప‌నిస‌రి మీరు బయటకు వెళ్లాల్సి వ‌చ్చిన‌ప్పుడు టోపీ ధరించడం లేదా తలపై రుమాలు కట్టుకోవడం, లేత రంగు కాటన్ బట్టలు ధరించడం మరియు కళ్ళకు సన్ గ్లాసెస్ ఉపయోగించడం ద్వారా మిమ్మల్ని మీరు ర‌క్షించుకోవ‌చ్చు. హీట్ వేవ్ సమయంలో బయట నడిచేటప్పుడు గొడుగును తీసుకెళ్లండి. నలుపు లేదా మందపాటి దుస్తులు ధరించకుండా ఉండండి. వీలైనంత వరకు విడిది కేంద్రంలోనే ఉండేందుకు ప్రాధాన్య‌త ఇవ్వాలి.

summervacation tips

- దాహం అనిపించనప్పుడు కూడా తరచుగా లిక్విడ్‌ల‌ను తీసుకోండి. సాల్టెడ్ మజ్జిగ, గ్లూకోజ్ లేదా ORS వంటి పానీయాలను ఎక్కువ‌గా తీసుకోవ‌డం ఉత్త‌మం. ఆల్కహాల్, టీ, కాఫీ మరియు కార్బోనేటేడ్ శీతల పానీయాలకు దూరంగా ఉండండి. ఎందుకంటే అవి శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తాయి.

- ఎవరైనా ఎండ తీవ్రతకు గురైతే వారిని సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించేందుకు స‌హ‌క‌రించండి. తీవ్రమైన సూర్యరశ్మి కారణంగా తల తిరగడం, వాంతులు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు వంటి లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

- విహార స‌మ‌యంలో విడిది కేంద్రం ఎంపిక‌లో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. గ‌ది చల్లగా ఉంచడానికి, ఫ్యాన్‌తోపాటు శీతలీకరణ కోసం పైకప్పును తెల్లగా పెయింట్ ఉన్న గ‌దిని సెల‌క్ట్ చేసుకోండి. కూల్ రూఫ్ టెక్నాలజీ, క్రాస్ వెంటిలేషన్ లేదా థర్మాకోల్ ఇన్సులేషన్ ఉన్న రూమ్‌లు ఈ సీజ‌న్‌లో విడిదికి అనువుగా ఉంటాయి. పైకప్పు మరియు ఇండోర్ మొక్కలు ఉన్న హోట‌ల్ అయితే చల్లగా ఉంచడంతోపాటు ఉష్ణ తాపాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

More News

    Read more about: cold winds summer vacation
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+