Search
  • Follow NativePlanet
Share
» »వచ్చే ఏడాది ఒకటి కాదు ఏకంగా 10 లాంగ్ వీకెండ్‌లు...

వచ్చే ఏడాది ఒకటి కాదు ఏకంగా 10 లాంగ్ వీకెండ్‌లు...

మ‌రికొన్ని రోజుల్లో కొత్త సంవ‌త్స‌రంలోకి అడుగు పెట్ట‌బోతున్నాం.. త్వరలోనే 2023 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ... 2024కి స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు. కొత్త సంవత్సరం అనేక కొత్త బహుమతులను అందిస్తుంది. చాలామంది ఈ కొత్త ఏడాదిలో తమ ఆరోగ్యం, వ్యక్తిగత జీవితం, కెరీర్ ప్లాన్‌లు, వారి జీవితానికి సంబంధించిన ఇతర అంశాల కోసం కొత్త నిర్ణయాలు తీసుకునే ప‌నిలో ఉంటారు. వీటితో పాటు, కొత్త సంవత్సరం వచ్చిందంటే, ఏడాది పొడవునా లభించే సెలవుల గురించి తెలుసుకోవాలని కూడా చాలామందికి ఆసక్తిగా ఉంటుంది. 2024లో లాంగ్ వీకెండ్‌లలో కొత్త ప్రణాళికలు వేసేందుకు చాలామంది ఆస‌క్తి క‌న‌బ‌రుస్తారు. ముఖ్యంగా ప్రజలు ప్రయాణించడానికి ప్లాన్ చేస్తారు. అటువంటి పరిస్థితిలో, మీరు కూడా న్యూ ఇయర్ రోజున ఎక్కడికైనా వెళ్లాల‌ని ప్లాన్ చేస్తుంటే మాత్రం 2024 సంవత్సరంలో వచ్చే లాంగ్ వీకెండ్ గురించి ఒక‌సారి తెలుసుకోండి.

నిజానికి, రాబోయే కొత్త సంవత్సరంలో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 10 దీర్ఘ వారాంతాలను పొందబోతున్నారు. ఇది ప‌ర్యాట‌కుల‌కు ఒక గుడ్‌న్యూస్ లాంటిది. ఈ లాంగ్ వీకెండ్స్ ప‌ర్యాట‌కుల వెకేషన్ ప్రణాళిక‌ల‌ను పూర్తిచేసేందుకు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఈ లాంగ్ వీకెండ్ ఏ నెలలో ఎప్పుడు వ‌స్తున్నాయో ఆ జాబితాను ఓసారి చూసేద్దా పదండి...

listofholidays

జనవరి 2024లో లాంగ్ వీకెండ్

1) శనివారం - డిసెంబర్ 30

ఆదివారం - డిసెంబర్ 31

సోమవారం- జనవరి 1 (న్యూ ఇయర్ డే)

మంగళవారం- జనవరి 2 (ఐచ్ఛికం- ఒక రోజు సెలవు తీసుకోండి)

2) శనివారం- 13 జనవరి (లోహ్రీ)

ఆదివారం-14 జనవరి

సోమవారం- జనవరి 15 (మకర సంక్రాంతి, పొంగల్)

మంగళవారం-జనవరి 16 (ఐచ్ఛికం- ఒక రోజు సెలవు తీసుకోండి)

3) శుక్రవారం- 26 జనవరి (గణతంత్ర దినోత్సవం)

శనివారం - జనవరి 27

ఆదివారం - 28 జనవరి

మార్చి 2024లో లాంగ్ వీకెండ్

1) శుక్రవారం- మార్చి 8 (మహాశివరాత్రి)

శనివారం- 9 మార్చి (గుడి పడ్వా)

ఆదివారం - మార్చి 10

2) శనివారం- 23 మార్చి

ఆదివారం - మార్చి 24

సోమవారం- మార్చి 25 (హోలీ)

మంగళవారం, మార్చి 26 (ఐచ్ఛికం-ఒక రోజు సెలవు తీసుకోండి)

3) శుక్రవారం- మార్చి 29 (శుభ శుక్రవారం)

శనివారం - మార్చి 30

ఆదివారం- మార్చి 31 (ఈస్టర్)

మే 2024లో లాంగ్ వీకెండ్

1) గురువారం- 23 మే (బుద్ధ పూర్ణిమ)

శుక్రవారం- మే 24 (రోజు సెలవు తీసుకోండి)

శనివారం - మే 25

ఆదివారం - 26 మే

జూన్ 2024లో లాంగ్ వీకెండ్

1) శనివారం- జూన్ 15

ఆదివారం - జూన్ 16

సోమవారం- జూన్ 17 (బక్రీద్)

మంగళవారం-18 జూన్ (ఒక రోజు సెలవు తీసుకోండి)

ఆగస్ట్ 2024లో లాంగ్ వీకెండ్

1) గురువారం- 15 ఆగస్టు (స్వాతంత్ర్య దినోత్సవం)

శుక్రవారం- ఆగస్టు 16 (ఒక రోజు సెలవు తీసుకోండి)

శనివారం - ఆగస్టు 17

ఆదివారం - ఆగస్టు 18

సోమవారం - 19 ఆగస్టు (రక్షా బంధన్)

2) శనివారం- ఆగస్టు 24

ఆదివారం - ఆగస్టు 25

సోమవారం- ఆగస్టు 26 (జన్మాష్టమి)

మంగళవారం- 27 ఆగస్టు (ఒక రోజు సెలవు తీసుకోండి)

సెప్టెంబర్ 2024లో లాంగ్ వీకెండ్

1) గురువారం- 5 సెప్టెంబర్ (ఓనం)

శుక్రవారం- 6 సెప్టెంబర్ (రోజు సెలవు తీసుకోండి)

శనివారం - సెప్టెంబర్ 7 (గణేష్ చతుర్థి)

ఆదివారం - 8 సెప్టెంబర్

2) శనివారం- 14 సెప్టెంబర్

ఆదివారం - సెప్టెంబర్ 15

సోమవారం- 16 సెప్టెంబర్ (ఈద్ మిలాద్ ఉన్ నబీ)

అక్టోబర్ 2024లో లాంగ్ వీకెండ్

1) శుక్రవారం- 11 అక్టోబర్ (మహానవమి)

శనివారం - అక్టోబర్ 12 (దసరా)

ఆదివారం - అక్టోబర్ 13

నవంబర్ 2024లో లాంగ్ వీకెండ్

1) శుక్రవారం- 1 నవంబర్ (దీపావళి)

శనివారం - నవంబర్ 2

ఆదివారం- నవంబర్ 3 (భాయ్ దూజ్)

సోమవారం-నవంబర్ 4 (ఐచ్ఛికం-ఒక రోజు సెలవు తీసుకోండి)

2) శుక్రవారం- నవంబర్ 15 (గురునానక్ జయంతి)

శనివారం - నవంబర్ 16

ఆదివారం - నవంబర్ 17

More News

Read more about: list of holidays in 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+