Search
  • Follow NativePlanet
Share
» »హీరో సిద్ధార్థ్, నటి అదితి రావులు వివాహం చేసుకుంది వ‌న‌ప‌ర్తిలోని ఈ ఆల‌యంలోనే...

హీరో సిద్ధార్థ్, నటి అదితి రావులు వివాహం చేసుకుంది వ‌న‌ప‌ర్తిలోని ఈ ఆల‌యంలోనే...

సెల‌బ్రిటీల పెళ్లిలంటే డెస్టినేష‌న్ వెడ్డింగ్‌ల‌వ‌నీ హాడావిడి చేస్తుంటారు. ఎక్కడో విదేశాల్లోనే లేక‌పోతే రాజస్థాన్‌లోని ప్యాలెస్‌ల‌లోనో చేసుకుంటుంటారు. కానీ, ఒక‌ప్ప‌టి టాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్, నటి అదితి రావు హైదరి మాత్రం చాలా వినూత్నంగా ఆలోచించారు. ఇటీవ‌లే వారిద్ద‌రూ వివాహ‌బంధంతో ఒక్క‌ట‌య్యారు. వారి పెళ్లి అంద‌రీ సెల‌బ్రిటిల్లా జ‌ర‌గ‌లేదు. వీరి పెళ్లి తెలంగాణ‌లోని ఓ పురాత‌న ఆల‌యంలో జ‌రిగింది.

అది కూడా ఎంతో సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా కుటుంబ‌స‌భ్యుల సమ‌క్షంలో జ‌రిగింది. సాధార‌ణంగానే సెల‌బ్రిటీల పెళ్లిలంటేనే వారి పెళ్లి ప్రాంతం కూడా హైలెట్‌గా నిలుస్తుంది. కానీ, వీరు పెళ్లి చేసుకున్న ప్రాంతం ఇప్ప‌డు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆ ప్ర‌దేశం గురించి చాలామంది తెలుసుకోవాల‌నుకుంటున్నారు. ఈ పురాత‌న ఆల‌యం ఎక్క‌డుంది..? దాని ప్ర‌త్యేక‌తలేంటీ అనే విష‌యాలు ఇప్ప‌డు తెలుసుకుందాం..

వారికి ఎంతో ప్ర‌త్యేకం..

ఈ పురాత‌న ఆలయం పేరు రంగనాయక స్వామి ఆలయం. ఈ ఆల‌యం తెలంగాణ రాష్ట్రంలో వెల‌సింది. బాలీవుడ్ న‌టి అదితిరావు హైదరీ తాత (అమ్మ వాళ్ల నాన్న) వనపర్తి సంస్థానానికి చివరి రాజు. అందుకే అదితిరావు వాళ్ల కుటుంబం తరచూగా ఈ ఆల‌యంలో పూజ‌లు చేసేందుకు వెళ్తుంటార‌ని ఇటీవ‌లే న‌టి అదితిరావు ఓ ఇంట‌ర్వ్యూలో పేర్కొన్నారు. ఈ ఆల‌యం 400 ఏళ్ల క్రితంది. ఈ ఆలయం అదితిరావు కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైన‌దని న‌టి పేర్కొన్నారు. రాష్ట్రంలోని వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ లో శ్రీ రంగనాయకస్వామి ఆలయం వెల‌సింది.

vanaparthi temple

ఆల‌య చ‌రిత్ర‌...

18వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆల‌యం ఎంతో ప్ర‌త్యేక‌మైన‌ది. విజయనగర పాలకుడు కృష్ణదేవరాయలు శ్రీరంగానికి వెళ్లి అక్కడి శ్రీ రంగనాయకస్వామి ఆలయాన్ని చూసి ఎంతో ముగ్ధుడ‌య్యాడట‌. అనంత‌రం ఈ ఆల‌యాన్ని అక్క‌డ నిర్మించిన‌ట్లు చ‌రిత్ర చెబుతోంది. ఆ మ‌రుస‌టి రోజు శ్రీ మహా విష్ణువు మ‌హ‌రాజు కలలోకి వచ్చి తన విగ్రహం రాజ్యంలో ఉందని, ఒక డేగ ఆ ప్రదేశానికి తీసుకెళ్తుందని రాజుకు చెప్పాడట‌.. మరుసటి రోజు కృష్ణదేవరాయలు డేగను వెంబడించగా స్వామివారి విగ్రహం కోతకోట, కన్వాయపల్లి పర్వతాల మధ్య ప్ర‌త్య‌క్ష‌మ‌య్యింది. అనంత‌రం ఆ విగ్రహాన్ని ప్రతీష్టించి రత్న పుష్కరిని నదీ సమీపంలో శ్రీ రంగనాయక స్వామి ఆలయాన్ని నిర్మించారు. విజయనగర శిల్పకలకు ఇది నిదర్శన‌మ‌ని చెప్పాలి.

ఈ ఆల‌య నిర్మాణంలో సుమారు ఆరువేల మంది శిల్పులు పాల్గొన్నారు. వేలాదిమంది కార్మికులు ఈ ఆలయ నిర్మాణంలో భాగ‌స్వాముల‌య్యారు. ఈ ఆల‌యం చుట్టూ ప‌చ్చ‌ద‌నం ప్ర‌శాంత‌మైన వాత‌వ‌ర‌ణంతో ఇది ఒక ప‌ర్యాట‌క కేంద్రంగా విరాజిల్లుతుంది. ఈ ఆల‌య నిర్మాణానికి తుంగ‌భ‌ద్ర‌, కృష్ణా న‌దుల నుంచి ఇసుక‌ను తెచ్చి ఉప‌యోగించారు. త‌మిళ‌నాడులోని తిరుచాప‌ల్లి, తంజావూరూ, కంచి, తిరువ‌నంత‌పురం నుంచి శిల్పులు వ‌చ్చి శ్రీ మ‌హావిష్ణువు ద‌శావాతారాల‌తో పాటు సామాజిక‌, వైవాహిక సంబంధాలతో కూడిన ఖ‌ళాఖండాల‌ను చెక్కారు. ఆల‌య గోపురం 5 అంత‌స్తులలో ఉంటుంది.

చేరుకోవ‌డం ఎలా..?

ఆ ఆలయానికి రైలు బస్సు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. వ‌న‌ప‌ర్తి జిల్లా నుంచి ఈ ఆల‌యం సుమారు 24 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది. హైద‌రాబాద్ నుంచి 150 కిలోమీట‌ర్లు ఉంటుంది. క‌ర్నూలు నుంచి 55 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది. అటు హైద‌రాబాద్ నుంచి కానీ, క‌ర్నూలు నుంచి కానీ, వ‌న‌ప‌ర్తి నుంచి కానీ వెళ్లేవారు పెబ్బేరును చేరుకోవాల్సి ఉంటుంది. పెబ్బేరు నుంచి సుమారు 12 కిలోమీట‌ర్ల దూరంలో ఈ ఆల‌యం వెల‌సింది. అక్క‌డి నుంచి బ‌స్సులో కానీ, ప్ర‌యివేట్ వాహ‌నంలో కానీ ఆల‌యానికి వెళ్లొచ్చు. సమీప రైల్వే స్టేషన్ గద్వాల్‌లో ఉంది. కాబ‌ట్టి రైల్వేస్టేష‌న్ నుంచి కూడా వెళ్లొచ్చు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+