Search
  • Follow NativePlanet
Share
» »వేస‌వి విహారంలో ఆరోగ్యానికి మేలు చేసే పానీయాలివే!

వేస‌వి విహారంలో ఆరోగ్యానికి మేలు చేసే పానీయాలివే!

విహారం కొంద‌రికి హాబీ అయితే.. మరికొంద‌రికి అదే జీవితం. ప్ర‌శాంత‌త కోసం కొంద‌రైతే.. కొత్త ప్ర‌దేశాల‌ను ఆన్వేషించ‌డం కోసం మ‌రికొంద‌రు. ఇలా సీజ‌న్‌తో సంబంధం లేకుండా త‌మ ప్ర‌యాణాల‌ను కొన‌సాగిస్తూ ఉంటారు చాలామంది ప‌ర్యాట‌క ఔత్సాహికులు. అయితే, ఈ సీజ‌న్‌లో మాత్రం ఎంత‌టివారైనా స‌రైన జాగ్ర‌త్త‌లు పాటించ‌క‌పోతే ప్ర‌మాదమ‌ని వైద్యులు హెచ్చ‌రిస్తున్నారు.

ఇప్ప‌టికే అన్నిచోట్లా ఎండలు మండిపోతున్నాయి. చాలా సంద‌ర్శ‌నీయ ప్ర‌దేశాల‌లోనూ పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు మించిపోతున్నాయి. అలాగే, రానున్న‌ ఏప్రిల్, మే నెలల్లో ఎండల తీవ్ర‌త మరింతగా పెర‌గ‌బోతోంద‌ని ఇప్ప‌టికే వాతావరణ శాఖ హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. ఎండ‌ల‌తోపాటు వడగాలులు రానున్నాయ‌ని, వీటి వల్ల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే ప్ర‌మాదం ఉంద‌ని చెబుతున్నారు. ఇలాంటి స‌మ‌యంలోనూ త‌మ ప‌ర్య‌ట‌న‌ల‌ను కొన‌సాగించాల‌నుకునేవారు తీసుకోవాల్సిన పానీయాల జాబితాతోపాటు వీటి వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల‌ను మీకోసం అందిస్తున్నాం.

coconut1

కోకోన‌ట్ వాట‌ర్ (కొబ్బరి నీరు)

ప‌ర్యాట‌క ప్ర‌దేశం ఏదైనా.. సీజ‌న్‌తో సంబంధం లేకుండా అందుబాటులో ఉండే ఆరోగ్య‌క‌రమైన పానీయం కొబ్బరి నీళ్లు. దీని ప్ర‌యోజ‌నాల‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. శరీరాన్ని ఉత్సాహ‌ప‌రుస్తూ శక్తివంతం చేయడంతోపాటు డీ హైడ్రేట్ త‌గ్గించ‌డానికి కొబ్బరి నీళ్లు ఎంత‌గానో ఉపయోగపడతాయి. విహార‌ స‌మ‌యంలో వేసవిని ఎదుర్కోవడానికి కొబ్బరి నీరు అద్భుతంగా పనిచేస్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఇందులో పుష్క‌లంగా ల‌భించే ఎలక్ట్రోలైట్స్, విటమిన్స్, మినరల్స్ నీరసం, బలహీనత త‌గ్గించి నూత‌న ఉత్తేజాన్ని చేరువ చేస్తాయి.

వాట‌ర్ మిలాన్ (పుచ్చకాయ)

ఈ సీజ‌న్‌లో పుచ్చకాయ ఒక అద్భుతమైన నేస్త‌మ‌నే చెప్పాలి. ఎండలో బయటకు వెళ్లినప్పుడు పుచ్చకాయ ముక్కలను తిని దాహం తీర్చుకోవడం స‌ర్వ‌సాధార‌ణం. ఎర్ర‌గా నోరూరే ఈ పుచ్చకాయ తింటే.. ఎండవేడి తగ్గి రీఫ్రెష్‌ అవ్వడంతోపాటు.. ఆనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. పుచ్చకాయలో పోషకాలతోపాటు 95 శాతం నీరు ఉంటుంది. క్యాలరీలు తక్కువగా, ఫైబర్‌ పుష్కలంగా ఉంటాయి. ఈ పండు ద్వారా విటమిన్‌-ఎ, బి1, బి6, సి, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్‌, బయోటిన్‌ వంటి పోషకాలు సమృద్ధిగా అందుతాయి. పుచ్చకాయలో పొటాషియం మెండుగా ఉండ‌డం వ‌ల్ల‌ యూరిన్‌ ఎక్కువ వచ్చేలా చేస్తుంది. దీంతో హైపర్‌టెన్షన్‌ కంట్రోల్‌లో ఉంటుందని గుర్తుంచుకోవాలి. మూత్రం సరిగా రానపుడు, మూత్రం మంటగా అనిపించినపుడు పుచ్చకాయ తింటే ఎంతో రిలీఫ్‌ను ఇస్తుంది.

buttermilk1

మజ్జిగ

మజ్జిగ ఆరోగ్యానికి అద్భుత ఔషధంగా పనిచేస్తుందని మ‌నంద‌రికీ తెలుసు. మ‌రీ ముఖ్యంగా ఈ వేసవిలో విహారం చేసేవారి శరీరానికి మ‌జ్జిగ చాలా అవ‌స‌రం. మజ్జిగ తీసుకుంటే, శరీరం చల్లబడుతుంది. జీవక్రియ వేగవంతం అవుతుంది. ఈ అద్భుత పానీయం ప్రోబయోటిక్ గుణాలతో నిండి ఉండ‌డం వ‌ల్ల‌ పెరిగుతున్న ