భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ ద్వారా మెరుగైన ఫలితాలను అందించేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. భారతదేశం అంతటా రైల్వే స్టేషన్‌లలో సమగ్ర అభివృద్ధి ప్రణాళికను రూపొందించింది. ఈ స్కీమ్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని 72 రైల్వే స్టేషన్‌లను అభివృద్ధి చేసేందుకు ఎంపిక చేయబడ్డాయి.

రైల్వే మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే పనులకు రూ.8,400 కోట్లు కేటాయించింది. ఈ పథకం ద్వారా కేవలం స్టేషన్‌ల సుందరీకణ మాత్రమే కాకుండా దీర్ఘకాలిక అభివృద్ధే లక్ష్యంగా ప్రణాళికలు రూపుదిద్దుకున్నాయి. దీంతో రాష్ట్రంలో ఎంపిక చేయబడ్డ 72 రైల్వే స్టేషన్‌ల రూపురేఖలు మారిపోనున్నాయి. ఈ ప్రణాళిక ఏపీలో పర్యాటక రంగం అభివృద్ధికి కూడా దోహదపడనుంది.
స్కీం ప్రత్యేకలు
అమృత్ భారత్ స్టేషన్ పథకం దీర్ఘకాలిక విధానంతో నిరంతర ప్రాతిపదికన స్టేషన్ల అభివృద్ధి కోసం రూపొందించబడింది. స్టేషన్ యాక్సెస్, సర్క్యులేటింగ్ ఏరియాలు, వెయిటింగ్ హాల్స్, టాయిలెట్లు, అవసరమైన లిఫ్ట్/ఎస్కలేటర్లు, పరిశుభ్రత, ఉచిత Wi-Fi, స్థానిక ఉత్పత్తుల కోసం కియోస్క్‌లు వంటి సౌకర్యాలను మెరుగుపరచడం కోసం దశలవారీగా మాస్టర్ ప్లాన్‌లను సిద్ధం చేస్తున్నారు.
ఈ పథకం స్టేషన్ పరిధిలోని నగరం యొక్క రెండు వైపులా స్టేషన్‌లను ఏకీకృతం చేయడం, మల్టీమోడల్ ఇంటిగ్రేషన్, దివ్యాంగులకు సౌకర్యాలు, పర్యావరణ అనుకూల పరిశరాలు, బ్యాలస్ట్‌లెస్ ట్రాక్‌ల ఏర్పాటు వంటివి ప్రణాళికలో భాగంగా ఉంటాయి. ప్రతి స్టేషన్‌లో ప్రయాణీకుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమాచార వ్యవస్థలు, ఎగ్జిక్యూటివ్ లాంజ్‌లు, వ్యాపార సమావేశాల కోసం నామినేటెడ్ స్థలాలు, ల్యాండ్‌స్కేపింగ్ మొదలైనవి ఈ స్కీం ద్వారా లభించనున్నాయి.
మారనున్న రూపురేఖలు
అమృత్ భారత్ స్టేషన్ పథకంలో ఎంపిక చేయబడిన స్టేషన్ గుండా వెళ్లే రైళ్ల ప్రయాణికులు కనీసం రెండు LED ఆధారిత స్టేషన్ నేమ్ బోర్డులను చూడొచ్చు. ప్రతి స్టేషన్‌లోని భవనాలతోపాటు ఫ్లోరింగ్ ఆధునిక శైలిలో నిర్మాణం ఉంటుంది. స్టేషన్‌లలో ఇప్పటికే 600 మీటర్ల పొడవుతో ఉన్న ప్లాట్ ఫాంల పొడవును 760 మీటర్ల నుంచి 840 మీటర్ల వరకు పెంచనున్నారు. స్టేషన్ల వద్ద ట్రాక్‌ల శుభ్రత, సులభమైన నిర్వహణ కోసం 'బ్యాలస్ట్ లెస్ ట్రాక్'ల ఏర్పాటు ఉంటుంది. ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉండే ఎన్ఎస్‌జీ 1-4, ఎస్‌జీ 1- 2 కేటగిరీ స్టేషన్లలో ఎస్కలేటర్ల ఏర్పాటు, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా వీల్ చెయిర్లు, ప్రత్యేక ప్రవేశ మార్గాలు ఉంటాయి.
స్థానిక ఉత్పత్తుల విక్రయానికి స్టేషన్‌లో కనీసం రెండు స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు. అంతేకాదు, ప్రతి స్టేషన్ మొదటి అంతస్తులో ప్రత్యేకంగా రూఫ్ ప్లాజా నిర్మాణం కూడా ఇందులో భాగంగా ఉండనుంది. దశవారీలో ఈ పనులను ప్రారంభించనున్నారు. ఈ ఆధునికీకరణ పనులకు అవసరమైన ప్రణాళిలు రూపొందుతున్నాయి. ఇవి పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌లోని ఈ 72 రైల్వే స్టేషన్‌ల రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని పలు స్టేషన్‌లలో ముఖద్వారం, ఎలివేషన్ నిర్మాణం, ఎటువంటి సౌకర్యాలు కల్పించాలనే అంశాలపై అధికారులు ఫీడ్‌బ్యాక్ తీసుకుంటున్నారు. ప్రయాణికుల సూచనలు, సలహాలు కూడా రైల్వే అధికారులు సేకరించారు.
