Search
  • Follow NativePlanet
Share
» »ద‌క్షిణ మ‌ధ్య రైల్వే కీల‌క నిర్ణ‌యం..నేటి నుంచి 14 వరకు అదనపు కోచ్‌లు..

ద‌క్షిణ మ‌ధ్య రైల్వే కీల‌క నిర్ణ‌యం..నేటి నుంచి 14 వరకు అదనపు కోచ్‌లు..

ఎన్నికల వేళ ఏపీ ప్ర‌యాణికుల‌కు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ఓట‌ర్ల కోసం ప‌లు మార్గాల్లో అద‌న‌పు కోచ్‌లు న‌డిపేందుకు సౌత్ సెంట్ర‌ల్ రైల్వే నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌స్తుతం దేశంలో ఎన్నిక‌ల వేడి కొన‌సాగుతుంది. ఈ నెల 13న ఏపీలో ఎన్నిక‌ల్లో భాగంగా సొంత గ్రామాల‌కు వెళ్లి ఓట్లు వేసేవారికోసం సికింద్రాబాద్ నుంచి ప‌లు మార్గాల్లో అద‌న‌పు కోచ్‌ల‌ను న‌డిపేందుకు రైల్వేశాఖ సిద్ధ‌మ‌య్యింది. ప్రస్తుతం నడుస్తున్న 22 రైళ్లకు అదనపు కోచ్‌లను ఏర్పాటు చేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మే 13వ తేదీన సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేప‌థ్యంలో ఈసీ పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. వేసవి దృష్ట్యా త‌మ సొంత గ్రామాల‌కు వెళ్లి ఓట్లు వేసేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతోంది.

ఎన్నికల పోలింగ్‌ వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలోఉంచుకొని సౌత్ సెంట్ర‌ల్ రైల్వే కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఏపీ, తెలంగాణ మధ్య సర్వీసులందించే దాదాపు 20కి పైగా ట్రైన్లకు తాత్కాలికంగా అదనపు కోచ్‌లను ఏర్పాటు చేసినట్లు రైల్వేశాఖ ప్రకటించింది. దీంతో వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉన్న ప్రయాణికులకు కొంత ఉపశమనం ల‌భించ‌నుంది. ఈ అద‌న‌పు కోచ్‌ల సేవ‌లు కేవ‌లం నాలుగు రోజులు మాత్ర‌మే ఉంటాయి. నేటి నుంచి (మే 10) 14వ తేదివ‌ర‌కు ఈ అద‌న‌పు కోచ్ సేవ‌లు ప్ర‌యాణికుల‌కు అందుబాటులో ఉంటాయి. ఇందులో 3 ఏసీ, సెకెండ్‌ ఏసీ, స్లీపర్‌, చైర్‌ కార్‌ కోచ్‌లు కూడా ఉన్నాయి. ఈ అద‌నుపు ట్రైన్ల వివ‌రాలు ఇలా ఉన్నాయి..

southcentralrailways

అద‌న‌పు కోచ్ ల ట్రైన్ల వివ‌రాలివే...

07025 అనే ట్రైన్‌ నంబర్ మే 9వ తేదీన రాత్రి 8.30 కాచిగూడలో బయలుదేరుతుంది. ఉదయం 8 గంటలకు కాకినాడ టౌన్‌కు చేరుకుంటుంది. 07026 అనే నెంబ‌ర్‌గ‌ల ట్రైన్‌ తిరుగు ప్రయాణంలో 10వ తేదీ సాయంత్రం 5.10కి కాకినాడ టౌన్‌లో బయలుదేరి మర్నాడు ఉదయం 4.50కి కాచిగూడకు చేరుకుంటుంది. 07271 అనే నెంబ‌ర్‌గ‌ల ట్రైన్ మే 10వ తేదీ రాత్రి 9.20కి సికింద్రాబాద్‌ నుంచి బయల్దేరుతుంది. అదే ట్రైన్ మరుసటి రోజు ఉదయం 8 గంటలకు కాకినాడ చేరుకుంటుంది. 07272 అనే నెంబ‌ర్‌గ‌ల ట్రైన్ తిరుగు ప్రయాణంలో మే 11వ తేదీ రాత్రి 9గంటలకు కాకినాడలో బయలుదేరుతుంది. ఆ మరుసటి రోజు ఉదయం 8.30కు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది.

07175 అనే నెంబ‌ర్‌గ‌ల ట్రైన్‌ మే 11వ తేదీన రాత్రి 11 గంటలకు హైదరాబాద్‌ నుంచి బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 8.35కు నర్సాపూర్ స్టేష‌న్ చేరుకుంటుంది. 07176 నంబర్ గ‌ల ట్రైన్ మే 13న సాయంత్రం 6గంటలకు నరసాపూర్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5 గంటలకు హైదరాబాద్‌ చేరుకుంటుంది. 07487 అనే నెంబ‌ర్‌గ‌ల ట్రైన్ మే 13వ తేదీన నాందేడ్‌లో మధ్యాహ్నం 2.25 స‌మ‌యంలో బయల్దేరుతుంది. మరుసటి రోజు ఉదయం 8.10కి కాకినాడ టౌన్ స్టేష‌న్‌కు చేరుకుంటుంది. 07488 అనే నెంబ‌ర్‌గ‌ల ట్రైన్ తిరుగు ప్రయాణంలో మే 14వ తేదీన సాయంత్రం 6.30కి కాకినాడ టౌన్‌లో బయలుదేరి మరుసటి రోజు మ‌ధ్యాహ్నాం 3.10కి నాందేడ్‌ చేరుకుంటుంది.

సికింద్రాబాద్ నుంచి కూడా ప్రత్యేక వారాంతపు ట్రైన్స్‌..

వీటితో పాటు తిరుపతి - శ్రీకాకుళం మధ్య కూడా ప‌లు ప్ర‌త్యేక ట్రైన్ల‌ను న‌డ‌ప‌నున్నారు. ఈ స్పెష‌ల్ ట్రైన్ ప్ర‌తి ఆదివారం ప్ర‌యాణికుల‌కు అందుబాటులో ఉండ‌నుంది. ఈ ట్రైన్ మే 05వ తేది నుంచి 12వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి. 07441 అనే నెంబ‌ర్‌గ‌ల ట్రైన్ శ్రీకాకుళం నుంచి తిరుపతికి న‌డ‌వ‌నుంది. ఇక‌, సికింద్రాబాద్ నుంచి కూడా ప్రత్యేక వారాంతపు రైళ్లను న‌డిపేందుకు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే సిద్ధ‌మ‌య్యింది. 07234 అనే నెంబ‌ర్‌గ‌ల ట్రైన ఏప్రిల్ 28 నుంచి జూన్‌ 30వ తేదీ వరకు ప్రతి ఆదివారం సికింద్రాబాద్‌ నుంచి సంత్రగచి వరకు న‌డుస్తున్న‌ట్లు రైల్వేశాఖ అధికారులు తెలిపారు.

More News

    Read more about: south central railway
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+