Search
  • Follow NativePlanet
Share
» »రోగుల‌కు రైల్వేశాఖ గుడ్‌న్యూస్‌.. ట్రైన్ టిక్కెట్స్‌పై ప్రత్యేక రాయితీలు..

రోగుల‌కు రైల్వేశాఖ గుడ్‌న్యూస్‌.. ట్రైన్ టిక్కెట్స్‌పై ప్రత్యేక రాయితీలు..

ఇండియ‌న్ రైల్వే ప్ర‌యాణికుల కోసం ఎప్ప‌టిక‌ప్ప‌డు స‌రికొత్త ప్యాకేజీల‌ను, రాయితీల‌ను అందిస్తోంది. దేశంలో నిత్యం లక్షలాది మంది ప్రయాణికులు రైలు మార్గాల‌ను ఎంచుకుంటున్నారు. ఈ మార్గం ద్వారానే తాము వెళ్లాలనుకున్న గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. ఎందుకంటే, ఇండియ‌న్ రైల్వే ఎంతో సుఖ‌వంత‌మైన, సుర‌క్షిత‌మైన, చౌకైన ప్ర‌యాణ సౌక‌ర్యాన్నీ ప్ర‌యాణికుల‌కు అందిస్తోంది. దీని కారణంగానే చాలామంది రోడ్డు రవాణా కంటే రైళ్లలో ప్రయాణం చేసేందుకు ఎక్కువ ఆసక్తి క‌న‌బ‌రుస్తుంటారు.

రైళ్ళు రోడ్డు రవాణా కంటే త్వరితంగా ప్ర‌యాణికుల‌ను వారి గమ్య స్థానాలకు చేరుస్తాయి. అయితే, రైలు మార్గాల్లో ప్ర‌త్యేక రాయితీలు కూడా ఉన్నాయి. ఇప్ప‌టికే సీనియ‌ర్ సిటిజ‌న్స్‌కు మ‌హిళ‌ల‌కు, పురుషుల‌కు కూడా రాయితీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌డు అనారోగ్యంతో (రోగులకు) బాధ‌ప‌డేవారికి కూడా ప్రత్యేక రాయితీల‌ను రైల్వే ఇచ్చింది. వాటి వివ‌రాలేంటో చూసేద్దాం.

ట్రైన్ టిక్కెట్స్‌పై రాయితీలు..

భార‌తదేశంలో నిత్యం లక్షల సంఖ్యలో ప్ర‌యాణికుల‌కు రైలు మార్గాల ద్వారా ప్రయాణాలు సాగిస్తుంటారు. భారతీయ రైల్వే ప్రయాణించే అనేక వర్గాల ప్రయాణికులకు స్పెష‌ల్ డిస్కౌంట్‌ల‌ను కూడా క‌ల్పిస్తోంది. ఇక‌, ఇప్పటికే సీనియర్ సిటిజన్స్ కు మహిళలకు 50శాతం రాయితీ క‌ల్పించగా, పురుషులకు 40 శాతం రాయితీ కల్పించి సగం టికెట్ ధరనే తీసుకుంటుంది. అనారోగ్యంతో బాధపడే ప్రయాణికుల కోసం కూడా భారతీయ రైల్వే ప్ర‌త్యేక రాయితీల‌ను ఇచ్చింది.

railwaygoodnewsforpatients

ఎయిడ్స్ రోగుల‌కు..

ఇందులో భాగంగానే రైల్వేశాఖ ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ కోచ్ లో ప్రయాణం చేసే ఎయిడ్స్ రోగుల‌కు 50 శాతం రాయితీ ఇస్తుంది. ఎయిడ్స్ రోగులకు సెకండ్ క్లాస్ లో 50శాతం రాయితీ ఇస్తుంది. ఇక‌, టీబీ మరియు లూపాస్ వల్గారిస్ తో బాధపడే వారికి కూడా సెకండ్ క్లాస్ స్లీపర్ క్లాస్ మరియు ఫస్ట్ క్లాస్ లో 75 శాతం తగ్గింపు ఇస్తుంది.

క్యాన్సర్ రోగులకు..

రైళ్ళలో ప్రయాణం చేసే రోగులకు రైల్వేశాఖ ప‌లు రాయితీలు ఇస్తుంది. ఇందులో భాగంగానే రైలు మార్గాల్లో ప్రయాణం చేసే క్యాన్సర్ రోగులకు 75 శాతం డిస్కౌంట్ ను రైల్వే అందిస్తుంది. వీటితోపాటు సెకండ్ క్లాస్, ఫస్ట్ క్లాస్, ఏసీ చైర్ కార్లలో ప్రయాణం చేసే వారికి 75 శాతం రాయితీ ఇస్తుంది. స్లీపర్, థర్డ్ ఏసీ ప్రయాణంలో 100 శాతం తగ్గింపు కూడా ఇస్తుంది.

సైకిల్ సెల్ ఎనీమియా, ఓస్టోమి పేషెంట్లకు రాయితీ..

ఈ రోగుల‌తో పాట సైకిల్ సెల్ ఎనీమియా తో బాధపడే వారికి కూడా స్లీపర్ క్లాస్, ఏసీ చైర్ కార్, ఏసీ థర్డ్ టైర్ ,ఏసీ టూ టైర్ క్లాసులలో 50 శాతం డౌస్కౌంట్ అందిస్తుంది. ఓస్టోమి పేషంట్లకు ఎంఎస్ టి, క్యూ ఎస్టి పై 50శాతం రాయితీ ఇస్తుంది. అయితే, రైల్వే శాఖ రోగుల‌కు ఇలాంటి రాయితీలు ప్ర‌క‌టిస్తుంద‌నేది చాలామంది తెలియదు. కాబ‌ట్టి ఈ విషయం తెలుసుకుని అవసరమైన వారికి చెప్తే చాలా మందికి కొంత‌మేర‌కు ఆర్థిక ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

తలసేమియా, హార్ట్, కిడ్నీ,రోగుల‌కూ రాయితీ..

ఈ రోగుల‌తోపాటు తల సేమియా, హార్ట్, కిడ్నీ పేషెంట్లకు కూడా ఏసీ క్లాస్, ఏసి థర్డ్ , ఏసి చైర్ కార్లలో ప్రయాణం పైన రైల్వేశాఖ 75శాతం మినహాయింపు ఇస్తుంది. అంతేకాదు ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీలలో 50శాతం తగ్గింపు ఇస్తుంది. ఈ పేషేంట్ల‌తో పాటు హేం ఫిలియా పేషెంట్లకు కూడా రైల్వేశాఖ సెకండ్ క్లాస్, స్లీపర్ క్లాస్, ఫస్ట్ క్లాస్, ఏసి చైర్ కార్లలో 75శాతం రాయితీని ఇస్తుంది.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+