ఏపీలోని ఈ 72 రైల్వే స్టేషన్‌లకు మహర్ధశ
| S No. | జిల్లా | స్టేషన్ పేరు | స్టేషన్ కోడ్ |
|---|---|---|---|
| 1 | అనంతపూర్ | అనంతపూర్ | ATP |
| 2 | అనంతపూర్ | ధర్మవరం | DMM |
| 3 | అనంతపూర్ | గుత్తి | GY |
| 4 | అనంతపూర్ | హిందూపూర్ | HUP |
| 5 | అనంతపూర్ | కదిరి | KRY |
| 6 | అనంతపూర్ | మాత్రాలయం రోడ్ | MTRY |
| 7 | అనంతపూర్ | తాడిపాత్రి | TU |
| 8 | చిత్తూరు | చిత్తూరు | CTO |
| 9 | చిత్తూరు | కుప్పం | KPN |
| 10 | చిత్తూరు | మదనపల్లి రోడ్ | MPLR |
| 11 | చిత్తూ్ర్ | పాకాల | PAK |
| 12 | చిత్తూరు | పీలేరు | PIL |
| 13 | చిత్తూరు | రేణిగుంట | RU |
| 14 | చిత్తూరు | శ్రీకాాలహస్తి | KHT |
| 15 | చిత్తూరు | తిరుపతి | TPTY |
| 16 | తూర్పు గోదావరి | అనపర్తి | APT |
| 17 | తూర్పు గోదావరి | కాకినాడ టౌన్ | CCT |
| 18 | తూర్పు గోదావరి | నిడదావోలు | NDD |
| 19 | తూర్పు గోదావరి | రాజమండ్రి | RJY |
| 20 | తూర్పు గోదావరి | సామర్లకోట | SLO |
| 21 | తూర్పు గోదావరి | తుని | TUNI |
| 22 | గుంటూర్ | బాపట్ల | BPP |
| 23 | గుంటూర్ | గుంటూర్ | GNT |
| 24 | గుంటూర్ | మాచర్ల | MCLA |
| 25 | గుంటూర్ | మంగళగిరి | MAG |
| 26 | గుంటూర్ | నర్సారావుపేట | NRT |
| 27 | గుంటూర్ | పిడుగురాళ్ల | PGRL |
| 28 | గుంటూర్ | రాయనపాడు | RYP |
| 29 | గుంటూర్ | రేపల్లె | RAL |
| 30 | గుంటూర్ | సత్తెనపల్లె | SAP |
| 31 | గుంటూర్ | తెనాలి | TEL |
| 32 | గుంటూర్ | వినుకొండ | VKN |
| 33 | కడప | రాజంపేట | RJP |
| 34 | కృష్ణ | గుడివాడ | GDV |
| 35 | కృష్ణ | గుణదల | GADL |
| 36 | కృష్ణ | మచిలీపట్నం | MTM |
| 37 | కృష్ణ | విజయవాడ | BZA |
| 38 | కర్నూల్ | ఆదోని | AD |
| 39 | కర్నూల్ | ఢోన్ | DHNE |
| 40 | కర్నూల్ | కర్నూల్ సిటీ | KRNT |
| 41 | కర్నూల్ | నంద్యాల | NDL |
| 42 | నెల్లూర్ | గూడూరు | GDR |
| 43 | నెల్లూర్ | నడికుడి జంక్షన్ | NDKD |
| 44 | నెల్లూర్ | నెల్లూర్ | NLR |
| 45 | నెల్లూర్ | సూళ్లూరిపేట | SPE |
| 46 | ప్రకాశం | చీరాల | CLX |
| 47 | ప్రకాశం | కంబం | CBM |
| 48 | ప్రకాశం | దొనకొండ | DKD |
| 49 | ప్రకాశం | గిద్దలూరు | GID |
| 50 | ప్రకాశం | మార్కపురం రోడ్ | MRK |
| 51 | ప్రకాాశం | ఒంగోల్ | OGL |
| 52 | శ్రీకాకుళం | ఇచ్ఛాపురం | IPM |
| 53 | శ్రీకాకుళం | నౌపాడ జంక్షన్ | NWP |
| 54 | శ్రీకాకుళం | పలాస | PSA |
| 55 | శ్రీకాకుళం | శ్రీకాకుళం రోడ్ | CHE |
| 56 | విశాఖపట్నం | అరకు | ARK |
| 57 | విశాఖపట్నం | ఎలమంచిలి | YLM |
| 58 | విశాఖపట్నం | సింహాచలం | SCM |
| 59 | విశాఖపట్నం | విశాఖపట్నం | VSKP |
| 60 | విశాఖపట్నం | అనకాపల్లి | AKP |
| 61 | విశాఖపట్నం | దువ్వాడ | DVD |
| 62 | విజయనగరం | బొబ్బిలి జంక్షన్ | VBL |
| 63 | విజయనగరం | చీపురుపల్లి | CPP |
| 64 | విజయనగరం | కొత్తవలస | KTV |
| 65 | విజయనగరం | పార్వతీపురం | PVP |
| 66 | విజయనగరం | ఎస్ కోట | SKT |
| 67 | విజయనగరం | విజయనగరం జంక్షన్ | VZM |
| 68 | పశ్చిమ గోదావరి | భీమవరం టౌన్ | BVRT |
| 69 | పశ్చిమ గోదావరి | ఏలూరు | EE |
| 70 | పశ్చిమ గోదావరి | నర్సాపూర్ | NAS |
| 71 | పశ్చిమ గోదావరి | తాడేపల్లిగూడేం | TDD |
| 72 | YSR కడప | కడప | KDP |



Click it and Unblock the Notifications













