యాదాద్రి భువనగిరిలో గంభీరమై కోట.. భోంగీర్ కోట!
తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి ఒక జిల్లా. జిల్లా ప్రధాన కేంద్రం భోంగిర్‌లో ఉంది. పూర్వం ఇది నల్గొండ జిల్లాలో భాగంగా ఉండేది. తరువాత జిల్లాల పునర్వ్యవస్థీకరన అనంతరం కొత్త జిల్లాగా విభజించబడింది. ఇక్కడి సురేంద్రపురిలోని కుందా సత్యనారాయణ కళా ధామం పురాణాల పట్ల ఆసక్తి ఉన్న వారికి చెప్పుకోదగ్గ ఆధ్యాత్మిక ప్రదేశంగా పేరుగాంచింది. ఇది యాదగిరిగుట్ట సమీపంలో ఉంది. మైథలాజికల్ అవేర్‌నెస్ సెంటర్ అనినే థీమ్ పార్క్‌గా పరిగణించబడుతోంది.
దీనిని కుంట సత్యనారాయణ నిర్మించారు. ఈ ప్రదేశంలో మహాభారతం, రామాయణం, భాగవతం మరియు పురాణాల పురాణ కథల సంబంధించిన ఎపిసోడ్‌లను ప్రదర్శించే అందమైన పెయింటింగ్‌లు మరియు చెక్కడాలు సందర్శకులను ఎంతగానో ఆకర్షిస్తాయి. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన అనేక పుణ్యక్షేత్రాలలో కొలువైన దేవతామూర్తులను ఒకే స్థలంలో పూజించే అవకాశం ఇక్కడ దొరుకుతుంది. ఇక్కడ లభించే ఆధ్యాత్మక చింతన కోసం ప్రత్యేకంగా సందర్శకులు సుదూర ప్రాంతాల నుంచి బృందాలుగా చేరుకుంటారు.

భోంగీర్ కోట విశేషాలెన్నో..
భువనగిరిలోని భోంగీర్ పట్టణంలో ఉంది భోంగీర్ కోట. భువనగిరిని సందర్శించే యాత్రికులకు ఈ కోట ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశంగా పరిగణించబడుతోంది. భోంగీర్ కోటను దక్షిణాది ప్రాంతాలకు చెందిన ముసునూరి నాయకులు మొదటగా నిర్మించారు. 12వ శతాబ్దం ADలో చాళుక్య రాజు త్రిభువనమల్ల విక్రమాదిత్యచే నిర్మించబడింది. ఈ ప్రాంతం యాదాద్రి భువనగిరి సమీపంలోని ఇతర పట్టణాలు మరియు నగరాలతో రోడ్లు, రైలు మార్గాల ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది.
కోట యొక్క స్థావరం భూభాగం వెలుపల, భారీ ఏకశిల శిలతో గంభీరంగా తారసపడుతుంది. చాళుక్య మరియు కాకతీయ రాజవంశాల పాలనలో ఈ కోట కొత్తరూపును సంతరించుకున్నట్లు తెలుస్తోంది. అనేక దండయాత్రల తర్వాత కాలక్రమేణా ఈ కోటలో సుల్తానుల నుండి నిజాంల వరకు ప్రజలు అనేక అధికార మార్పిడిలను చూశారు.

ప్రణాళికాబద్ధమైన ఫ్రేమ్‌ను అమర్చినట్లు
కోట నేటికీ పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇది భూమి నుండి 500 అడుగుల ఎత్తులో కొండపై ఉంది. దీని నిర్మాణ శైలి సందర్శకులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దీనికి రహస్య మార్గాలు మరియు తలుపులు కూడా ఉన్నాయి. కోటను మెట్ల మార్గం ద్వారా చేరుకోవచ్చు. లేదా ఏటవాలు మార్గంలో ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. కోట భాగమంతా అందంగా, చక్కగా ప్రణాళికాబద్ధమైన ఫ్రేమ్‌ను అమర్చినట్లు కనిపిస్తుంది. రాళ్ల గోడలు, గ్రానైట్ తోరణాలు, కోటపై రాతి కటింగ్‌లు, ప్రధాన మెట్లు, కోటను చుట్టుముట్టిన కందకం, భూగర్భ మార్గం, వ్యూపాయింట్, హనుమాన్ దేవాలయం సందర్శకులకు ఈ పురాతన కోటపై ఆసక్తిని మరింత పెంచుతాయనే చెప్పాలి.
భోంగీర్ కోటను సందర్శించేందుకు ఉదయం 10:00 నుండి సాయంత్రం 05:00 వరకు తెరిచి ఉంచుతారు. దీనికి ప్రవేశ రుసుము భారతీయులకు ఒక్కొక్కరికి రూ. 10కాగా, విదేశీయులకు ఒక్కొక్కరికి రూ. 100గా ఉంది. స్టిల్ కెమెరాలకు అధనంగా చెల్లించాల్సి ఉంటుంది. మానసిక ప్రశాంతతను అందించడంతోపాటు చారిత్రక విశేషాలను పంచే భోంగీర్ కోట ప్రయాణం జీవితంలో మర్చిపోలేని ఎన్నో అనుభూతులను చేరువ చేస్తుందనే చెప్పాలి. మరెందుకు ఆలస్యం.. భువనగిరికి మీ ప్రయాణాన్ని మొదలుపెట్టండి.



Click it and Unblock the Notifications













