Search
  • Follow NativePlanet
Share
» »ప్ర‌యాణికుల‌కు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే కీల‌క ప్ర‌క‌ట‌న.. ప‌లు రైళ్లు ర‌ద్దు..

ప్ర‌యాణికుల‌కు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే కీల‌క ప్ర‌క‌ట‌న.. ప‌లు రైళ్లు ర‌ద్దు..

ప్ర‌యాణికుల‌కు ముఖ్య గ‌మ‌నిక‌.. హైదారాబాద్‌, సికింద్రాబాద్ డివిజ‌న్ల‌లోని ప‌లు రైళ్ల‌ను ర‌ద్దు చేస్తున్న సౌత్ సెంట్ర‌ల్ రైల్వే కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ట్రాక్‌ మరమ్మతుల కారణంగా పలు ట్రైన్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. కావున‌, ప్ర‌యాణికులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి ఇత‌ర ప్ర‌యాణ మార్గాల‌ను ఎంచుకోవాల‌ని రైల్వేశాఖ కోరింది. భార‌త‌దేశంలో అత్యంత మంది ప్ర‌జలు ప్ర‌యాణించే మార్గం. రైలు మార్గం. ఇది ప్ర‌యాణికుల‌కు ఎంతో వెసులుబాటును క‌ల్పిస్తుంది.

త‌క్కువ ధ‌ర‌ల‌తో సూదూర ప్రాంతాల‌కు చేరువ‌చేయ‌డంలో ముందు వ‌రుస‌లో ఉంటుంది. అందుకే ఎక్కువ మంది ఈ మార్గాన్ని ఎంపిక చేసుకుంటారు. ఇక‌, దేశంలో కూడా ఆధునాతన టెక్నాల‌జీతో కూడుకున్న రైళ్లు మ‌నకు అందుబాటులోకి వ‌చ్చాయి. అయితే, కొన్నికొన్ని సంద‌ర్భాల్లో ఇత‌ర పనుల కార‌ణంగా ప‌లు రైళ్ల‌ను ర‌ద్దు చేయ‌డం, మ‌ళ్లించ‌డం వంటివి చేస్తుంటారు. అందులో భాగంగానే ఇప్ప‌డు తాజాగా ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ఓ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. సెప్టెంబ‌ర్ 1 నుంచి అక్టోబ‌ర్ 30 వ‌ర‌కు ప‌లు రైళ్ల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు చెప్పింది.
ఆ ట్రైన్ల జాబితా ఏంటో ఓసారి చూసేద్దాం...

ట్రైన్ల వివ‌రాలు..

హైద‌రాబాద్ నుంచి వరంగల్‌, వరంగల్‌ నుంచి హైదరాబాద్‌, కాజీపేట నుంచి బల్లార్ష వెళ్లే ప‌లు రైళ్లు సెప్టెంబ‌ర్ ఒక‌టో తేది నుంచి అక్టోబర్‌ 30 వరకు రద్దు చేసిన‌ట్లు రైల్వే అధికారులు తెలిపారు. వీటితో పాటు సెప్టెంబరు 2వ తేది నుంచి అక్టోబరు ఒక‌టి వ‌ర‌కు బల్లార్ష- కాజీపేట ట్రైన్ల‌ను రద్దు చేశారు. సిర్పూర్‌ టౌన్‌- కరీంనగర్, కరీంనగర్‌- బోధన్‌ మెమూ ట్రైన్లను సెప్టెంబరు 1 నుంచి 30 వరకు రద్దు చేశారు. సెప్టెంబరు 2వ తేది నుంచి అక్టోబరు ఒక‌టో తేది వ‌ర‌కు బోధన్‌- కరీంనగర్‌ మెము ట్రైన్‌ను రద్దు చేసిన‌ట్లు అధికారులు తెలిపారు. సెప్టెంబరు ఒక‌టి నుంచి 30వ తేదివ‌ర‌కు కాచిగూడ- నడికుడి, నడికుడి- కాచిగూడ రైళ్ల‌ను రద్దు చేసినట్లు ద‌క్షిణ మ‌ధ్య‌ రైల్వే సీపీఆర్వో శ్రీధర్‌ మంగళవారం విడుద‌ల చేసిన ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.

southerncentralrailway

సెప్టెంబరు 1 నుంచి అక్టోబ‌ర్ 30 వ‌ర‌కు..

సెప్టెంబరు 1తేది నుంచి 30వ తేది వరకు హెచ్‌ఎస్‌ నాందేడ్‌- రాయచూరు ట్రైన్ రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. వీటితో పాటు తాండూరు-రాయచూరు మధ్య తిరిగే ప‌లు ట్రైన్ల‌ను కూడా పాక్షికంగా నిలిపివేస్తున‌ట్లు తెలిపారు. అలాగే, సెప్టెంబరు 1 నుంచి 30 వరకు భద్రాచలం రోడ్‌- బల్లార్ష, సిర్పూర్‌టౌన్‌- భద్రాచలం రైళ్ల‌ను కాజీపేట రైల్వేస్టేషన్‌లో స్టాపేజిని తొలగించినట్లు అధికారులు వెల్ల‌డించారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి తమ ప్రయాణాలను కొనసాగించాలని కోరారు.

నిర్వహణ పనుల అనంత‌రం ర‌ద్దు చేసిన రైళ్లు యథావిధిగా నడుస్తాయని రైల్వే అధికారులు వివ‌రించారు. ప్ర‌యాణికులు ఈ విష‌యాల‌ను గమ‌నంలో ఉంచుకుని ఇత‌ర మార్గాల‌ను ఎంపిక చేసుకోగ‌ల‌ర‌ని అధికారులు సూచించారు. ఇక నేడు ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వ‌ర్గీక‌ర‌ణ‌కు సుప్రీంకోర్టు ప‌చ్చ‌జెండా ఊపింది. ఈ త‌రుణంలో అత్యున్న‌త న్యాయ‌స్థానం నిర్ణ‌యానికి నిర‌స‌న‌గా నేడు భార‌త్‌బంద్‌కు ప‌లు సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ క్ర‌మంలో ప‌లు ప్రాంతాల్లో రైళ్ల రాక‌పోక‌ల‌కు తీవ్ర అంత‌రాయం ఏర్ప‌డే అవ‌కాశం ఉంది. కాబ‌ట్టి ఈ విష‌యాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని ప్ర‌యాణికులు ఇత‌ర మార్గాల ద్వారా ప్రయాణం ఎంపిక చేసుకోవ‌డం ఎంతో ఉత్త‌మం..

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+