భవిష్యత్తులో ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకుని మరో జాతీయ రహదారి నిర్మాణం దిశగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ కొత్త హైవే రోడ్డును ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది కార్యరూపం దాల్చితే హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో ప్రయాణం చేసేవారికి చాలా వరకూ ట్రాఫిక్ కష్టాలు తీరినట్లవుతుంది.
ప్రస్తుతం హైదరాబాద్ - బెంగళూరు మధ్య నాలుగు వరుసల జాతీయ రహదారి ఉంది. అయితే, ఈ రెండు ప్రాంతాల మధ్య ఇటీవల కాలంలో రద్దీ భారీగా పెరిగింది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈ మార్గంలో అదనంగా కొత్త హైవే రోడ్డును ఏర్పాటు చేయాలని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది. ఇందులో భాగంగా 'మాస్టర్ ప్లాన్ ఫర్ నేషనల్ హైవేస్ విజన్-2047'లో ఈ హైవేను నిర్మించేందుకు ప్లాన్‌ను సిద్ధం చేసింది. తద్వారా నాగ్‌పుర్ - హైదరాబాద్ - బెంగళూరు నగరాల మధ్య రాకపోకలను మరింతగా పెంచాలని కేంద్రం రెండేళ్ల కిందటే భావించింది. ఈ రహదారిని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ప్రయాణ సమయం మరింత తగ్గే అవకాశం ఉంటుంది.
12 లైన్‌ల కోసం ఆలోచన చేసినప్పటికీ..
ఇప్పటికే నాగ్‌పుర్ నుంచి బెంగళూరు వరకు జాతీయ రహదారి నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారు. అలాగే, హైదరాబాద్ నుంచి బెంగళూరును కూడా అనుసంధానించాలి అనుకుంటున్నారు. అందుకోసం డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టును రూపొందించేందుకు సిద్ధమైంది. ఇందుకోసం డీపీఆర్ తయారీకి కాంట్రాక్టర్ ఎంపిక కోసం కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ టెండర్లు పిలుస్తోంది. ఈ ఏడాది సెప్టెంబరు 12వ తేదీ వరకూ టెండర్లు ఆహ్వానిస్తున్నారు.

ట్రాఫిక్ తగ్గించడమే ప్రధాన ఎజెండాగా ఈ కొత్త మార్గాన్ని ఆరు వరుసల్లో నిర్మించాలన్నది కేంద్రం ఆలోచన. అయితే, ఇందుకోసం ముందు 12 లైన్ల రహదారి కోసం ఆలోచన చేశారు. కానీ, ప్రతిపాదన ఆరు లైన్‌లకే పరిమితమైనట్లు సమాచారం. ఈ నిర్మాణంలో ఒకేసారి ఆరు లైన్లు ప్లాన్ చేస్తారా? లేక ముందు నాలుగు లైన్‌లు నిర్మించి, తర్వాత మరో రెండు లైన్‌లకు విస్తరిస్తారా అనేదానిపైన ఇంకా స్పష్టత రాలేదు.
హైస్పీడ్, గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారిగా..
కొత్తగా నిర్మించబోయే హైదరాబాద్ - బెంగళూరు జాతీయ రహదారిని హైస్పీడ్, గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారిగా ఏర్పాటు చేయబోతున్నారు. ఈ రహదారిపై గంటకు 120 కి.మీ వేగంతో వాహనాలు రాకపోకలు సాగించేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుత అంచనాల ప్రకారం 508.461 కి.మీ మేర కారిడార్‌ను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం 44వ నంబరు జాతీయ రహదారిగా హైదరాబాద్ నుంచి బెంగళూరు మధ్య 556 కి.మీ.
నాలుగు లైన్‌ల రోడ్డు ఉండగా, ఇందులో తెలంగాణలో 190, ఆంధ్రప్రదేశ్‌లో 260, కర్ణాటకలో 106 కి.మీ.ల వరకు విస్తరించి ఉంది. ఈ నాలుగు లైన్‌ల రోడ్డును ఆరు లైన్‌లుగా విస్తరించాలని తొలుత భావించారు. వివిధ కారణాలతో అది కార్యరూపం దాల్చలేదు. తాజాగా హైస్పీడ్, గ్రీన్‌ఫీల్డ్ కారిడార్‌ను ఏర్పాటు చేయాలని మాస్టర్‌ప్లాన్ సిద్ధం చేశారు. ఇది అందుబాటులోకి వస్తే హైదరాబాద్-బెంగళూరు ప్రయాణం మరింత సౌకర్యవంతగా ఉండనుంది.



Click it and Unblock the Notifications













