Search
  • Follow NativePlanet
Share
» »మే నెల‌లో దేశంలోని అత్య‌ధిక ఉష్ణోగ్ర‌త‌లు క‌లిగిన ప్ర‌దేశాలు ఇవే..!

మే నెల‌లో దేశంలోని అత్య‌ధిక ఉష్ణోగ్ర‌త‌లు క‌లిగిన ప్ర‌దేశాలు ఇవే..!

దేశంలో ఓ ప‌క్క ఎన్నిక‌ల వేడి కొన‌సాగుతుంటే, మ‌రోప‌క్క అత్య‌ధిక ఉష్ణోగ్ర‌త‌ల‌తో ప్ర‌జలు అల్లాడిపోతున్నారు. ఇక‌, ఈ వేస‌వి సెల‌వుల్లో చాలామంది విహార‌యాత్ర‌ల‌కు ప్లాన్ చేస్తుంటారు. కానీ, స‌మీపంలోని ప్ర‌దేశాలు క‌దా? అని చాలామంది ఎండ‌లు అత్య‌ధికంగా ఉండే ప్ర‌దేశాల‌ను సంద‌ర్శించేందుకు ప్లాన్ చేస్తుంటారు. కాబ‌ట్టి ముందుగా దేశంలో అత్య‌ధిక ఉష్ణోగ్ర‌త‌లు క‌లిగిన ప్ర‌దేశాల గురించి తెలుసుకోండి. ఆ త‌ర్వాత మీ ప్ర‌యాణాన్ని మొద‌లుపెట్టండి. ఇండియాలో మే నెల‌లో అత్య‌ధిక ఎండ‌లు క‌లిగిన ప్ర‌దేశాలివే..

విజ‌య‌వాడ, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌..

ఈ వెకేష‌న్‌లో సంద‌ర్శించేందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని విజ‌య‌వాడ‌లో చాలాప్ర‌దేశాలు ఉన్నాయి. కానీ, ఈ సీజ‌న్‌లో ఇక్క‌డ ఎండ‌లు విప‌రీతంగా ఉంటాయి. ముఖ్యంగా మే నెల‌లో అయితే, ఇక్క‌డ ప్ర‌తిరోజూ 45 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌ని అధికారులు భావిస్తున్నారు. విజ‌య‌వాడ క‌నక‌దుర్గ‌మ్మ దేవాల‌యం, ఉండ‌వ‌ల్లి గుహ‌లు, ప్ర‌కాశం బ్యారేజీ వంటి సంద‌ర్శ‌నీయ ప్ర‌దేశాలు చాలానే ఉన్నాయి. వీటిని చూసేందుకు ఈ సెల‌వుల్లో చాలామంది ప్ర‌ణాళిక‌లు వేస్తుంటారు. కానీ, ఈ ఎండ‌లు త‌గ్గాక ఇక్క‌డికి టూర్ ప్లాన్ చేసుకోవ‌డం ఉత్త‌మం. లేదంటే ఈ వేడిగాలుల బారిన ప‌డ‌క త‌ప్ప‌దు.

heatwave vijayawada

రెంటచింత‌ల‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌

దేశంలో అత్య‌ధిక ఉష్ణోగ‌త్ర‌లు క‌లిగిన ప్ర‌దేశంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని రెంట‌చింత‌ల ప్ర‌దేశం ఒక‌టి. ఇక్క‌డ మే నెల‌లో విప‌రీత‌మైన ఎండ‌లతో ప్ర‌జ‌లు అల్లాడిపోతుంటారు. ఇక్క‌డ మేలో 45 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త న‌మోద‌వుతుంది. కాబ‌ట్టి విహ‌ర‌యాత్ర‌ల‌కు వెళ్లాల‌నుకునేవారు ఈ సీజ‌న్‌లో ఈ ప్ర‌దేశాన్ని సంద‌ర్శించ‌క‌పోవడ‌మే ఉత్తమం..

వార్థా, మ‌హారాష్ట్ర‌..

ఇండియాలోని అత్య‌ధిక ఎండ‌లు ఉండే ప్రాంతాల్లో మ‌హారాష్ట్ర‌లోని వార్ధా ఒక‌టి. ఇక్క‌డ మే నెల‌లో అధిక ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌వుతాయి. ఇక్క‌డ ఈ సీజ‌న్‌లో ప్ర‌తి రోజూ 40 డిగ్రీల సెల్సియ‌స్ కంటే ఎక్కువ ఉష్ణోగ్ర‌త‌లే న‌మోదు అవుతాయి.

