Search
  • Follow NativePlanet
Share
» »కొత్త పార్ల‌మెంట్ భ‌వ‌న విశేషాలు తెలుసుకుందామా?

కొత్త పార్ల‌మెంట్ భ‌వ‌న విశేషాలు తెలుసుకుందామా?

కొత్త పార్ల‌మెంట్ భ‌వ‌న విశేషాలు తెలుసుకుందామా?

పార్లమెంట్ భ‌వ‌నాన్ని ప్రజాస్వామ్య దేవాలయం అని పిలుస్తారు. ఈ ఆలయానికి 96 సంవత్సరాల తర్వాత మళ్లీ కొత్త రూపాన్ని అందిస్తున్నారు. సమాచారం ప్రకారం, పార్లమెంట్ హౌస్ కొత్త నిర్మాణ పనులు చాలా వరకు పూర్తయ్యాయి. దీనిని ప్ర‌ధాని మోడీ మే 28, 2023 న ప్రారంభించబోతున్నారు. 1927 సంవత్సరంలో అప్ప‌టి పార్లమెంటును నిర్మించారు. ఆ సమయంలో అవసరమైన సౌకర్యాలు మాత్రమే అప్పుడు ఉన్నాయి. కానీ నేడు ఈ పార్ల‌మెంటులో చాలా విషయాల కొరత కనిపిస్తుంది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని, 10 డిసెంబర్ 2020న, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటు కొత్త భవనానికి శంకుస్థాపన చేశారు. కొత్త పార్ల‌మెంటు భ‌వ‌నం విశేషాల‌ను తెలుసుకుందాం రండి.

parliamentbuilding

కొత్త పార్లమెంట్ హౌస్‌లో సీటింగ్ ఏర్పాట్లు

కొత్త పార్లమెంట్ హౌస్‌లో 888 మంది లోక్‌సభ సభ్యులు మరియు 300 మంది రాజ్యసభ సభ్యులు కూర్చోవచ్చు. ఉభయ సభలు కలిసి సమావేశమైతే 1,280 మంది ఎంపీలు ఒకేసారి ఇక్కడ కూర్చునే వెసులుబాటును క‌ల్పించారు. ప్రస్తుతం పార్లమెంటు భవనంలో లోక్‌సభలో 550 మంది, రాజ్యసభలో 240 మంది సభ్యులకు సీటింగ్ ఏర్పాట్లు చేశారు.

parliamentbuilding

ఎటువంటి శబ్ద కాలుష్యం లేకుండా..

కొత్త పార్లమెంట్ హౌస్ నిర్మాణ సమయంలో, వాయు మరియు శబ్ద కాలుష్యాన్ని నివారించడానికి అనేక చర్యలు తీసుకున్నారు. ఎంపీలందరికీ ప్రత్యేక కార్యాలయం ఉంది. వారి కార్యాలయాన్ని పేపర్‌లెస్ కార్యాలయంగా మార్చడానికి కొత్త డిజిటల్ ఇంటర్‌ఫేస్‌ను అమర్చారు. కొత్త భవనంలో గ్రాండ్ కాన్‌స్టిట్యూషన్ హాల్, పార్లమెంట్ సభ్యుల కోసం లాంజ్, లైబ్రరీ, డైనింగ్ హాల్ మరియు పార్కింగ్ స్థలం కూడా ఇప్పుడు కొత్త‌గా ఏర్పాటు చేశారు.

parliamentbuilding

లోపలి దృశ్యం చాలా ప్రత్యేకంగా ఉంటుంది.

ప్ర‌త్యేక‌మైన ఆరు గేట్లు, దేశంలోని వివిధ ప్రాంతాల నుండి శిల్పాలు మరియు కళాకృతులను కలిగి ఉంటుంది. గరుడ, గజ్, అశ్వ మరియు మగర్‌తో సహా దేశంలో పూజించే జంతువుల విగ్రహాల‌ను కూడా ఇక్క‌డ అమ‌ర్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే, భారతదేశం యొక్క చారిత్రక మరియు ఆధునిక యుగానికి మిమ్మల్ని తీసుకెళ్లే మూడు గ్యాలరీలు ఉంటాయి.

మూడు ప్రత్యేక ద్వారాలు ఉంటాయి. కొత్త పార్లమెంట్ హౌస్‌కు మూడు కొత్త గేట్లు కూడా ఉన్నాయి. వీటిని జ్ఞాన్ ద్వార్, శక్తి ద్వార్ మరియు కర్మ ద్వార్ అని పిలుస్తారు. అంతేకాకుండా, ఈ భవనంలో మహాత్మా గాంధీ, భీమ్‌రావ్ అంబేద్కర్, సర్దార్ పటేల్, చాణక్యుల గ్రానైట్ విగ్రహాలను కూడా ఏర్పాటు చేయనున్నారు.

parliamentbuilding

ప్ర‌త్యేక‌మైన రాజ్యాంగ హాలు..

కొత్త పార్లమెంట్ యొక్క అత్యంత అద్భుతమైనది ఏంట‌టే, భవనం మధ్యలో ఉన్నరాజ్యాంగ హాల్. దానిపై అశోక స్తంభాన్ని అమర్చారు. ఈ హాలులో రాజ్యాంగ ప్రతిని ఉంచుతారని, అంతే కాదు, మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ వంటి గొప్ప ప్రధానుల పెద్ద చిత్రాన్ని కూడా అమ‌ర్చ‌బోతున్నారు. సనాతన పరంపర, వాస్తు శాస్త్రానికి సంబంధించిన పెయింటింగ్స్, డెకరేటివ్ ఆర్ట్స్, వాల్ ప్యానెల్స్, శిల్పాలు ఏర్పాటు చేశారు. మొత్తం ఈ నిర్మాణానికి రూ.1,200 కోట్లు ఖర్చు చేసింది కేంద్రం. ఈ సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌లో భాగంగా కొత్త సెంట్రల్ సెక్రటేరియట్‌ నిర్మాణం, రాజ్‌పథ్‌లో మార్పులు చేర్పులు చేశారు. పాత పార్లమెంట్‌ భవన నిర్మాణాన్ని 1921లో మొదలు పెట్టి 1927లో పూర్తి చేశారు. అప్పట్లో దీని కోసం రూ.83 లక్షలు ఖర్చు పెట్టారు.

More News

Read more about: grand constitution hall
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+