హైదరాబాద్ నుంచి షిర్డికి వెళ్లే పర్యాటకుల కోసం తెలంగాణ టూరిజం ఓ సరికొత్త టూర్ ప్యాకేజీనీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా విమాన ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీ హైదరాబాద్ నుంచి ప్రారంభమవుతుంది. కేవలం రెండురోజుల్లోనే ఈ పర్యటన ముగించొచ్చు. ఈ ప్యాకేజీ గురించిన పూర్తి వివవరాల కోసం తెలంగాణ టూరిజం అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించండి.
ఒక థిమ్ పార్క్...
ఈ ప్యాకేజీ తెలంగాణ టూరిజం వెబ్ సైట్ లో' Shiridi - Flight Package' పేరుతో ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. తెలంగాణ టూరిజం షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్ నుంచి షిర్డీకి వెళ్లే ఫ్లైట్ శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి మధ్యాహ్నం 1. 30 గంటలకు ప్రారంభమవుతుంది. అనంతరం మధ్యాహ్నం 2:50 గంటలకు షిర్డీ విమానశ్రయాన్ని చేరుకుంటుంది. ఆ తర్వాత 3:30 గంటలకు హోటల్ లోకి చెకిన్ అవుతారు. అనంతరం షిర్డీ సాయిబాబా దర్శనానికి వెళ్తారు.
ఇక్కడ ప్రతిరోజూ సాయత్రం హారతి కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొనటంతో పాటు వీఐపీ దర్శనం లేదా ఫ్రీ దర్శనం కూడా చేసుకోవచ్చు. షిర్డీ సమపంలో ఒక థిమ్ పార్క్ కూడా ఉంది. రాత్రి 7 గంటల సమయంలో థీమ్ పార్క్ షో నిర్వహిస్తారు. రాత్రి 8 గంటల వరకు పర్యాటకులకు షాపింగ్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. అనంతరం రాత్రి 9 తర్వాత తిరిగిహోటల్ కు చేరుకుంటారు.

రూ. 12499 ప్యాకేజీ...
ఇక మరుసటి రోజు (రెండో రోజు) ఉదయం అల్పాహారం ముగించుకుని అనంతరం పంచముఖి గణపతి టెంపుల్ సందర్శనకు తీసుకుని వెళ్తారు. ఆ తర్వాత షిర్డీ బాబా దర్శనం చేసుకుంటారు. ఇక, ఇక్కడ ఖండోబా ఆలయానికి వెళ్లటంతో పాటు సాయి టీత్ ను కూడా సందర్శిస్తారు. సాయంత్రం 5:30 గంటలకు హైదరాబాద్ కు ఫ్లైట్ లో తిరిగి చేరుకుంటారు. దీంతో ఈ ప్యాకేజీ ముగుస్తోంది. హైదరాబాద్ నుంచి షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ బుక్ చేసుకోవాలనుకునే వారు రూ. 12499 చెల్లించాల్సి ఉంటుంది.
ఈ టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్లతో పాటు వసతి సౌకర్యం కూడా ఇందులోనే ఉంటుంది. ఈ ప్యాకేజీ ఆన్ లైన్ లో బుకింగ్ చేసుకునే అవకాశం లేదు. బుకింగ్ చేసుకోవాలనుకునే అభ్యర్థులు హైదరాబాద్ లోని తెలంగాణ టూరిజం ఆఫీస్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. ఇతర పూర్తి సమాచారం కోసం తెలంగాణ టూరిజం అధికారిక వెబ్‌సైట్ https://tourism.telangana.gov.in/package/shirdiflight ను సంప్రదించగలరు.



Click it and Unblock the Notifications













