Search
  • Follow NativePlanet
Share
» »వినాయ‌క నిమ‌జ్జ‌నం వేళ‌.. హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో రెండురోజులు ట్రాఫిక్ ఆంక్షలు..

వినాయ‌క నిమ‌జ్జ‌నం వేళ‌.. హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో రెండురోజులు ట్రాఫిక్ ఆంక్షలు..

హైదరాబాద్‌లో రేపు (మంగ‌ళ‌వారం) గ‌ణేష విగ్రహాల నిమజ్జనం జ‌ర‌గ‌త‌నుంది. దీంతో న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో సెప్టెంబ‌ర్ 17,18 తేదీల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్న‌ట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్‌, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వినాయ‌కుని విగ్రహాలు హుస్సేన్‌ సాగర్‌ వైపు నిమ‌జ్జ‌నానికి రావ‌డంతో నగర వ్యాప్తంగా అధికారులు ట్రాఫిక్ ఆంక్షల్ని అమలు చేయనున్నారు.

ట్రాఫిక్ ఆంక్ష‌ల్లో భాగంగానే బాలాపూర్‌ నుంచి గుర్రం చెరువు ట్యాంక్‌పై కట్టమైసమ్మ ఆలయం వద్ద గణేష్‌ విగ్రహ ఊరేగింపు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోకి ప్రవేశిస్తుంద‌ని అధికారులు తెలిపారు. దీంతో విగ్ర‌హాల‌న్నీ కేశవగిరి, చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్‌, ఎంబీఎన్‌ఆర్‌ ఎక్స్‌ రోడ్, ఫలక్‌నుమా రైల్వే ఓవర్‌ బ్రిడ్జ్, ఆలియాబాద్, చార్మినార్, మదీనా, అఫ్జల్‌గంజ్, ఎంజే మార్కెట్, అబిడ్స్‌ ఎక్స్‌ రోడ్, బషీర్‌బాగ్, లిబర్టీ జంక్షన్, ఎన్టీఆర్‌ మార్గ్, పీవీఎన్‌ఆర్‌ మార్గ్‌ (నెక్లెస్‌ రోడ్డు)లో అంబేడ్కర్‌ విగ్రహం వైపు వెళ్లాలని అధికారులు తెలిపారు.

సికింద్రాబాద్‌...

సికింద్రాబాద్‌ నుంచి వచ్చే వినాయ‌కుని విగ్రహల‌ను సంగీత్‌ థియేటర్, ప్యాట్నీ, ప్యారడైజ్‌ జంక్షన్, ఎంజీ రోడ్డు, కర్బలా మైదాన్, ట్యాంక్‌బండ్‌ మీదుగా నెక్లెస్‌ రోడ్డుకు మ‌ళ్లించాల‌ని అధికారులు తెలిపారు. వీటితోపాటు చిలకలగూడ కూడలి నుంచి వచ్చే గణేష్‌ విగ్రహాలు గాంధీ ఆసుపత్రి, ఆర్టీసీ క్రాస్‌ రోడ్, నారాయణగూడ పైవంతెన, వై.జంక్షన్, హిమాయత్‌నగర్‌ నుంచి లిబర్టీ వైపు మ‌ళ్లించనున్నారు.

ontheoccasionofvinayakanimajjanam

నల్గొండ ఎక్స్‌ రోడ్డు...

ఉప్పల్‌ ప్రాంతం నుంచి వచ్చే గ‌ణేష్ విగ్ర‌హ ఊరేగింపులు రామంతాపూర్, శ్రీ రమణ జంక్షన్, ఛే నంబరు, తిలక్‌నగర్, ఓయూ ఎన్‌సీసీ గేట్, విద్యానగర్‌ జంక్షన్, ఫీవర్‌ ఆసుపత్రి, బర్కత్‌పుర కూడలి మీదుగా వెళ్తాయి. ఆ ఊరేగింపులు నారాయణగూడ వైఎంసీఏ కూడలికి చేరుకొని, ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు నుంచే వచ్చే ఊరేగింపుతో క‌లుస్తాయి. ఇక‌, దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి వచ్చే వినాయ‌కుని విగ్రహాలు ఐఎస్‌ సదన్, సైదాబాద్, చంచల్‌గూడ నుంచి వచ్చే ఊరేగింపుతో నల్గొండ ఎక్స్‌ రోడ్డులో కలుస్తాయి. అక్కడి నుంచి మూసారాంబాగ్‌ మీదుగా అంబర్‌పేట్‌ వైపు వెళ్తాయి.

ప్ర‌త్యామ్నాయ మార్గాలు..

ఇక‌, తార్నాక వైపు నుంచి వచ్చే విగ్రహాలు ఉస్మానియా విశ్వవిద్యాలయం దూర విద్యాకేంద్రం రోడ్డు, అడిక్‌మెట్‌ వైపు వెళ్లి విద్యానగర్‌ మీదుగా ఫీవర్‌ ఆసుపత్రి వద్ద ఊరేగింపు చేరుకుంటుంది. టోలిచౌకి, రేతిబౌలి, మోహిదీపట్నం వైపు నుంచి వచ్చే వినాయ‌కుని ఊరేగింపు మాసబ్‌ట్యాంక్, అయోధ్య జంక్షన్, నిరంకారి భవన్, ద్వారకా హోటల్‌ జంక్షన్, ఇక్బాల్‌ మినార్‌ మీదుగా ఎన్టీఆర్‌ మార్గ్‌కు చేరుకుంటున్న‌ట్లు అధికారులు తెలిపారు. ఎర్రగడ్డ నుంచి వచ్చే విగ్రహాలు ఎస్‌ఆర్‌ నగర్, అమీర్‌పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్‌ మీదుగా వ‌స్తాయి.

మోహిదీపట్నం నుంచి వచ్చే ఊరేగింపు నిరంకారి భవన్‌ వద్ద చేరి, ఎన్టీఆర్‌ మార్గ్ చేరుకుంటుంది. టప్పాచబుత్ర, ఆసిఫ్‌నగర్‌ ప్రాంతాల నుంచి వచ్చే విగ్రహాలు సీతారాంబాగ్, బోయిగూడ కమాన్, వోల్గా హోటల్‌ ఎక్స్‌రోడ్, గోషామహల్, మాలకుంటజంక్షన్‌ మీదుగా వెళ్లి ఎంజేఎం వద్ద ప్రధాన ఊరేగింపులో కలుస్తాయ‌ని అధికారులు తెలిపారు. వినాయక చవితి విగ్రహాల నిమజ్జనం క్ర‌మంలో సాధారణ ప్రజలు రాకపోకలకు అంతరాయం క‌లిగే అవ‌కాశం ఉంటుంద‌ని, దీంతో ఊరేగింపు సాగే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని, ప్రజలు అందుకు అనుగుణంగా ప్ర‌త్యామ్నాయ మార్గాలను ఎంపిక చేసుకోవాల‌ని అధికారులు సూచించారు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+