Search
  • Follow NativePlanet
Share
» »ప్ర‌పంచ‌స్థాయి విద్య‌నందించే పాఠ‌శాల‌లు ఇండియాలో కూడా ఉన్నాయి....

ప్ర‌పంచ‌స్థాయి విద్య‌నందించే పాఠ‌శాల‌లు ఇండియాలో కూడా ఉన్నాయి....

భారతదేశంలో అందమైన పాఠశాలలు కూడా ఉన్నాయి. అవి వాటిని అందానికి ప్ర‌సిద్ధి చెంద‌డమే కాకుండా విద్య పరంగా అనేక దేశాల కంటే ముందు నిలిచాయి. పిల్లలకు ప్రపంచ స్థాయి విద్యనందించే అనేక పాఠశాలలు ఇండియాలో కూడా ఉన్నాయి. విద్యతో పాటు, ఈ ఉన్నత పాఠశాలలు ఇతర కార్యకలాపాలపై కూడా ఎక్కువ‌గా దృష్టి సారిస్తాయి. చదువు పరంగానే కాకుండా అందం పరంగా కూడా నెంబర్ వ‌న్‌గా నిలిచిన అలాంటి కొన్ని స్కూల్స్ గురించి తెలుసుకుందాం.

scindiaschool

సింధియా స్కూల్, గ్వాలియర్

నగర జనసమూహం నుండి దూరంగా ఓ కొండపై నిర్మించిన సింధియా స్కూల్, అబ్బాయిల కోసం ఉత్తమ బోర్డింగ్ పాఠశాలల్లో ఒకటిగా నిలిచింది. సింధియా స్కూల్‌ గ్వాలియర్‌లోని చారిత్రక కోటలో ఉంది. ఈ స్కూల్ 100 ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఈ పాఠశాలలో విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ఈ పాఠశాలలో పిల్లలకు కేవలం పుస్తక జ్ఞానాన్ని అందించడమే కాకుండా చదువుతో పాటు అనేక విషయాల్లో వారిని నిష్ణాతులుగా తీర్చిదిద్దే పని కూడా చేస్తారు. ఈ పాఠశాలలో క్రికెట్, లాన్ టెన్నిస్, స్విమ్మింగ్ పూల్, గుర్రపు స్వారీ, బాక్సింగ్ వంటి అన్ని రకాల ఇండోర్, అవుట్‌డోర్ గేమ్‌లు ఉన్నాయి. ఈ స్కూల్‌లో ఓపెన్ థియేటర్ కూడా ఉంది.

ఈ పాఠశాలను 1897లో దివంగత మహారాజా మాధవరావు జయజీరావు సింధియా స్థాపించారు. గ‌తంలో ఈ పాఠశాల పేరు సర్దార్ స్కూల్ అని ఉండేది. 1908లో ఈ పాఠశాల పేరు సింధియా స్కూల్‌గా మార్చబడింది. నటులు సల్మాన్ ఖాన్, అర్బాజ్ ఖాన్, నితిన్ ముఖేష్, గాయకుడు మీట్ బ్రదర్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ, సునీల్ భారతి మిట్టల్, దర్శకుడు అనురాగ్ కశ్యప్, సూరజ్ బర్జాత్యా ఈ స్కూల్ విద్యార్థులే కావ‌డం విశేషం..

kasigaschool

కాసిగా స్కూల్, డెహ్రాడూన్

భారతదేశంలోని ఉత్తమ CBSE బోర్డింగ్ పాఠశాలల్లో డెహ్ర‌డూన్‌లోని కాసిగా స్కూల్ ఒకటి. ఇది అంతర్జాతీయ బోర్డింగ్ పాఠశాలగా ప్ర‌సిద్ధికెక్కింది. ఇక్కడ విద్యావ్యవస్థ ఎంతో బాగుంటుంది. CBSEతో పాటు, యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ ఎగ్జామినేషన్ బోర్డ్ ఆధారంగా ఇక్క‌డ విద్య ఇవ్వబడుతుంది.

mussoorieinternationalschool

ముస్సోరీ ఇంటర్నేషనల్ స్కూల్

ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీలో నిర్మించిన ఈ బోర్డింగ్ పాఠశాల దేశంలోని అత్యుత్తమ బోర్డింగ్ పాఠశాలల్లో ఒకటిగా నిలిచింది. ఈ పాఠశాలను 1984లో స్థాపించారు. చదువుతో పాటు ఈ పాఠశాల స్థానం కూడా చాలా ప్రత్యేకం. ఇక్కడ ఫ‌స్ట్‌క్లాస్ నుండి ఇంట‌ర్ వ‌ర‌కూ ఉంటుంది. ఈ పాఠ‌శాల కేవ‌లం బాలిక‌ల‌కు మాత్ర‌మే. బాలికల కోసం నిర్మించిన ఈ క్యాంపస్‌లో లైబ్రరీ, ప్లే గ్రౌండ్, డైనింగ్ హాల్, ల్యాబ్, మెడికల్ సెంటర్ వంటి అన్ని రకాల సౌకర్యాలు కూడా ఉన్నాయి.

గుడ్ షెపర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్, ఊటీ

ఊటీలోని నీలగిరి కొండల మధ్య ఏర్పాటైన అందమైన స్కూల్‌ గుడ్ షెపర్డ్ ఇంటర్నేషనల్. ఈ పాఠశాల‌ను 70 ఎకరాల్లో నిర్మించారు. ఈ పాఠశాలను 1997లో స్థాపించడం జ‌రిగింది. ఈ పాఠశాల విద్య పరంగా మాత్రమే కాకుండా ఇత‌ర అనేక కార్య‌కలాపాల‌కు కూడా ప్ర‌సిద్ధిచెందింది. ఇందులో ప్రత్యేక లైబ్రరీ, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు ఉన్నాయి. షూటింగ్, టెన్నిస్, హాకీ, క్రికెట్ వంటివెన్నో ఉన్నాయి. ఈ పాఠశాల ప్రాంగ‌ణం కూడా చూసేందుకు ఎంతో ఆక‌ర్ష‌ణ‌గా ఉంటుంది.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+