Search
  • Follow NativePlanet
Share
» »ఇత‌రుల‌కు టికెట్‌లు బుక్ చేస్తే జైలు శిక్ష? అందంతా ఫేక్ ప్ర‌చార‌మేన‌ట‌!

ఇత‌రుల‌కు టికెట్‌లు బుక్ చేస్తే జైలు శిక్ష? అందంతా ఫేక్ ప్ర‌చార‌మేన‌ట‌!

సోష‌ల్ నెట‌వ‌ర్స్‌లో ఏం ప్ర‌చారం జరిగినా అది దావానంలా వ్యాపించ‌డం కామ‌న్ అయిపోయింది. అయితే, అలాంటి ప్ర‌చారాల్లో నిజనిజాలు తెలుసుకోవ‌డం చాలా ముఖ్య‌మ‌ని నిపుణులు చెబుతున్నారు. తాజాగా, ఆన్‌లైన్‌ రైల్వే టికెట్‌ల విష‌యంలో సోష‌ల్ మీడియాలో జ‌రుగుతోన్న ప్ర‌చారంపై రైల్వే శాఖ స్పందించింది.

టికెట్లపై వ‌స్తోన్న‌ ప్ర‌చారంలో వాస్త‌వం లేద‌ని తెలిపింది. ఐఆర్‌సీటీసీలో వ్యక్తిగత ఖాతాల ద్వారా తమకు కాకుండా బంధువులు, ఫ్రెండ్స్‌కి ఆన్‌లైన్‌లో రైలు టికెట్లు బుక్ చేసుకోవ‌చ్చ‌ని స్ప‌ష్టం చేసింది. గ‌త రెండు రోజులుగా ఐఆర్‌సీటీసీ వ్య‌క్తిగ‌త ఐడీలో ఇత‌రుల‌కు టికెట్‌లు బుక్ చేస్తే జైలు శిక్ష‌, జ‌రిమానా అంటూ సామాజిక మాధ్య‌మాల్లో విసృతంగా ప్ర‌చారం జ‌రుగుతున్న నేప‌థ్యంలో రైల్వే శాఖ ప‌లు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది.

ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ విష‌యంలో జ‌రుగుతోన్న‌ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, ఈ త‌ర‌హా ప్ర‌చారం ప్రజల్ని తప్పదోవపట్టించేవిగా ఉన్నాయని స్ప‌ష్టం చేసింది. అంతేకాదు, వేర్వేరు ఇంటిపేర్లు ఉన్నవారికి ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ ద్వారా రైలు టికెట్లు తీసుకోవడంపై కూడా ఆంక్షలు విధించినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్త‌వం లేద‌ని తెలిపింది.

ఐఆర్‌సీటీసీ వ్య‌క్తిగ‌త‌ యూజర్‌ ఐడీ ద్వారా కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఇలా ఎవరికైనా ఈ-టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు వెల్ల‌డించింది. ఇలా ఒక ఐడీతో నెలకు 12 టికెట్లు వ‌ర‌కూ పొందే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలిపింది. అలాగే, ఆధార్ లింక్చే సుకున్నవారు ఒక‌ నెలలో 24 టికెట్లు వరకూ బుక్‌ చేసుకొనే వెసులుబాటు ఉన్న‌ట్లు వెల్ల‌డించింది. దీనిని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని కోరింది.

jailsentenceifyoubookticketsforothers1

అలాంటివారు శిక్షార్హులు..

ఆన్‌లైన్‌లో రైలు టికెట్లు తీసుకునేవారు రైల్వేబోర్డు మార్గదర్శకాలకు అనుగుణంగా టికెట్లు తీసుకోవ‌డంలో ఎలాంటి ఆంక్ష‌లూ లేవ‌ని స్ప‌ష్టం చేసింది. ఐఆర్‌సీటీసీలో వ్యక్తిగత ఐడీ ఉన్నవారు తమ కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల కోసం టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు. ఆధార్‌తో ధ్రువీకరించుకున్న ఖాతా ఉన్న వ్య‌క్తులు నెలకు 24 టికెట్లు బుక్ చేసుకోవ‌డం కోసం ప్రతి టికెట్‌లో కనీసం ఒకరి ఆధార్‌ ధ్రువీకరణ అయినా స‌రిపోతుంది.

jailsentenceifyoubookticketsforothers1

అయితే, వ్యక్తిగత ఐడీపై తీసుకున్న టికెట్లను వ్యాపార‌ ప్రాతిపదికన విక్రయించడం మాత్రం రైల్వేచట్టం కింద నేరమేన‌ని రైల్వే అధికార ప్రతినిధి తెలిపారు. వ్యక్తిగత ఐడీలతో బుక్‌ చేసిన ఈ-టికెట్లు వాణిజ్యపరమైన విక్రయం కోసం ఉద్దేశించినవి కావ‌ని, ఆ త‌ర‌హా చర్యలకు ఎవరైనా పాల్పడితే.. రైల్వే చట్టం -1989లోని సెక్షన్‌ 143 ప్రకారం నేరంగా పరిగణిస్తారని రైల్వే మంత్రిత్వశాఖ'ఎక్స్‌' వేదికగా వెల్ల‌డించింది. కేవలం అధికారిక గుర్తింపు పొందిన ఏజెంట్లకు మాత్రమే థర్డ్‌పార్టీ బుకింగ్‌ ద్వారా టికెట్లు తీసుకునే వెసులుబాటు ఉంటుంద‌న్నారు. వారు మాత్రమే టికెట్లు బుక్‌ చేసి ఇతరులకు వికక్రయించే అవ‌కాశం ఉంద‌ని గుర్తుచేశారు.

ఎవరైనా ఈ నిబంధనల్ని అతిక్రమిస్తే మాత్రం చట్టపరమైన చర్యలు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. అలాగే, వ్య‌క్తిగ‌త ఐడీలు ఉన్న‌వారు ఇంటి పేరుతో సంబంధం లేకుండా కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువుల పేరిట అవకాశం మేరకు ఈ-టికెట్లను ధైర్యంగా బుక్‌ చేసుకోవచ్చని స్ప‌ష్టం చేసింది.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+