Search
  • Follow NativePlanet
Share
» »ఏపీలోని రైలు ప్ర‌యాణికుల‌కు శుభ‌వార్త‌.. దీపావ‌ళికి ప్ర‌త్యేక రైళ్లు..

ఏపీలోని రైలు ప్ర‌యాణికుల‌కు శుభ‌వార్త‌.. దీపావ‌ళికి ప్ర‌త్యేక రైళ్లు..

దేశంలో అత్య‌ధిక శాతం జ‌నాభా ఎంచుకునే ప్ర‌యాణం రైలుమార్గం. ఈ ప్ర‌యాణం ఎంతో సౌక‌ర్య‌వంతంతో కూడుకున్న‌ది. అలాగే, అత్యంత చౌకైన‌ది కూడా. అందుకే ఎక్కువ శాతం మంది రైలు మార్గాలనే ఎంపిక చేసుకుంటారు. సాధార‌ణ రోజుల్లోనే రైలు ప్ర‌యాణాలు చేయాలంటే రిజ‌ర్వేష‌న్ త‌ప్పనిస‌రిగా చేసుకోవాల్సిందే. ఎందుకంటే, అంత ర‌ద్దీగా ఉంటుంది కాబ‌ట్టి. అలాంటిది పండుగ సీజ‌న్‌ల‌లో రైలు ప్ర‌యాణాలంటే.. ఇసుకేస్తే రాల‌నంత జ‌నం ఉంటారు.

ఈ ర‌ద్దీనీ దృష్టిలో ఉంచుకునే రైల్వేశాఖ ప్ర‌త్యేక సంద‌ర్భాల‌ల్లో, పండుగ వేళ స్పెష‌ల్ ట్రైన్స్‌ను ప్ర‌యాణికుల‌కు అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇందులో భాగంగా ఏపీలోని రైలు ప్ర‌యాణికుల‌కు రైల్వేశాఖ ఓ శుభ‌వార్త‌ను మోసుకొచ్చింది. దీపావ‌ళి పండుగ నేప‌థ్యంలో ట్రైన్స్‌లో ప్ర‌యాణికుల ర‌ద్దీనీ దృష్టిలో ఉంచుకుని రైల్వేశాఖ ప‌లు ప్ర‌త్యేక రైళ్లను న‌డిపేందుకు సిద్ధ‌మ‌య్యింది. ఇందులో భాగంగానే ఈ స్పెష‌ల్ ట్రైన్స్ అనంత‌పురం, క‌ర్నూలు జిల్లాలు మీదుగా న‌డ‌వ‌నున్నాయి. రండి వాటి వివ‌రాల‌ను చూసేద్దాం..

రెండు స్పెష‌ల్ ట్రైన్స్‌..

దీపావళి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వేశాఖ‌ బెంగళూరు,కలబురగి స్టేషన్ల మధ్య ప్రత్యేక రైళ్లను నడిపేందుకు సిద్ధ‌మ‌య్యింది. ఇందులో భాగంగా వెస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో స్పెష‌ల్ ట్రైన్స్‌ను ప్రకటించారు. 06533 అనే నెంబ‌ర్‌గ‌ల ఎస్ఎంవీటీ బెంగళూరు-కలబురగి స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల (అక్టోబర్) 30, వ‌చ్చే నెల (నవంబర్) 2 తేదీలలో ప్ర‌యాణికుల‌కు అందుబాటులో ఉంటుంది. ఈ స్పెష‌ల్ ట్రైన్ బెంగళూరులోని శ్రీ ఎం విశ్వేశ్వరయ్య టెర్మినల్ (ఎస్ఎంవీటీ) నుండి రాత్రి 9.15 గంటలకు బయలుదేరుతుంది.

