Search
  • Follow NativePlanet
Share
» »ఇక‌పై మొబైల్‌నుంచే ట్రైన్ జ‌న‌ర‌ల్ టికెట్ తీసుకోవ‌చ్చు...!

ఇక‌పై మొబైల్‌నుంచే ట్రైన్ జ‌న‌ర‌ల్ టికెట్ తీసుకోవ‌చ్చు...!

భార‌త్‌లో చాలామంది ప్ర‌యాణికులు రైలు మార్గాల‌నే ఎంచుకుంటారు. ఎందుకంటే, అవి సౌక‌ర్య‌వంతంగానూ, త‌క్కువ ధ‌ర‌తోనూ ఉంటుంది. సూదుర ప్రాంతాల‌కు వెళ్లాల‌నుకునేవారు రిజ‌ర్వేష‌న్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగానే టికెట్ బుక్ చేసుకోవాలి. అప్పటికప్పుడు ప్ర‌యాణం చేయాల‌నుకునేవారు, ద‌గ్గ‌రి ప్రాంతాలకు వెళ్లాల‌నుకునేవారయితే ఎటువంటి టికెట్ బుకింగ్ లేకుండానే కౌంటర్‌ వద్దే టికెట్‌ తీసుకోవాల్సి ఉంటుంది. ఇటీవ‌లీ కాలంలో కౌంట‌ర్ల ద‌గ్గ‌ర కూడా బారీ క్యూల‌ను చూస్తున్నాం. కౌంట‌ర్ ద‌గ్గ‌ర టికెట్ తీసుకోవ‌డం వ‌ల్ల కూడా చాలా స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నాయి. అటువంటి స‌మ‌స్య‌ల‌ను నివారించేందుకే రైల్వే శాఖ ప్ర‌యాణికుల కోసం యుటిఎస్ యాప్‌న్ తీసుకొచ్చింది.

నాన్‌-సబర్బన్‌ ట్రావెల్‌ టికెట్‌...

యుటిఎస్ అంటే అన్‌రిజర్వ్‌డ్‌ టికెట్‌ బుకింగ్‌ సిస్టమ్‌. ఈ యాప్‌ను ఒకప్పుడు ద‌గ్గ‌రి ప్ర‌యాణాల కోసం, క్విక్‌ బుకింగ్‌, ప్లాట్‌ఫాం టికెట్‌, సీజన్‌ టికెట్‌, క్యూఆర్‌ బుకింగ్‌ కోసం మాత్ర‌మే అందుబాటులోకి తీసుకొచ్చారు. కానీ, ఇప్ప‌డు ఈ యాప్‌తో నాన్‌-సబర్బన్‌ ట్రావెల్‌ టికెట్‌ బుక్ చేసుకోవ‌చ్చు.

nowyoucanbuytraingeneralticketfrommobile 1

నాన్ స‌బ‌ర్బ‌న్ ట్రావెల్ టికెట్ బుక్ అంటే 200 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉన్న ప్రయాణానికి మూడు రోజుల ముందే టికెట్‌ బుక్‌ చేసుకోవడం. 200 కిలోమీట‌ర్ల‌ కంటే తక్కువ దూరం ఉంటే ప్రయాణం రోజే టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది.

UTS యాప్‌లో టికెట్ బుక్ చేయు విధానం..

ముందుగా, ఈ యుటిఎస్ యాప్‌ను గూగుల్‌ ప్లేస్టోర్‌/ యాప్‌ స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని అకౌంట్‌ క్రియేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అనంత‌రం యాప్‌లో లాగిన్ అవ్వాలి. లాగిన్‌ అయిన వెంటనే స్క్రీన్‌పై కనిపించే Normal Booking సెక్షన్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది. అందులోకి వెళ్లాగ‌నే రెండు ఆప్ష‌న్‌లు క‌నిపిస్తాయి. ఒక‌టి Book and Travel (పేపర్‌లెస్), రెండోది Book and Print (పేపర్‌), వీటిలో ఏదో ఒక దాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. మొద‌టి ఆఫ్ష‌న్‌ను ఎంచుకుంటే మీ ఫోన్‌లో జీపీఎస్‌ను ఆన్ చేయాల్సి ఉంటుంది.

ఆ త‌ర్వాత ప్ర‌యాణం చేసే స్టేష‌న్‌తోపాటు చేరుకోవాల్సిన స్టేష‌న్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ప్రయాణానికి అందుబాటులో ఉన్న రైళ్లు, వాటి ఛార్జీలు కింద ఆఫ్ష‌న్ల‌లో డిస్‌ప్లే అవుతాయి. అందులో Get Fare అనే ఆప్ష‌న్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసి మీరు ప్ర‌యాణించే ట్రైన్‌పై క్లిక్‌ చేయగానే టైం, ప్లాట్‌ఫాం నంబర్‌, ట్రైన్‌ నంబర్‌, టికెట్‌ ధర వంటి వివరాలు డిస్‌ప్లేలో కనిపిస్తాయి. అందులో ప్యాసింజర్ల సంఖ్య, ప్యాసింజర్‌, ఎక్స్‌ప్రెస్‌, సూపర్‌ ఫాస్ట్ అనే ట్రైన్ టైప్‌, పేమెంట్‌ టైప్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది.

అలా కిందకు స్క్రోల్ చేస్తే BOOK TICKET అనే అప్ష‌న్ క‌నిపిస్తుంది. వెంట‌నే దానిపై క్లిక్ చేయాలి. అది క్లిక్ చేసిన వెంట‌నే మ‌రికొన్ని ఆఫ్ల‌న్లు కనిపిస్తాయి. అవే ఆర్‌- వాలెట్‌, డెబిట్‌ కార్డ్‌/ UPI / ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌/ క్రెడిట్‌ కార్డ్‌.. ఈ చెల్లింపు ఎంపికల్లో ఏదో ఒక దాన్ని ఎంచుకొని టికెట్‌ బుక్‌ చేసుకోవాలి. టికెట్‌ బుక్ చేసుకునే ముందు పేపర్‌ మోడ్ అనే అప్షన్‌ను ఎంచుకుంటే దగ్గరల్లోని యుటీఎస్ కియోస్క్ లేదా రైల్వే బుకింగ్ కౌంటర్‌కు వెళ్లి టిక్కెట్‌ను ప్రింట్‌ తీసుకోవ‌చ్చు.

ఈ యుటిఎస్ యాప్‌తో ఒకప్పుడు స్టేషన్‌కు 5 కిలోమీట‌ర్ల‌. పరిధిలో మాత్రమే టికెట్‌ బుక్‌ చేసుకునే వెసులుబాటు ఉండేది. దాన్ని పట్టణాల్లో 10 కిలోమీట‌ర్ల‌కి, ఇతర ప్రాంతాల్లో 20 కిలోమీట‌ర్ల‌కు పెంచారు.

More News

    Read more about: train tickets online uts app
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+