ప్రపంచం నలుమూలల నుండి వచ్చే పర్యాటకులను, దేశీయ పర్యాటకులను ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం జనవరి 25న భారతదేశంలో జాతీయ పర్యాటక దినోత్సవాన్ని నిర్వహించుకుంటారు. భారతదేశంలో జాతీయ పర్యాటక దినోత్సవాన్ని 1948 నుంచే ప్రారంభించారు. ఈ ఏడాది జాతీయ పర్యాటక దినోత్సవాన్ని 'సుస్థిర ప్రయాణాలు... కలకాలం జ్ఞాపకాలు' అనే థీమ్‌తో ఈ డేని జరుపుకుంటున్నారు. చాలామంది పర్వతాలలో ప్రయాణించడానికి ఇష్టపడతారు. అందుకే ఎక్కువగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, లడఖ్ వంటి ప్రదేశాలకు వెళుతంటారు.
సముద్రాన్ని ఇష్టపడే వారు గోవా, లక్షద్వీప్, అండమాన్ వంటి ప్రాంతాలకు వెళుతుంటారు. మరికొందరేమో కాశ్మీర్‌లోని అందమైన లోయలు చూడాలనుకుంటారు. ఇక, అడవులను సందర్శించాలనుకునేవారు మాత్రం మధ్యప్రదేశ్, మహారాష్ట్ర లేదా రాజస్థాన్‌లోని దట్టమైన అడవులకు బయలుదేరుతుంటారు. భారతదేశంలోని ప్రతి రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం పర్యాటకులకు ఓ నిధిలాంటిదనే చెప్పుకోవాలి. ఇక, నేషనల్ టూరిజమ్ డే సందర్భంగా ట్రిప్ బడ్జెట్‌కు అనుకూలంగా ఉండేందుకు కొన్ని టిప్స్‌ను ఫాలో అవ్వాల్సిందే..

ఆకస్మిక ప్రణాళికలు వద్దు..
ట్రిప్‌కు వెళ్లేటప్పడు ఎప్పుడూ ఆకస్మిక ప్రణాళికలు వేయకండి. కొంత సమయం తీసుకుని, తగిన జాగ్రత్తలు తీసుకొని పర్యటనలను ప్లాన్ చేయాలి. విహారయాత్రలు కూడా మీ బడ్జెట్‌కు అనుకూలంగా ఉండేలా మాత్రమే చూసుకోండి. చాలా మంది పర్యాటకులు ఉన్న ప్రదేశాన్ని సందర్శించాలని నిర్ణయించుకున్నా లేదా ఖరీదైన నగరాన్ని వీక్షించాలనుకున్న ముందుగా ఆఫ్ సీజన్ కోసం వేచి చూస్తుంటారు. తక్కువ రద్దీ ఉండే ప్రాంతాలకు వెళ్లేలా ప్రణాళికలు వేయండి. హోటల్‌ని ఎన్నుకునేటప్పుడు ఎల్లప్పుడూ జాగ్రత్తగా వ్యవహరించాలి. కేవలం ఒక సైట్‌ని చూసి హోటల్‌ను బుక్ చేయవద్దు. రెండు మూడు ఇతర సైట్‌లను కూడా సంప్రదించాలి. లేదా హోటల్ అధికారిక సైట్ నుండి బుక్ చేస్తే మరింత తగ్గింపు పొందవచ్చు.
ఖరీదైన ఆహారాన్ని కాకుండా స్థానిక ఆహారాన్ని ఎంచుకోండి. మీ ట్రిప్ బడ్జెట్‌ను స్నేహపూర్వకంగా ఉంచుకోవాలనుకుంటే, మాత్రం ఎల్లప్పుడూ స్థానిక ఆహారాన్నే ఎంచుకోవాలి. కొండ గ్రామాలు లేదా ఏదైనా మతపరమైన ప్రదేశాలను సందర్శించాలని అనుకుంటే మాత్రం బసచేసేందుకు సరైన సదుపాయాలను ముందుగానే ఎంపిక చేసుకోండి సమీపంలోని హోమ్ స్టే లేదా ధర్మశాల ఎంపికను ఎంచుకోవడం ఉత్తమం. ఇవి నివసించడానికి చాలా మంచివి, తక్కువ బడ్జెట్‌లో కూడా ఉంటాయి.
ముందస్తు టిక్కెట్లను పొందండి
చివరి క్షణంలో రైలు లేదా విమాన టిక్కెట్లు ఎల్లప్పుడూ అత్యంత ఖరీదైనవిగా ఉంటాయి. కాబట్టి ముందునుంచే విహారయాత్ర ప్లాన్ చేసుకోండి. వాటికి అనుగుణంగానే టిక్కెట్లను కూడా బుక్ చేసుకోండి. ఇది అదనపు రుసుము చెల్లించకుండా మిమ్మల్ని ఆదా చేయడంలో ముందుంటుంది. యాత్రకు వెళ్లినప్పడు ఖచ్చితంగా షాపింగ్ చేయడం మరిచిపోకండి. చూసిన ప్రతి వస్తువును కొనకుండా, ఏదైనా నిర్దిష్ట వస్తువు మీకు ఉపయోగపడుతుందా లేదా అని కొనుగోలు చేసే ముందు ఆలోచించడం మంచిది.
క్యాబ్‌లు లేదా ప్రైవేట్ వాహనాలను బుక్ చేసుకునే బదులు, నగరంలో ప్రయాణించడానికి ఎల్లప్పుడూ మెట్రో, బస్సు, రిక్షా, ఆటో మొదలైన ప్రజా రవాణాను ఎంచుకోవడం ఉత్తమం. వీటివల్ల మీ బడ్జెట్‌లో కూడా చాలా మార్పులు వస్తాయి. ఎక్కడికైనా వెళితే, షాపింగ్ మాల్స్‌ను సందర్శిస్తూ ఉండడం మంచి పద్ధతి కాదు. దానికి బదులుగా, స్థానిక వ్యక్తులను కలుసుకుని, చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసిన కొన్ని సందర్శన స్థలాల గురించి సమాచారాన్ని తెలుసుకునే వాటిని సందర్శించేందుకు ప్రయత్నం చేయండి.



Click it and Unblock the Notifications













