Search
  • Follow NativePlanet
Share
» »ప్రయాణికులకు టీజీఎస్ఆర్‌టిసి గుడ్‌న్యూస్‌.. ప‌రుగులు పెట్ట‌నున్న సెమీ డీల‌క్స్ బ‌స్సులు..

ప్రయాణికులకు టీజీఎస్ఆర్‌టిసి గుడ్‌న్యూస్‌.. ప‌రుగులు పెట్ట‌నున్న సెమీ డీల‌క్స్ బ‌స్సులు..

తెలంగాణలోని ప్ర‌యాణికుల‌కు టీజీఎస్ఆర్‌టిసి ఓ శుభ‌వార్త‌ను అందించింది. ఇప్ప‌టికే రాష్ట్రంలో ఏర్ప‌డిన కొత్త ప్ర‌భుత్వం మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం కింద మహిళలకు, బాలికల‌కు, ట్రాన్స్‌జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న విష‌యం విదిత‌మే. ఇప్ప‌డు తాజాగా ఆర్టీసీ బస్సు ప్రయాణికులకు మ‌రో గుడ్‌న్యూస్‌ను మోసుకొచ్చింది. ఫ్రీ బ‌స్సు నేప‌థ్యంలో న‌గ‌రంలోని బ‌స్సుల్లో విప‌రీత‌మైన ర‌ద్దీ నెల‌కొంది. దీంతో చాలామంది నిల్చుని ప్ర‌యాణాలు చేయ‌డం మ‌నం చూస్తు ఉన్నాం. అయితే, త్వ‌ర‌లోనే కూర్చుని ప్ర‌యాణాలు సాగించే విధంగా తెలంగాణ ఆర్‌టిసి ఆలోచ‌న చేస్తోంది. ఇందులో భాగంగానే త్వ‌ర‌లోనే ఆర్‌టీసీ అధికారులు సెమీ డీలక్స్ బస్సులను అందుబాటులోకి తీసుకరానున్నారు.

బ‌స్సుల్లో పెరిగిన ర‌ద్దీ...

రాష్ట్రంలో కొత్త‌గా ఏర్ప‌డిన ప్రభుత్వం మహాలక్ష్మీ పథకం కింద మహిళల‌కు ఫ్రీ బ‌స్సు జ‌ర్నీ ప్ర‌క‌టించింది. ఈ ప‌థ‌కం ద్వారా మ‌హిళ‌లు, బాలిక‌లు, ట్రాన్స్‌జెండ‌ర్ తెలంగాణ రాష్ట్రంలోని ఏ మూల నుంచి ఏ మూలకైనా ఫ్రీ ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. ఈ ఉచిత ప్ర‌యాణం కేవ‌లం పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మాత్ర‌మే చేయాల్సి ఉంటుంది. దీంతో ఈ ఆర్‌టిసి బస్సుల్లో విప‌రీత‌మైన ర‌ద్దీ నెల‌కొంది. గతంలో న‌గ‌రంలోని ఆర్‌టిసి బ‌స్సుల్లో రోజుకూ సగటున 30-35 లక్షల మంది ప్ర‌యాణిస్తుంటే..

ఇప్ప‌డు ఆ సంఖ్య కాస్త 55 లక్షలకు చేరింది. ఈ ర‌ద్దీతో టిక్కెట్లు తీసుకుని ప్ర‌యాణించేవారు తీవ్ర ఇబ్బందుల‌కు గురవుతున్నారు. అంతేకాదు. వారు కూర్చుని ప్ర‌యాణం చేసేందుకు కూడా సీట్లు ఉండ‌డం లేదు. ఈ ప‌థ‌కంతో సంస్థకు వచ్చే ఆదాయంపై కూడా తీవ్ర ప్రభావం పడనుంది. మహాలక్ష్మి ఉచిత ప్రయాణ టికెట్ల మొత్తాన్ని తెలంగాణ‌లోని కొత్త ప్రభుత్వం చెల్లిస్తున్నప్పటికీ సకాలంలో అందటం లేదనే విమర్శలు వ‌స్తున్నాయి. ఇదిలా ఉంటే.. డబ్బులు చెల్లించి మరీ టికెట్లు తీసుకునే ప్రయాణికుల సంఖ్య చాలా మేర‌కు తగ్గింద‌నే చెప్పుకోవాలి.

