Search
  • Follow NativePlanet
Share
» »ద‌క్షిణ మ‌ధ్య రైల్వే కీల‌క నిర్ణ‌యం.. ప్ర‌యాణికుల‌కు ద‌స‌రా, దీపావ‌ళి కానుక‌.. ప్ర‌త్యేక రైళ్లు..

ద‌క్షిణ మ‌ధ్య రైల్వే కీల‌క నిర్ణ‌యం.. ప్ర‌యాణికుల‌కు ద‌స‌రా, దీపావ‌ళి కానుక‌.. ప్ర‌త్యేక రైళ్లు..

పండ‌గొచ్చిదంటే చాలు... చాలామంది త‌మ సొంతూళ్ల‌కు ప‌య‌న‌మ‌వుతుంటారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు ద‌స‌రా, దీపావ‌ళి పండుగ‌లు ఎంతో ప్ర‌త్యేకం. ఈ పండుగ‌ల్లో సొంత గ్రామంలో సొంత‌వారితో స‌రాదాగా జ‌రుపుకోవాల‌ని అందరికీ ఉంటుంది. అందుకే చాలామంది ఈ పండుగ‌ల‌కి త‌మ సొంతూళ్ల‌కు ప్ర‌యాణ‌మ‌వుతుంటారు. ఈ త‌రుణంలో ఎక్కువ‌మంది రైలు మార్గాల‌నే ఎంచుకుంటారు.

పండుగ‌ల సంద‌ర్భంలో రైళ్ల ర‌ద్దీనీ దృష్టిలో ఉంచుకుని ద‌క్షిణ మ‌ధ్య రైల్వే కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌యాణికుల‌కు ద‌స‌రా, దీపావ‌ళి కానుక‌లను ప్ర‌క‌టించేసింది. ప్ర‌ధాన న‌గ‌రాల నుంచి ప‌లు ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డిపేందుకు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే సిద్ధ‌మ‌య్యింది. ఈ ట్రైన్స్ అక్టోబ‌ర్ 10వ తేది నుంచి నవంబర్ 5 వరకూ వివిధ తేదీల్లో ప్ర‌యాణికుల‌కు అందుబాటులో ఉండనున్నాయి.

48 ప్రత్యేక రైళ్లు..

పండుగ‌ల వేళ ప్ర‌యాణికుల ర‌ద్దీనీ దృష్టిలో ఉంచుకుని పౌత్ సెంట్ర‌ల్ రైల్వే 48 ప్రత్యేక రైళ్లను న‌డ‌ప‌నున్న‌ట్లు అధికారులు తెలిపారు. దసరా, దీపావళి, ఛాత్ పండుగల సందర్భంగా ఈ ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రధాన నగరాల నుంచి అక్టోబర్ 10వ తేదీ నుంచి నవంబర్ 5 వరకూ వేర్వేరు తేదీల్లో ఈ రైళ్లు ప్ర‌యాణికుల‌కు అందుబాటులో ఉంటాయి.

southcentralrailway1

కాచిగూడ - తిరుపతి - కాచిగూడ, సికింద్రాబాద్ - నాగర్‌సోల్ - సికింద్రాబాద్, కాకినాడ - సికింద్రాబాద్ - కాకినాడ, తిరుపతి - మచిలీపట్నం - తిరుపతి మార్గాల్లో స్పెష‌ల్ ట్రైన్స్ న‌డ‌వ‌నున్నాయి. రెగ్యులర్ రైళ్లతో పాటు ఈ స్పెష‌ల్ ట్రైన్స్ అదనపు సర్వీసులుగా ఉంటాయ‌ని, ప్రయాణికులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు కోరారు.

4 రైళ్లకు అదనపు కోచ్‌లు..

ఈస్ట్ కోస్ట్ రైల్వే సైతం ప్రయాణికులకు ఓ శుభ‌వార్త‌ను అందించింది. ప్ర‌యాణికులు డిమాండ్‌క‌నుగుణంగా, రైళ్ల రద్దీ దృష్ట్యా పలు రైళ్లకు స్లీపర్, ఏసీ కోచ్‌లను పెంచేసింది. మొత్తం నాలుగు రైళ్లకు అదనపు కోచ్‌లను ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు వివ‌రించారు. 20807 అనే నెంబ‌ర్‌గ‌ల అమృత్‌సర్ హిరాకుడ్ ఎక్స్‌ప్రెస్ రైలుకు అదనంగా స్లీపర్ క్లాస్, 3 ఏసీ ఎకానమీ కోచ్‌లతో శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేయనును్న్న‌ట్లు అధికారులు తెలిపారు. ఈ ట్రైన్ విశాఖ నుంచి బ‌య‌లుదేరుతుంది.

సెప్టెంబర్ 3వ తేదీ నుంచి ఈ అద‌న‌పు కోచ్‌లు ప్ర‌యాణికుల‌కు అందుబాటులోకి రానున్నాయి. వీటితోపాటు 20808 అనే నెంబ‌ర్‌గ‌ల‌ అమృత్ సర్ - విశాఖ హిరాకుడ్ ఎక్స్‌ప్రెస్ రైలుకు అదనంగా స్లీపర్ క్లాస్, మరో 3 ఏసీ ఎకానమీ కోచ్‌లను శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేశారు. ఈ ట్రైన్ సెప్టెంబర్ 7 నుంచి ప్ర‌యాణికుల‌కు అందుబాటులో ఉండ‌నుంది.

అలాగే, 20811 అనే నెంబ‌ర్‌గ‌ల విశాఖ - నాందేడ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌కు అదనపు స్లీపర్ క్లాస్, 3 ఏసీ ఎకానమీ కోచ్‌ల‌ను శాశ్వ‌త ప్రాతిప‌దిక‌న ఏర్పాటు చేయ‌నున్నారు. సెప్టెంబర్ 3 నుంచి ఇవి అందుబాటులోకి రానున్నాయి. 20812 అనే నెంబ‌ర్‌గ‌ల నాందేడ్ - విశాఖ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు అదనపు స్లీపర్ క్లాస్, 3 ఏసీ ఎకానమీ కోచ్‌లను ఏర్పాటు చేయ‌నున్నారు. ఈ ట్రైన్ సెప్టెంబర్ 4వ తేదీ నుంచి ప్ర‌యాణికుల‌కు అందుబాటులోకి ఉండ‌నుంద‌ని అధికారులు తెలిపారు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+