Search
  • Follow NativePlanet
Share
» »ప్ర‌యాణికుల‌కు బంఫ‌ర్ ఆఫ‌ర్‌.. రూ..99కే హైద‌రాబాద్ టు బెంగుళూరు బస్సు ప్రయాణం..

ప్ర‌యాణికుల‌కు బంఫ‌ర్ ఆఫ‌ర్‌.. రూ..99కే హైద‌రాబాద్ టు బెంగుళూరు బస్సు ప్రయాణం..

హైదారాబాద్ టు బెంగుళూరు ప్ర‌యాణం చేసేవారికి ట్రావెల్- టెక్ సంస్థ ఫ్లిక్స్‌బస్ ఓ శుభ‌వార్త‌ను అందించింది. తాజాగా ఫ్లిక్స్‌బ‌స్సు సంస్థ త‌న బ‌స్సు స‌ర్వీసుల‌ను ద‌క్షిణాదిలోకి కూడా విస్త‌రించిన‌ట్లు స్ప‌ష్టంచేసింది. ఈ సంస్థ జ‌ర్న‌నీ ప్ర‌ధాన కేంద్రాలుగా త‌న కార్య‌క‌ల‌పాల‌ను నిర్వ‌రిస్తోంది. ఈ నెల 3వ తేదిన సౌత్ ఇండియాలో త‌న స‌ర్వీసుల‌ను విస్త‌రించేందుకు ప్ర‌క‌ట‌న చేయ‌గా, సెప్టెంబ‌ర్ 10వ తేదీనుంచి బస్సు కార్యకలాపాలు ప్రారంభమవుతాయని ఆ సంస్థ పేర్కొంది. ఇందులో భాగంగా ఈ స‌ర్వీసులు బెంగళూరు నుంచి హైదరాబాద్, చెన్నైకి ఉంటాయని ఆ సంస్థ ప్ర‌క‌టించింది.

ఈ సంస్థ ప్ర‌యాణికుల‌కు కేవ‌లం రూ.99తోనే బ‌స్సు ప్ర‌యాణాన్ని అందిస్తోంది. ఈ బంప‌ర్ ఆఫ‌ర్ కేవ‌లం కొద్దిరోజుల వ్య‌వ‌ధి వ‌ర‌కే ప్ర‌యాణికుల‌కు అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఈ సర్వీసుల్ని సౌత్ ఇండియాలోని ఇతర ప్రధాన నగరాలైన కోయంబత్తూర్, మదురై, తిరుపతి, విజయవాడ, బెళగావికి విస్తరించనున్నట్లు ఫ్లిక్స్ బ‌స్ సంస్థ పేర్కొంది. ప్ర‌యాణికుల‌కు అందుబాటు ఛార్జీలతోనే ఈ ఆఫ‌ర్‌ను అందిచ‌నుంది. రూ.99తోనే హైద‌రాబాద్ టు బెంగుళూరు బ‌స్సు ప్ర‌యాణం చేసేయొచ్చు. ఈ ఆఫర్ కేవ‌లం సెప్టెంబర్ 15 వరకు మాత్రమే ప్ర‌యాణికుల‌కు అందుబాటులో ఉండనుంది. FlixBus యాప్, వెబ్‌సైట్‌లో టిక్కెట్ బుక్ చేయడం ద్వారా సెప్టెంబర్ 10 నుంచి అక్టోబర్ 6వ తేది మధ్య అన్ని గమ్యస్థానాలకు రూ. 99 కే ప్రయాణించడానికి వీలు కలుగుతుందని ఫ్లిక్స్ బ‌స్ సంస్థ పేర్కంది.

ప్రారంభ ఆఫర్‌లో భాగంగా...

ఈ ఫ్లిక్స్‌బస్ ఇప్పటివరకు 6 బస్ ఆపరేటర్లతో భాగ‌స్వామ్యం క‌లిగి ఉంది. ఇక దీనిని త్వరలో ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళల్లోని 33 నగరాలు సహా ద‌క్షిణ భార‌త‌దేశంలోని మొత్తం మరో 200 కనెక్షన్స్‌కు బస్సు సర్వీసులు కల్పించేందుకు కృషి చేస్తున్న‌ట్లు ఫ్లిక్స్ బ‌స్ సంస్థ‌ పేర్కొంది. ఈ ప్రారంభ ఆఫర్‌లో భాగంగా ఇప్పుడు బెంగళూరు నుంచి ఎక్కడికైనా తమ బస్సు సర్వీసుల్లో ప్రమోషనల్ ఆఫర్ కింద రూ. 99 తోనే ప్రయాణించే వెసులుబాటు ప్ర‌యాణికుల‌కు కల్పిస్తున్నట్లు ఫ్లిక్స్ బ‌స్ సంస్థ తెలిపింది.

hyderabadtobangalorebusjourney

ఇందులో భాగంగానే ఇక‌, బెంగళూరు నుంచి హైదరాబాద్, చెన్నైలకు కేవ‌లం వంద‌రూపాయ‌ల్లోపే ప్ర‌యాణం చేసే అవ‌కాశం వ‌చ్చింది. బెంగళూరు నుంచి చెన్నై, హైదరాబాద్ మార్గాల గుండా వెళ్లే ఈ బస్సుల్ని కర్ణాటక వాణిజ్య, మౌలిక, పరిశ్రమల మంత్రి ఎంబీ పాటిల్ చేతుల మీదుగా నిన్న (మంగళవారం) రోజు ఆవిష్కరించారు. ఇక‌, ఈ కార్య‌క్ర‌మంలో గ్లోబల్ ఫ్లిక్స్ సీఓఓ మ్యాక్స్ జుమేర్, కో ఫౌండర్ డేనియల్ క్రాస్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఈ రోజుల్లో మాత్ర‌మే ఆఫ‌ర్‌..

ప్రారంభ ఆఫ‌ర్‌లో భాగంగానే ఈ ప్ర‌త్యేక ఆఫ‌ర్ ప్రకటించింది. ఈ ఆఫ‌ర్ కేవ‌లం సెప్టెంబర్ 3వ తేది నుంచి 15 వరకు మాత్ర‌మే ప్ర‌యాణికుల‌కు అందుబాటులో ఉంటుంద‌ని ఫ్లిక్స్‌బ‌స్ సంస్థ పేర్కొంది. అంటే ఆ తేదిలోపే ఈ మార్గాల్లో టికెట్స్ బుక్ చేసుకోవచ్చని సంస్థ స్పష్టం చేసింది. ఈ ఆఫ‌ర్ బుక్ చేసుకున్నవారు సెప్టెంబర్ 10 నుంచి అక్టోబర్ 6 వరకు ప్రయాణ తేదీల్లో రూ.

99తోనే ప్రయాణించొచ్చని ఫ్లిక్స్‌బ‌స్ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. జర్మనీకి చెందిన ఫ్లిక్స్‌బస్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బస్ నెట్‌వర్క్ సంస్థగా ప్ర‌సిద్ధిచెందింది. ఇది ప్రత్యేకంగా BS6 ఇంజిన్లతో కూడిన ప్రీమియం బస్ మోడల్స్‌ను నిర్వహిస్తుంది. భారత్‌లో ఈ సంస్థ ఫిబ్రవరి నెల‌లోనే ఉత్త‌ర‌భార‌త్‌లోకి త‌న బ‌స్సుల‌ను ప్ర‌వేశ‌పెట్టింది. ఇప్ప‌డు కొత్త‌గా బెంగళూరు నుంచి ప్రయాణ మార్గాల్ని ప్రారంభిస్తోంది.

More News

Read more about: hyderabad telangana
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+