దక్షిణ భారతదేశంలో ఈ ఆహారపు రుచులను ఆస్వాదించాల్సిందే!
దక్షిణ భారతదేశం శాఖాహారుల స్వర్గధామం. మాంసాహారంలోనూ వెరైటీ రుచులకు కొదవలేదు. దక్షిణాది రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక , తెలంగాణ, కేరళ మరియు తమిళనాడు ప్రాంతాలకు సందర్శనకు వెళ్లే పర్యాటకులకు ఇక్కడి వైవిధ్యభరితమైన ఆహార రుచులు ఆహ్వానం పలుకుతాయి. బియ్యం, పప్పు, మిరపకాయలు మరియు కొబ్బరి ఇక్కడి వంటకాలతో ప్రధానమైన దినుసులుగా వినియోగిస్తారు.
తినేముందు.. సాంబార్ పొడి మరియు ఎండిన కరివేపాకు, చింతపండు తరచుగా కనిపిస్తాయి. అంతేకాదు, వాస్తవానికి ఇక్కడ కాఫీ లేకుండా భోజనం పూర్తి కాదంటే ఆశ్చర్యం కలగకమానదు.

హైదరాబాదీ బిర్యానీ
దక్షిణ భారతదేశంలో బహుశా బిర్యానీ గురించి తెలియనివారు ఉండకపోవచ్చు. అదీ హైదరాబాదీ బిర్యానీ అంటే నోరూరాల్సిందే. ఇది సాధారణంగా బాస్మతి బియ్యం, కూరగాయలు, మాంసం, ఉల్లిపాయలు, సుగంధ ద్రవ్యాలు, నిమ్మ మరియు కుంకుమపువ్వుతో తయారు చేస్తారు. మరో కర్రీ ప్రమేయం లేకుండా లొట్టలేసుకుంటూ తినేందుకు బిర్యానీ అనువుగా ఉంటుంది.

దొశలు
దోశలలో అనేక రకాలు ఉన్నాయి. బీన్, బియ్యం మరియు మినప, పెసర పప్పులను దీని తయారీకి తరచుగా వినియోగిస్తారు. పులియబెట్టిన పిండి నుండి తయారు చేసే దోశల రుచిని గురించి మాటల్లో చెప్పడం కాస్త కష్టమే. దోసెలు సన్నగా మరియు క్రిస్పీగా ఉంటాయి. వేడిగా సాంబార్‌తో పాటుగా వడ్డించబడతాయి. ఈ తేలికపాటి ఆహారం మసాలా సూప్ మరియు కొబ్బరి, టొమాటో, పుదీనా వంటి మరిన్ని పదార్థాలతో తయారు చేసిన చట్నీలు, మసాలాలతో నోరూరిస్తుంది. మసాలా, బంగాళాదుంపలు మరియు వేయించిన ఉల్లిపాయల మిశ్రమంతో మసాలా దోశలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. దక్షిణాదిలో పెద్ద పెద్ద హోటళ్లతోపాటు రోడ్డు ప్రక్కల మిని హోటళ్లలోనూ ఈ దోశలు అందుబాటులో ఉంటాయి.

ఉతప్పం
ఉతప్పం దోసెల బంధువుగా చెప్పొచ్చు. ఎందుకంటే రెండింటినీ కూడా ఒకే రకమైన పిండితో తయారు చేయవచ్చు. కానీ దోసె కంటే ఉతప్పం మందంగా ఉంటుంది. ఇది రుచికరమైన పాన్‌కేక్ లాగా నోరూరిస్తుంది. ఉల్లిపాయలు, టమోటాలు, కొత్తిమీరను ఉతప్పం తయారీకి విరివిగా వినియోగిస్తారు. అల్పాహారన్ని లంచ్‌గా మార్చుకోవాలనుకునేవారికి ఉతప్పం మంచి ఎంపిక.

ఇడ్లీ
దక్షిణ భారతదేశంలో ఇడ్లీ అంటే సంప్రదాయ అల్పాహారం. ఇడ్లీలు పులియబెట్టిన మినపపప్పు మరియు బియ్యంతో ఉడికించిన పిండితో చేసిన రుచికరమైన బియ్యం కేకులుగా చెప్పొచ్చు. ఇవి పూర్తిగా నీటి ఆవిరి మరియు ప్రత్యేక వంట పాత్రలతో తయారు చేయబడతాయి. ఇడ్లీలు గుండ్రని ఆకారాన్ని కలిగి ఉంటాయి. సాంబార్, చట్నీలు లేదా సాధారణంగా నూనెతో కలిపిన మసాలా పొడితో వీటిని వడ్డిస్తారు.

వడ
వడను ఒక రకమైన రుచికరమైన డోనట్‌గా భావించవచ్చు. దక్షిణ భారతదేశం అనేక రకాలైన వడలకు నిలయం. కొన్ని రుచిగా మరియు తీపిగా ఉంటాయి. వడను సాధారణంగా నీటిలో నానబెట్టిన పప్పును ముద్దగా చేసి, ఆ పిండిలో జీలకర్ర, ఉల్లిపాయ, కరివేపాకు లేదా మిరపకాయలను వేసి నూనెలో వేయిస్తారు. ఇది డోనట్ ఆకారంలో ఉంటుంది. వడలు వెలుపల పెళుసైనదిగా మరియు లోపల మెత్తగా ఉంటుంది. వడను కొన్నిసార్లు సాంబార్ లేదా పెరుగు సాస్‌లో ముంచి వడ్డిస్తారు.

ఉప్మా
ఉప్మా ఒక ప్రసిద్ధ అల్పాహారం. ఇది పొడి గోదుమ రవ్వ లేదా ముతక బియ్యం పిండితో చేసే ఒక రకమైన మందపాటి గంజి. కూరగాయలు మరియు సుగంధ ద్రవ్యాలు కూడా దీనిలో జోడిస్తారు. తమిళనాడులో రాత్రి భోజనంలో కూడా ఉప్మాను వడ్డిస్తారు. తక్కువ సమయంలో సులభంగా తయారు చేయబడే అల్పాహారంగా ఉప్మా పేరుగాంచింది.



Click it and Unblock the Notifications













