మన దేశంలో ఎక్కువ మంది ప్రజలు ప్రయాణం చేసేదే రైలులోనే. ఎందుకుంటే అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం సౌకర్యవంతమైన ప్రయాణం చేసే వెసులబాటు ట్రైన్‌లోనే ఉంటుంది. సాధారణ రోజుల్లోనే టిక్కెట్లు బుక్ చేద్దామంటే టిక్కెట్లు దొరకని సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాంటిది ఏదైనా పండుగలకు, వెకేషన్లకు వెళ్లాలనుకుంటేనే ఇక అంతే... మరికొద్దిరోజుల్లో దసరా, దీపావళి పండుగ సంబరాలు ప్రారంభంకానున్నాయి. ఈ పండుగలకి సొంతూళ్లకు వెళ్లాలనుకునే వాళ్లు చాలామంది ఉంటారు.
అలాంటి వారికోసం సౌత్‌సెంట్రల్ రైల్వే ఓ శుభవార్తను మోసుకొచ్చింది. సాధారణ రోజుల కంటే పండుగల వేళ రైలు ప్రయాణాల్లో మరింత రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ రద్దీని దృష్టిల్లో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను నడిపేందుకు సిద్ధమయ్యింది. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకోసం ఈ స్పెషల్ ట్రైన్స్ నడవనున్నాయి. సికింద్రాబాద్, తిరుపతి, శ్రీకాకుళంరోడ్, కొల్లాం రైల్వేస్టేషన్ల నుంచి ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే శాఖ అధికారులు వివరించారు.
సికింద్రాబాద్ టు కొల్లాం
ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రం నుంచి కేరళ రాష్ట్రానికి కూడా స్పెషల్ ట్రైన్స్ నడవనున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. 07193 అనే నెంబర్‌గల సికింద్రాబాద్ నుంచి కొల్లాం స్పెషల్ ట్రైన్ సెప్టెంబర్ 25వ తేదీ బుధవారం సాయంత్రం 6:40 గంటలకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుండి బయలుదేరనుంది. ఈ ట్రైన్ నవంబర్ 27వ తేదీ వరకు ప్రతి బుధవారం ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది.

ఇక, ఈ ట్రైన్ మిర్యాలగూడ, సేలం, ఈరోడ్, త్రిస్సూర్, ఎర్నాకుళం మీదుగా ప్రయాణిస్తోంది. అయితే, ఈ ట్రైన్ కొల్లాం జంక్షన్ మరుసటి రోజు రాత్రి 11:55 గంటలకు చేరుకుంటుంది. 07194 అనే నెంబర్‌గల ట్రైన్ తిరిగి కొల్లాం నుంచి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వరకు ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 2:30 గంటలకు బయలుదేరుతుంది.ఆ మరుసటి రోజు ఉదయం 9:40 గంటలకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ చేరుకుంటుంది.
తిరుపతి టు శ్రీకాకుళం..
దసరా, దీపావళి పండుగల వేళ తిరుపతి టు శ్రీకాకుళం రోడ్ 07442 అనే నెంబర్‌గల స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను నడపనున్నారు. ఈ ట్రైన్ అక్టోబర్ 6వ తేది నుంచి నవంబర్ 10వ తేదీ వరకు ప్రతి ఆదివారం ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైన్ తిరుపతిలో ప్రతి ఆదివారం సాయంత్రం 5:10 గంటలకు ప్రారంభమయ్యి రేణిగుంట, నెల్లూరు, విజయవాడ, రాజమండ్రి, దువ్వాడ, విజయనగరం మీదుగా మరుసటిరోజు మధ్యాహ్నం 12:15 గంటలకు శ్రీకాకుళం రోడ్ స్టేషన్‌కు చేరుకుంటుంది.

తిరుపతి వీక్లీ స్పెషల్..
07443 అనే నెంబర్‌గల ట్రైన్ శ్రీకాకుళం రోడ్ స్టేషన్లో అక్టోబర్ 7వ తేది నుంచి నవంబర్ 11వ తేదీ వరకు ప్రతి సోమవారం అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైన్ శ్రీకాకుళం రోడ్ స్టేషన్లో మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరుతుంది. అక్కడి నుండి పెందుర్తి, అనకాపల్లి, సామర్లకోట, ఏలూరు, విజయవాడ, తెనాలి మీదుగా ప్రయాణించి ఆ మరుసటి రోజు ఉదయం 8:20 గంటలకు తిరుపతి రైల్వేస్టేషన్ చేరుకుంటుంది.



Click it and Unblock the Notifications













