Search
  • Follow NativePlanet
Share
» »భాగ్య‌న‌గ‌రానికి మ‌రో మ‌ణిహారం కందుకూరు మెట్రో..

భాగ్య‌న‌గ‌రానికి మ‌రో మ‌ణిహారం కందుకూరు మెట్రో..

భాగ్య‌న‌గ‌రానికి మ‌రో మ‌ణిహారం కందుకూరు మెట్రో..

మెట్రో పేరు విన‌గానే తెలంగాణ రాష్ర్టంలోని హైద‌ర‌బాద్ గుర్తుకువ‌స్తుంది. ఇప్ప‌టికే రెండుద‌శ‌లు పూర్త‌యిన మెట్రో రైలు శ‌ర‌వేగంగా ప‌రుగులు పెడుతోంది. న‌గ‌ర‌వాసుల‌ను త‌క్కువ‌స‌మ‌యంలో గ‌మ్య‌స్థానాల‌కు చేర్చేంచుందుకు ఎంతో సిద్ధ‌మ‌వుతోంది. ఇదిలా వుండ‌గా, నిన్న సోమ‌వారం తెలంగాణ ముఖ్య‌మంత్రి ప్ర‌క‌ట‌న‌తో భాగ్య‌న‌గ‌రానికి మ‌రో మ‌ణిహారం దొరికింది. అదే కందుకూరు మెట్రో..

2024కు పూర్తయ్యే అవ‌కాశం..

హైదరాబాద్ మెట్రోను మహేశ్వరం జిల్లా కందుకూరు వరకూ పొడిగిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీర్ సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే . కందుకూరు వరకూ రెండు దశల్లో మెట్రో రైలు పొడిస్తున్నట్లు వెల్లడించారు. మొదటి దశలో హైటెక్ సిటీ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకూ, రెండో దశలో శంషాబాద్ నుంచి కందుకూరు వరకూ కొనసాగుతుంది. కందుకూరు వరకూ మెట్రో రైలును పొడిగించడం వల్ల మహేశ్వరం జిల్లా వాసులకు పెద్దఎత్తును ప్రయోజనం కలుగుతుందనడంలో సందేహమే లేదు.

1

ఈ మెట్రో వలన కందుకూరు ప్రజలకు రవాణా సౌకర్యం సులభతరం అవ్వడంతోపాటు సురక్షితమైన ప్రయాణానికి అవకాశం కలుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతోపాటు పెద్దసంఖ్యలో మహేశ్వరం జిల్లాలోని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు వేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. ప్రభుత్వ స్టేడియంతోపాటు ఆస్పత్రి, మెడిక‌ల్ కాలేజ్ నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయాన్ని మహేశ్వరం ప్రజలు స్వాగతిస్తున్నారు. ఇది 2024కు పూర్త‌య్యే అవ‌కాశం ఉంద‌న్నారు. దీంతో న‌గ‌ర‌వాసులు ఆ మార్గంలో మెట్రో ప్ర‌యాణం చేసేందుకు ఎంతో ఆశ‌గా ఎదురుచూస్తున్నారు.

భూగ‌ర్భంలో రైలుమార్గం..

రాష్ర్ట ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తోన్న మెట్రో రెండో ద‌శ నిర్మాణానికి సిఎం కెసిఆర్ గ‌తేడాది డిసెంబ‌ర్‌లో శంకుస్థాప‌న చేశారు. నాగోల్, రాయ‌దుర్గం కారిడార్ 3 కు కొన‌సాగింపుగా రాయ‌దుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్ర‌యం వ‌ర‌కు నిర్మించే ఎయిర్‌ఫోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రోకు గ‌చ్చిబౌలి స‌మీపంలోని ఐకియా ఎదుట ఉన్న మైండ్‌స్పేస్ వ‌ద్ద పునాది రాయి వేశారు.

2

మెట్రో రెండో ద‌శ విస్త‌ర‌ణ‌లో భాగంగా రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు ముప్ప‌యి కిలోమీట‌ర్ల వ‌ర‌కు కేవ‌లం 26 నిమిషాల్లోనే ప్ర‌యాణించేలా హైద‌ర‌బాద్ మెట్రో రైలు ఏర్పాట్లు చేస్తోంది. విమానాశ్ర‌యానికి త్వ‌ర‌గా చేరుకునేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. పిల్ల‌ర్ల‌తో పాటు 2.5 కిలోమీట‌ర్ల మేర భూగర్భంలో రైలు మార్గాన్ని కూడా నిర్మించ‌నుంది.

మెట్రో వ‌ల్ల క‌లిగే లాభాలు

హైదరాబాద్ మెట్రో అనేది నగర శివారు ప్రాంతాలకు సులభతరమైన, వేగవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు 2017 రూపొందించబడింది. ఇప్పటికే మూడు ఆపరేషన్ లైన్లు వినియోగంలో ఉన్నాయి. ఇప్పుడు ప్రకటించిన ఈ నాలుగో లైన్ నిర్మాణం 2024కు పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రజల ప్రయాణ అవసరాల దృష్ట్యా బీహెచ్‌ఈల్ నుంచి మహేశ్వరం నియోజవర్గంలోని కుందుకూర్ వరకు మెట్రో విస్తరించేందుకు ప్రయత్నం చేస్తామని అన్నారు.

కందుకూరుకు మెట్రో పొడిగింపు వల్ల అక్కడి స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. వేగవంతమైన, సురక్షితవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది. తద్వారా ఈ ప్రాంతం అభివృద్ధి చెందడంతోపాటు పెట్టుబడులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ లైన్ ద్వారా కందుకూరు ప్రజలకు మరెంతో మెరుగైన జీవన సౌలభ్యం కలిగే అవకాశం ఉంది.

More News

    Read more about: nagol hyderabad
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+