TGSRTC good news for passengers semi-deluxe buses to run1

50 సెమీ డీలక్స్‌ బస్సులు..

ఈ క్ర‌మంలోనే టీజీఎస్ఆర్‌టిసి కీలక నిర్ణయం తీసుకుంది. బ‌స్సుల్లో నెలకొన్న ర‌ద్దీని త‌గ్గుముఖం ప‌ట్టించే దిశ‌గా కొత్త రకం బస్సులను ప్రవేశపెట్టాలని ఆర్టీసీ భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే మొద‌టి దశలో రాష్ట్రవ్యాప్తంగా 50 సెమీ డీలక్స్‌ బస్సులను ప్రారంభించనున్నట్లు స‌మాచారం. ఈ సెమీ డీల‌క్స్ బ‌స్సుల‌నేవి ఎక్స్‌ప్రెస్, డీలక్స్‌ బస్సులకు మధ్యరకంగా ఉంటాయి. త్వ‌ర‌లోనే ఈ కొత్త సెమీ డీలక్స్ బస్సు సర్వీసులు ప‌రుగులు పెట్ట‌బోతున్న‌ట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.

అయితే, ఈ సెమీ డీల‌క్స్ బ‌స్సుల్లో సీట్లు, ఇతర సౌకర్యాలు ఎలా ఉంటాయన్న‌ విషయంపై అధికారులు త్వరలోనే స్పష్టత ఇవ్వ‌నున్నారు. డీలక్స్‌ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య‌ను పెంచ‌డం కోసం ఇప్ప‌టికే రాష్ట్రంలో అనేక చ‌ర్య‌లు ప్ర‌వేశ‌పెట్టారు. ఇక‌, కొన్ని డిపోల్లో అయితే గిప్ట్‌ ఇచ్చే పథకాలను కూడా ఆర్టీసీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. మహాలక్ష్మి ఉచిత బ‌స్సు ప్ర‌యాణం ప‌థ‌కంతో పడుతున్న ప్రతికూల ప్రభావాన్ని అధిగమించేందుకు ఆర్‌టిసి ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

కనీస ఛార్జీ 30 రూపాయ‌లు ...

ఇక‌, ఈ బస్సుల్లో ప్రయాణించే వారంతా ఖ‌చ్చితంగా టిక్కెట్ తీసుకోవాలి. పల్లె వెలుగు ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో మాదిరిగా ఫ్రీ బ‌స్స్ జ‌ర్ని ఉండ‌దు. మ‌హిళ‌లు, బాలిక‌లు, ట్రాన్స‌జెండ‌ర్స్ కూడా ఈ బ‌స్సుల్లో టికెట్ తీసుకునే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ బస్సు కనీస ఛార్జీ 30 రూపాయ‌లు ఉండ‌నున్న‌ట్లు తెలుస్తోంది. వీటితోపాటు బ‌స్సులో ప్ర‌యాణించేవారు టోల్‌ ఫీజు, ప్యాసింజర్‌ సెస్, సేఫ్టీ సెస్‌ వంటివి కూడా అదనంగా క‌ట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం బస్సుల్లో అస్స‌లు ఖాళీ ఉండట్లేదు. ఈ బస్సులు అందుబాటులోకి వస్తే మాత్రం అంద‌రూ టికెట్ తీసుకునే హ్యాపీగా కూర్చొని మ‌రీ ప్ర‌యాణించొచ్చు.

More News

    Read more about: tgsrtc semi deluxe buses news
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+