టిట్లాఘ‌ర్, ఒడిసా..

దేశంలోని అత్య‌ధిక ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌య్యే ప్ర‌దేశాల‌లో ఒడిసాలోని టిట్లాఘ‌ర్ ఒక‌టి. ఇది మే నెల‌లో అత్య‌ధిక ఎండ‌, వేడిగాలుల‌తో ప్ర‌జ‌లు ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు. ఇక్క‌డ ఈ సీజ‌న్ లో ప్ర‌తి రోజూ 45 డిగ్రీల సెల్సియ‌స్ కంటే ఎక్కువ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌వుతాయి.

heatwave2

ఆగ్రా, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌..

దేశంలోని ఏడు వింత‌ల్లో ఒక‌టైన తాజ్‌మ‌హాల్‌ను చూడాలని ప్ర‌తి ఒక్క‌రూ అనుకుంటారు. ఇది ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఆగ్రాలో ఉంది. ఇక‌, ఈ సెల‌వుల్లో అక్క‌డికి వెళ్లాల‌ని ప్లాన్ చేసేవాళ్లు చాలామందే ఉంటారు. కానీ, వారంద‌రికీ ఓ హెచ్చ‌రిక‌. ఎందుకంటే ఇక్క‌డ ఈ సీజ‌న్‌లో అత్య‌ధిక ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌వుతాయి. కాబ‌ట్టి తాజ్‌మ‌హాల్‌ను ఇత‌ర సీజ‌న్‌ల‌లో సంద‌ర్శించొచ్చు. కానీ, వేస‌విలో మాత్రం మీ ప్లాన్‌ను విర‌మించుకోండి. మే మాసంలో ఇక్క‌డ అత్యధిక ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌వుతాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు. ఈ సీజ‌న్‌లో ఇక్కడ ప్ర‌తిరోజూ 45 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త కంటే ఎక్కువ‌గా న‌మోద‌వుతుంద‌ని చెబుతున్నారు.

నాగ్‌పూర్, మ‌హారాష్ట్ర‌

ఇండియాలో అత్య‌ధిక ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌య్యే ప్ర‌దేశాల‌లో మ‌హారాష్ట్ర‌లోని నాగ్‌పూర్ ఒక‌టి. ఇక్క‌డ ప‌ర్యాట‌కులు సంద‌ర్శించేందుకు చాలా ప్ర‌దేశాలే ఉన్నాయి. కానీ, ఈ సీజ‌న్‌లో ఈ ప్ర‌దేశాన్ని సంద‌ర్శించ‌క‌పోవ‌డ‌మే ఉత్త‌మం అని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు అంటున్నారు. ఎందుకంటే, మే నెల‌లో ఇక్క‌డ అత్య‌ధిక ఎండ‌లు న‌మోదవుతాయి. ఇక్క‌డ దాదాపు ప్ర‌తిరోజూ ఈ సీజ‌న్‌లో 45 డిగ్రీల సెల్సియ‌స్‌గా న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌ని అధికారులు అంటు్న్నారు. నాగ్‌పూర్‌ను ఆరెంజ్ ఆఫ్ సిటి ఇండియా గా కూడా పిలుస్తారు. ఇక ఇక్క‌డ ప్ర‌సిద్ధిచెందిన ప్ర‌దేశాల‌లో దీక్ష‌భూమి స్తూపం, సీతాబుల్ది మార్కెట్ వంటివి చాలానే ఉన్నాయి.

గంగాన‌గ‌ర్, రాజ‌స్థాన్‌...

దేశంలోని అత్య‌ధిక ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌య్యే రాష్ట్రంలో రాజ‌స్థాన్ కూడా ఉంది. ఈ ఏడారి ప్రాంతంలో విప‌రీత‌మైన ఎండ‌లు ఉంటాయి. ఇక‌, రాజ‌స్థాన్‌లోని గంగాన‌గ‌ర్‌లో మాత్రం ఈ సీజ‌న్‌లో అత్య‌ధిక ఎండ‌లు, వేడిగాలులతో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతుంటారు. మే నెల‌లో అయితే, ఇక్క‌డ దాదాపు ప్ర‌తిరోజూ 40 డిగ్రీల సెల్సియ‌స్ కంటే ఎక్కువ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదవుతాయ‌ని అధికారులు చెబుతున్నారు. కాబ‌ట్టి ప‌ర్యాట‌కులు ఈ సెల‌వుల్లో ఈ ప్రాంతాన్ని సంద‌ర్శించ‌క‌పోవ‌డం ఎంతో ఉత్త‌మం.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+