Search
  • Follow NativePlanet
Share
» »త‌త్కాల్ టికెట్ వెంట‌నే క‌న్ఫామ్ కావాలంటే..ఈ టిప్స్ పాటించండి..!

త‌త్కాల్ టికెట్ వెంట‌నే క‌న్ఫామ్ కావాలంటే..ఈ టిప్స్ పాటించండి..!

భార‌త్‌లో రైలు ప్ర‌యాణాలు చేసేవారి సంఖ్య అధికం. సూదూర ప్రాంతాల‌కు వెళ్లాల‌నుకునేవారు కొన్నిరోజుల ముందుగానే రిజ‌ర్వేష‌న్లు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక‌, అప్ప‌టిక‌ప్పుడు బ‌య‌లుదేరాలి రిజ‌ర్వేష‌న్ క‌న్ఫామ్ కానీవారు, రెగ్యుల్ టిక్కెల్ అందుబాటులో లేనివారు త‌త్కాల్ టిక్కెట్ల‌కు ప్రాముఖ్య‌త‌నిస్తారు. అయితే, తత్కాల్ టిక్కెట్లు బుక్ చేసినా కూడా అవి క‌న్ఫామ్ కానీ ప‌రిస్థితులు ఉంటాయి. చాలా త‌క్కువ‌మంది మాత్ర‌మే క‌న్ఫామ్ అవుతుంటాయి. అయితే, తత్కాల్ టిక్కెట్ బుక్ చేసిన‌వెంట‌నే క‌న్ఫామ్ కావాలంటే మాత్రం తప్ప‌కుండా కొన్ని టిప్స్ పాటించాల్సిందే. అవేంటో ఇప్ప‌డు చూద్దాం.

త‌త్కాల్ టిక్కెట్ అంటే ఏమిటీ..?

త‌త్కాల్ టికెట్ ఎప్పడూ ప‌డితే అప్పుడూ చేయ‌రు. ట్రైన్ బ‌యలుదేర‌డానికి ఒక‌రోజు ముందు అంటే 24గంట‌ల ముందు మాత్ర‌మే త‌త్కాల్ టిక్కెట్లు బుక్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. త‌త్కాల్ రిజ‌ర్వేష‌న్ టిక్కెట్లు కూడా అంత సుల‌భంగా దొర‌క‌వు. అవి బుక్ చేసేలోపే టైం కూడా అయిపోతుంది. త‌త్కాల్‌లో ఏసీ టికెట్లు కావాలంటే ఉదయం ప‌ది గంటల నుంచి పద‌కొండు గంటల వరకు మాత్ర‌మే చేసుకోవాలి. ఇక స్లీప‌ర్ (నాన్ ఏసీ) టికెట్లు కావాల‌నుకుంటే మాత్రం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆ స‌మ‌యంలోనే త‌త్కాల్ టిక్కెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు చాలా ఫాస్ట్‌గా త‌త్కాల్ టిక్కెట్లు బుక్ చేసుకోవాలంటే మాత్రం కొన్ని జాగ్ర‌త్త‌లు పాటించాల్సిందే. ఈ టిప్స్ కూడా ఐఆర్‌సిటిసి వెబ్‌సైట్‌లో లేదా యాప్‌లో మాత్ర‌మే ఉప‌యోగ‌ప‌డ‌తాయి. అక్క‌డ వీటిని పాటించి త‌త్కాల్ ట్రైన్ టిక్కెట్ బుక్ చేస్తే త్వ‌ర‌గా మీ టిక్కెట్ క‌న్ఫామ్ అవుతుంది.

confirmtatkalticket1

త‌త్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలనుకునే వారు త‌ప్ప‌నిస‌రిగా ఐఆర్‌సిటిసి అకౌంట్‌ను కలిగి ఉండాలి. అకౌంట్ లేకపోతే మాత్రం ఈ వెబ్‌సైట్‌లోకి https://www.irctc.co.in/ వెళ్లి ఐఆర్‌సిటిసి యాప్ ఓపెన్ చేసి అకౌంట్ క్రియేట్ చేయొచ్చు. అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక‌, అందులో మై అకౌంట్ పైక్లిక్ చేయాలి. అనంత‌రం మాస్ట‌ర్ జాబితాను సెల‌క్ట్ చేసుకుని పేరు, వయసు, జెండర్, పుట్టిన తేదీ వివరాలు వంటి వివరాలన్నింటినీ ముందే యాడ్ చేయాల్సి ఉంటుంది.

త‌త్కాల్ టిక్కెట్ బుక్ చేయు విధానం..

ముందుగా అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు కాబ‌ట్టి. అందులో లాగిన్ అయిన వెంటనే ప్లాన్ మై జర్నీ ట్యాబ్ కింద క్లిక్ చేసి జ‌ర్నీ చేసేవారి పేర్ల‌ను ఎంట‌ర్ చేయాలి. ఆ త‌ర్వాత స్టేషన్ పేర్లను టైప్ చేసి, మీరు ప్ర‌యాణం చేసే తేదీని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఒక్క పిఎన్ఆర్ నెంబరుపై కేవ‌లం నాలుగు తత్కాల్ టికెట్లను మాత్రమే బుక్ చేసుకోవ‌చ్చు. ఆ త‌ర్వాత టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటున్న కోచ్ సెలెక్ట్ చేసుకుని, ప్ర‌యాణికులు వివ‌రాల‌ను న‌మోదు చేయాలి.

ముందుగానే వారి వివ‌రాల‌ను మాస్టర్ జాబితాలో సేవ్ చేయడం వల్ల అక్కడ ఆటోమేటిక్‌గా మ‌న‌కు క‌నిపిస్తాయి. అక్క‌డ ఇచ్చిన వివ‌రాల‌న్నీ ఒక‌సారి చూసుకుని పేమెంట్ ప్రాసెస్ పూర్తిచేయాలి. ఆ త‌ర్వాత ఓటిపి టైప్ చేసి మై బుకింగ్ ట్యాబ్‌లో టిక్కట్స్ చూసుకోవ‌చ్చు. టికెట్ కన్ఫార్మ్ అయితే గనుక మీ మెయిల్ ఐడికి, మీ మొబైల్‌కు మెసేజ్ వ‌స్తుంది. ముందుగా మాస్టర్ జాబితాలో ప్రయాణికుల వివరాలను యాడ్ చేయడం వల్ల చాలా వేగంగా తత్కాల్ టికెట్లను సుల‌భంగా కన్పామ్ చేసుకోవ‌చ్చు.

More News

Read more about: irctc tatkal ticket news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+