Search
  • Follow NativePlanet
Share
» »తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. 1400 ఆర్టీసీ బస్సులు, 432 రైళ్లు ర‌ద్దు..

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. 1400 ఆర్టీసీ బస్సులు, 432 రైళ్లు ర‌ద్దు..

తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న‌కుండ‌పోత వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తం అయ్యింది. గ‌త కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కు ఏపీ, తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటి వరకూ 432 రైళ్లను రైల్వేశాఖ ర‌ద్దుచ‌సిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో తెలంగాణ ఆర్‌టిసి కూడా ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. వ‌ర్షాల కార‌ణంగా 1400 ఆర్టీసీ బస్సులను కూడా ర‌ద్దు చేసింది. వాటి వివరాల‌ను కూడా పొందుప‌రించింది.

ఈ భారీ వ‌ర్షాల‌కు వాగులు, వంక‌లు పొర్ల‌డ‌మే కాకుండా జాతీయ రహదారుల‌న్నీ చెరువుల‌ను త‌ల‌పిస్తున్నాయి. రోడ్ల‌పై వరద నీరు చేరి కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. జ‌న‌జీవ‌నం స్తంభించింపోయింది. ఈ వర్షాలకు రైల్వే ట్రాక్ లు కొట్టుకుపోవడంతో ఏపీ, తెలంగాణ మీదుగా నడిచే 432 రైళ్లను రైల్వేశాఖ అధికారులు ర‌ద్దుచేశారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే బస్సులతో పాటు జిల్లాలకు వెళ్లే సుమారు 1400 బస్సులను కూడా రద్దు చేసినట్లు తెలంగాణ ఆర్‌టిసి అధికారులు తెలిపారు.

టీజీఎస్ఆర్టీసీ కీల‌క నిర్ణ‌యం.. 1400 బస్సులు రద్దు..

వ‌ర్షాల కార‌ణంగా టీజీఎస్ఆర్‌టిసి కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఖమ్మం, విజయవాడ, మహబూబాబాద్ పలు మార్గాల్లో బస్సులను రద్దు చేసినట్లు టీజీఎస్ఆర్టీసీ తెలిపింది. వీటితోపాటు విజయవాడ వెళ్లే పలు ఆర్టీసీ బస్సులను కూడా గుంటూరు మీదుగా మళ్లిస్తున్న‌ట్లు అధికారులు తెలిపారు. వరదలు కాస్త త‌గ్గుముఖం ప‌ట్ట‌గానే బస్సు సర్వీసులను పునరుద్ధరిస్తామన‌ని అధికారులు తెలిపారు. మొత్తం 1400 బ‌స్సులను ర‌ద్దు చేస్తున్న‌ట్లు తెలిపారు. ఆదివారం రాత్రి వరకు 877బ‌స్సుల‌ను ర‌ద్దు చేయ‌గా, సోమవారం మరో 570 కలిపి మొత్తం 1400కు పైగా బస్సులను రద్దు చేశారు. ఖమ్మం జిల్లాకు మాత్రం యథావిధిగా బస్సులు న‌డుస్తాయ‌ని అధికారులు పేర్కొన్నారు. వరదల కార‌ణంగా వికారాబాద్‌లో 212 బస్సులకు గానూ 50 మాత్రమే నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు వివ‌రించారు.

Heavy rains in Telugu states 1400 RTC buses 432 trains cancelled

432 రైళ్లు రద్దు, ప‌లురైళ్లు దారి మ‌ళ్లింపు..

రెండు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కు ఇప్పటికే ప‌లు రైళ్ల‌ను ర‌ద్దు చేసిన రైల్వేశాఖ ఇప్ప‌టికి ఆ సంఖ్య‌ను 432కు పెంచేసింది. మొత్తం 432 రైళ్లు రద్దు చేసినట్లు సౌత్ సెంట్ర‌ల్ రైల్వే అధికారికంగా ప్రకటించింది. వీటితోపాటు మ‌రో140 రైళ్లను దారి మళ్లించినట్లు, మరో 13 రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. రద్దైన వాటిలో సూపర్‌ఫాస్ట్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు, పాసింజర్ ట్రైన్స్‌కూడా ఉన్న‌ట్లు తెలిపారు.

రద్దైన రైళ్ల జాబితా ఇదే...

02.09.24 వ తేదిన 17233 అనే నెంబ‌ర్‌గ‌ల సికింద్రాబాద్ టు సిర్పూర్ కాగజ్ నగర్ ట్రైన్

03.09.24 వ తేదిన 17234 అనే నెంబ‌ర్‌గ‌ల సిర్పూర్ కాగజ్ నగర్ టు సికింద్రాబాద్ ట్రైన్

03.09.24వ తేదిన 12774 అనే నెంబ‌ర్‌గ‌ల సికింద్రాబాద్ టు షాలిమార్ ట్రైన్‌

04.09.24 వ తేదిన 12773 అనే నెంబ‌ర్‌గ‌ల షాలిమార్ టు సికింద్రాబాద్ ట్రైన్‌

02.09.24 వ తేదిన 22204 అనే నెంబ‌ర్‌గ‌ల సికింద్రాబాద్ టు విశాఖపట్నం ట్రైన్‌

03.09.24 వ తేదిన 12864 అనే నెంబ‌ర్‌గ‌ల SMVT బెంగళూరు టు హౌరా ట్రైన్‌

02.09.24 వ తేదిన 17487 అనే నెంబ‌ర్‌గ‌ల కడప టు విశాఖపట్నం ట్రైన్‌

02.09.24 వ తేదిన 17409 అనే నెంబ‌ర్‌గ‌ల ఆదిలాబాద్ టు నాందేడ్ ట్రైన్

02.09.24 వ తేదిన 17410 అనే నెంబ‌ర్‌గ‌ల నాందేడ్ టు ఆదిలాబాద్ ట్రైన్‌

02.09.24 వ తేదిన 12805 అనే నెంబ‌ర్‌గ‌ల విశాఖపట్నం టు సికింద్రాబాద్ ట్రైన్‌

02.09.24 వ తేదిన 18463 అనే నెంబ‌ర్‌గ‌ల భువనేశ్వర్ టు KSR బెంగళూరు ట్రైన్‌

02.09.24 వ తేదిన 22701 అనే నెంబ‌ర్‌గ‌ల విశాఖపట్నం టు గుంటూరు ట్రైన్‌

03.09.24 వ తేదిన 20707 అనే నెంబ‌ర్‌గ‌ల సికింద్రాబాద్ టు విశాఖపట్నం ట్రైన్‌

03.09.24 వ తేదిన 20708 అనే నెంబ‌ర్‌గ‌ల విశాఖపట్నం టు సికింద్రాబాద్ ట్రైన్‌

03.09.24 వ తేదిన 20833 అనే నెంబ‌ర్‌గ‌ల విశాఖపట్నం టు సికింద్రాబాద్ ట్రైన్‌

03.09.24 వ తేదిన 20834 అనే నెంబ‌ర్‌గ‌ల సికింద్రాబాద్ టు విశాఖపట్నం ట్రైన్‌

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+