భారత్‌లో అత్యధిక ప్రజలు రైలు మార్గాలనే ద్వారానే ప్రయాణం సాగిస్తుంటారు. అందుకు కారణం లేకపోలేదు. రైలు మార్గాలు ఎంతో సౌకర్యవంతంగా, అతితక్కువ ఖర్చుతో కూడుకున్నవి. అందుకే ఎక్కువమంది ప్రజలు వీటిపై ఆసక్తి చూపుతుంటారు. ఇక ఇటీవలే దేశంలోనే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ వంటి ఆధునాతన టెక్నాలజీతో కూడిన రైళ్లు కూడా అందుబాటులోకి వచ్చాయి.
అయితే, ఇప్పడు దేశంలోని తొలి ప్రయివేట్ రైలు సర్వీసు ప్రారంభం కానుంది. ఆ ట్రైన్ వచ్చే నెల 4 నుంచి ప్రారంభం కానుంది. ఇది దేశంలోనే తొలి ప్రైవేట్ రైలు సర్వీస్. ఈ ట్రైన్‌ణ కేరళలోని తిరువనంతపురం నుంచి గోవాకు రాకపోకలు సాగించనుంది. ఈ ఇక, ఈ ప్రైవేటు రైలు సర్వీసును 'ఎస్‌ఆర్ఎంపీఆర్' గ్లోబల్ రైల్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్వహించనుంది.

తొలి విడత తిరువనంతపురం నుంచి గోవాకు..
దేశంలోనే తొలి ప్రైవేట్ రైలు సర్వీస్ తొలి విడతలో భాగంగా తిరువనంతపురం నుంచి గోవాకు వెళ్లే ప్రయాణికులకు అందుబాటుల ఉంటుంది. ఇక, ఈ ప్రయివేట్ రైలు సర్వీసు ప్రధాన లక్ష్యం పర్యాటకులు. ఈ ట్రైన్ ప్రిన్సి వరల్డ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్త, భారత్ గౌరవ్ యాత్ర ప్రాజెక్టులో భాగంగా భారతీయ రైల్వే సహకారంతో ఎస్‌ఆర్ఎంపీఆర్( SRMPR) గ్లోబల్ రైల్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ దీనిని పట్టాలపైకి తీసుకురానుంది.
తొలి విడతగా ఈ రైలు తిరువనంతపురం నుంచి గోవా వరకు రాకపోకలు సాగిస్తుండగా, ఈ రూట్‌లో త్రివేండ్రం, కొల్లం, కొట్టాయం, ఎర్నాకులం, త్రిస్సూర్, కోజికోడ్, కన్నూర్, కాసర్‌గోడ్ సహా పలు స్టేషన్‌లలో రైలు హాల్టింగ్స్ పర్యాటకులకు అందుబాటులో ఉంటాయి. రెండవ విడుతగా ముంబై, అయోధ్య రూట్‌లోనూ ఈ ప్రైవేటు ట్రైన్‌ను నడపాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రయివేట్ ట్రైన్‌లోని సౌకర్యాలను ఎస్‌ఆర్ఎంపీఆర్ నిర్వహిస్తుండగా, ఆ ట్రైనుకు సంబంధించిన టికెటింగ్, మార్కెటింగ్ బాధ్యతలను ప్రిన్సి ట్రావెల్స్ పర్యవేక్షిస్తోందని ప్రిన్సి వరల్డ్ ట్రావెల్స్ డైరెక్టర్ దేవికా మీనన్ తెలిపారు.
అరవై మంది సిబ్బంది..
ఈ ప్రయివేట్ ట్రైన్ ఆధునాతన సౌకర్యాలకు కూడా అందుబాటులో ఉండనున్నాయి. స్టార్ హోటల్ వసతి, భోజన సదుపాయాలను కూడా ఇందులో అందిస్తున్నారు. వీటితో పాటు ప్రముఖ పర్యాటక ప్రాంతాల సందర్శనకు అవకాశం కల్పించే టూర్ ప్యాకేజీలను ఈ ప్రయివేట్ ట్రైన్ ప్రయాణికులకు అందిస్తోంది. ఈ ప్రైవేటు ట్రైన్‌లో ఏకకాలంలో 750 మంది ప్రయాణం చేసే విధంగా దీనిని రూపొందించారు.
ఇందులో 2 స్లీపర్ క్లాస్ కోచ్‌లు, 11 థర్డ్ క్లాస్ ఏసీ కోచ్‌లు, 2 సెకండ్ క్లాస్ ఏసీ కోచ్‌లు ఉన్నాయి. ఈ ట్రైన్ అరవై మంది సిబ్బంది అందుబాటులో ఉంటారు. ఇంకా వైద్య నిపుణులు ప్రయాణికుల సేవలో ఉంటారు. ఈ రైలులో భోజన వసతి, వైఫై కనెక్టివిటీ, జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ అన్నీ అందుబాటులో ఉంటాయి.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను కవర్ చేస్తూ టూర్ ప్యాకేజీ..
ఈ ట్రైన్‌లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను కవర్ చేస్తూ టూర్ ప్యాకేజీ కూడా అందుబాటులో ఉంది. అయోధ్య, వారణాసి, ప్రయాగ్‌రాజ్‌లోని పుణ్యక్షేత్రాలను కవర్ చేస్తూ ఎనిమిది రోజుల పాటు సాగే టూర్ ప్యాకేజీ ఉంది. వీటి ధరల విషయానికి వస్తే.. స్లీపర్ నాన్ ఏసీ రూ.30,550 చెల్లించాలి. త్రీ టైర్ ఏసీ అయితే రూ.33,850గా ఉంటుంది. టూ టైర్ ఏసీ అయితే, రూ.37,150గా నిర్ణయించారు. ఇక ఐదేళ్లలోపు పిల్లలు ఈ ట్రైన్‌లో ఫ్రీగా జర్నీ చేయొచ్చు. 5 నుంచి 10 ఏళ్లలోపు పిల్లలకు సగం ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది.
ఇక, ఈ ట్రైన్ నాన్-ఏసీ స్లీపర్ బోగీలో గోవాకు 4 రోజుల పర్యటన ప్యాకేజీ కూడా అందుబాటులో ఉంది. వీటి ఛార్జీలు రూ.13,999 చెల్లించాలి. త్రీ టైర్ ఏసీ కోచ్‌లో సీటు బుక్ చేసుకునేందుకు రూ.15,150గా నిర్ణయించారు. టూ టైర్ ఏసీ కోచ్‌లో సీటు బుక్ చేసుకునేందుకు రూ.16,400 చెల్లించాల్సి ఉంటుంది. ఈ మూడు రకాల కోచ్‌లకు సంబంధించిన టికెట్ల రేట్లు - ముంబయి రూట్‌లో అయితే.. నాన్ ఏసీ స్లీపర్ రూ.15,050, త్రీ టైర్ ఏసీరూ.16,92 , టూ టైర్ ఏసీ రూ. 18,825 చెల్లించాల్సి ఉంటుంది.



Click it and Unblock the Notifications