Special trains for Diwali

ఆ మ‌రుస‌టి రోజు ఉద‌యం 7.40 గంటలకు కలబురగి చేరుకుంటుంది. 06534 అనే నెంబ‌ర్‌గ‌ల కలబురగి-ఎస్ఎంవీటీ బెంగళూరు స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఈ నెల (అక్టోబర్) 31, వ‌చ్చే నెల (నవంబర్) 3 తేదీలలో ప్ర‌యాణికుల‌కు అందుబాటులో ఉంటుంది. ఇక ఈ ప్ర‌త్యేక రైలు కలబురగి స్టేషన్ నుంచి ఉదయం 9.35 గంటలకు బయలుదేరుతుంది. అదే రోజు రాత్రి 8 గంటలకు శ్రీ ఎం విశ్వేశ్వరయ్య టెర్మినల్ (ఎస్ఎంవీటీ) బెంగళూరు స్టేషన్‌కు చేరుకుంటుంది.

అద‌న‌పు కోచ్‌లు..

ఇక, ఈ స్పెష‌ల్ ట్రైన్స్ రెండు అనంతపురం, గుంతకల్లు, అదోని, మంత్రాల‌యం, యలహంక, ధర్మవరం,రాయ‌చూర్‌, కృష్ణ‌, యాద‌గిరి, షాబాద్ స్టేష‌న్ల‌లో ప్ర‌యాణికుల కోసం ఆగుతాయి. ఈ ట్రైన్స్‌లో 12 జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లతోపాటు, 3 స్లీపర్ క్లాస్ కోచ్‌లు, రెండు ఏసీ త్రీ-టైర్ కోచ్‌లు, 1 లగేజీ, బ్రేక్ వ్యాన్ కమ్ జనరేటర్ కార్, 1సెకండ్ క్లాస్ లగేజీ, దివ్యాంగు కోచ్‌తో కూడిన బ్రేక్ వ్యాన్ సహా 19 కోచ్‌లున్నాయి. స్పెష‌ల్ ట్రైన్స్‌తో పాటు పండుగ వేల పలు ట్రైన్ల‌కు అద‌నపు కోచ్‌ల‌ను కూడా ఏర్పాటు చేసిన‌ట్లు అధికారులు తెలిపారు. పండుగ సీజన్‌లో వెయిట్‌లిస్ట్ చేసిన ప్రయాణికుల అదనపు రద్దీని క్లియర్ చేసేందుకు నాలుగు రైళ్ల‌కు అద‌న‌పు కోచ్‌లు పెంచాల‌ని ఈస్ట్ కోస్ట్ రైల్వే నిర్ణ‌యిం తీసుకుంది.

ఇందులో భాగంగానే 18117 అనే నెంబ‌ర్‌గ‌ల రూర్కెలా-గుణపూర్ రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌కు నేటి (అక్టోబ‌ర్ 16వ తేది) నుండి 19 వరకు ఒక స్లీపర్ క్లాస్ కోచ్‌ను జ‌త చేశారు. అలాగే, 18118 అనే నెంబ‌ర్ గ‌ల గుణుపూర్ టు రూర్కెలా రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌కు రేప‌టి (అక్టోబ‌ర్ 17వ‌తేది) నుండి 20 వరకు ఒక స్లీప‌ర్ క్లాస్ కోచ్‌ను జ‌త చేశారు. వీటితో పాటు 18107 అనే నెంబ‌ర్‌గ‌ల రూర్కెలా టు జగ్దల్‌పూర్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌కు అక్టోబ‌ర్ 16, 17, 19 తేదీల‌లో ఒక స్లీపర్ క్లాస్ కోచ్‌ను జ‌త చేశారు. 18108 అనే నెంబ‌ర్‌గ‌ల అజగ్దల్‌పూర్ -రూర్కెలా ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌కు అక్టోబ‌ర్ 17, 18, 20 తేదీల్లో ఒక‌ స్లీపర్ క్లాస్ కోచ్‌ను జ‌త చేశారు. ఈ స్పెష‌ల్ ట్రైన్ల‌ను ప్ర‌యాణికుల‌కు ఉప‌యోగించుకోవాల‌ని అధికారులు కోరారు.

More News

    Read more about: special trains diwali anantapur
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+