Search
  • Follow NativePlanet
Share
» »ఈ మార్కెట్‌లో అన్నీఅతి త‌క్కువ ధ‌ర‌కే ల‌భిస్తాయి..

ఈ మార్కెట్‌లో అన్నీఅతి త‌క్కువ ధ‌ర‌కే ల‌భిస్తాయి..

ఈ మార్కెట్‌లో అన్నీఅతి త‌క్కువ ధ‌ర‌కే ల‌భిస్తాయి..

రాజధాని ఢిల్లీలో చాలా చౌక మార్కెట్లు ఉన్నాయి. ఇక్క‌డ అత్యంత ప్రసిద్ధి చెందిన‌ మార్కెట్ సరోజినీ నగర్ మార్కెట్‌. ఈ మార్కెట్ ఉదయం నుంచి సాయంత్రం వ‌ర‌కూ రద్దీగానే ఉంటుంది. అబ్బాయిలు, అమ్మాయిలు అనే తేడా లేకుండా, అన్ని వయస్సుల వారు అన్నీ తరగతులవారు ఇక్క‌డ షాపింగ్ చేసేందుకు వస్తారు. ఇక్క‌డ ప్ర‌తి వ‌స్తువు నాణ్య‌తగా ఉంటుంది. అంతేకాకుండా, అతిత‌క్కువ ధ‌ర‌ల‌కే ల‌భిస్తాయి. అందుకే ఈ ప్రాంతం అంత ర‌ద్దీగా ఉంటుంది. ప్ర‌తి దుకాణం వ‌ద్ద బారులు తీరిన జ‌నం మనం ఇక్క‌డ చూస్తాం. అయితే ఢిల్లీలోని మ‌రో మార్కెట్ కూడా స‌రోజీని న‌గ‌ర్‌ను త‌ల‌పిస్తుంది. అదేంటంటే, షాహదారా మార్కెట్‌. దీన్ని మరొక సరోజినీ నగర్ అని పిలవవచ్చు. ఇక్కడ ఖరీదైన బ్రాండ్‌ల కాపీలను అతి త‌క్కువ ధ‌ర‌కే చూడొచ్చు. ఈ మార్కెట్‌ను ఛోటా బజార్ అని కూడా పిలుస్తారు. ఈ మార్కెట్ గురించి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.

1

మార్కెట్ ప్రత్యేకతలు ఏమిటి?

మొఘల్ యుగంలో షాహదారా మార్కెట్ కూడా ఉంది. ఇక్కడ చిన్న‌సూది నుండి బ్రాండెడ్ దుస్తుల వరకు ప్రతిదీ అందుబాటులో ఉంటాయి. ఈ మార్కెట్‌లో పెళ్లికి సంబంధించిన ఉపకరణాలను కూడా కొనుగోలు చేయొచ్చు. తీజ్ వంటి పండుగలకు షాహాదారా మార్కెట్ ర‌ద్దీగా ఉంటుంది. ఇక్కడ వందలాది దుకాణాలు ఉన్నాయి. ఇక్కడ మహిళలు, పిల్లలు మరియు యువకులకు కావ‌ల‌సిన అన్ని ర‌కాల వ‌స్తువులు దొరుకుతాయి. ఇక్క‌డ ప్ర‌తిర‌క‌మైన షాఫింగ్ చాలా సుల‌భంగా జ‌రుగుతుంది. అదే దీని ప్ర‌త్యేక‌త‌. షహదారా ఇంతకుముందు మండీలకు ప్రసిద్ధి చెందింది. కానీ ఇప్పుడు అది బట్టలు, నగలకు కూడా ప్రసిద్ధి చెందింది.

2

అన్ని వస్తువులు సగం ధరకే లభిస్తాయి

షాహదారా మార్కెట్ మొఘల్ కాలంనాటి మార్కెట్. దీనికి నాలుగు ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. ఈ మార్కెట్‌లో సీసీ కెమెరాలతో పాటు సామాన్యుల భద్రతకు కూడా పూర్తి ఏర్పాట్లు చేశారు. ఈ మార్కెట్ ఉత్తరప్రదేశ్‌కు ఆనుకుని ఉండటంతో UP నుండి కూడా ఇక్కడికి షాపింగ్ చేయడానికి ప్ర‌జ‌లు వస్తుంటారు. ఈ మార్కెట్‌లో మ‌గ‌వారు ధ‌రించే టిష‌ర్ట్‌లు కేవ‌లం వంద నుండి నూట‌యాభై రూపాయ‌లకే లభిస్తాయి. ఇక జీన్స్ అయితే రెండు వంద‌ల నుండి మూడువంద‌ల రూపాయ‌ల వ‌ర‌కు అందుబాటులో ఉంటాయి. ఇక బెల్ట్‌లు అయితే యాభై నుంచి వంద రూపాయ‌ల వ‌ర‌కు ల‌భిస్తాయి. యాభై రూపాయలకే మ‌హిళ‌లు ధ‌రించే బ్రాస్లెట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇత‌ర వస్తువులు కూడా ఇక్కడ సగం ధరకే లభిస్తాయి.

3

హ్యండ్ బ్యాగులు అతి త‌క్కువ ధ‌ర‌కే..

ఇక‌, మ‌హిళ‌లు ఉప‌యోగించే హ్యండ్ బ్యాగులయితే అతి త‌క్కువ ధ‌ర‌ల‌కే ల‌భిస్తాయి. రెండు వంద‌ల రూపాయ‌ల నుండి ఇక్క‌డ బ్యాగ్‌ల‌ను కొనుగోలు చేయొచ్చు. అన్ని ర‌కాల హ్యండ్ బ్యాగ్స్ అంటే లెద‌ర్ బ్యాగ్‌లు కానీ, బ్రాండెండ్ బ్యాగ్స్ కానీ అన్నీ ఈ మార్కెట్‌లో అందుబాటు ధ‌ర‌ల‌కే ల‌భిస్తాయి.

ఇక్క‌డి స్ట్రీట్ ఫుడ్ టేస్ట్ చేయాల్సిందే..

ఇక్క‌డి మార్కెట్‌లో ల‌భించే స్ట్రీట్ ఫుడ్ కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇక్క‌డ దహీ భల్లా చాట్ లేదా చోలే చాట్ తినొచ్చు. ప్రతిదీ చాలా స్పైసీ, టేస్టీగా ఉంటుంది. ఇక్కడ స్పైసీ భళ్లా పాప్డీ కేవ‌లం ముప్ప‌యి రూపాయలే. అంతేకాకుండా, శంకర్ చాట్ వాలే రుచికరమైన కచోరీ కేవ‌లం న‌ల‌భై రూపాయ‌ల‌కే ల‌భిస్తుంది. షాపింగ్ చేయ‌డానికి ఇక్క‌డికి వ‌స్తే మాత్రం త‌ప్ప‌కుండా వీటిని ఓ ప‌ట్టు ప‌ట్టాల్సిందే..

More News

Read more about: sarojini nagar market
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+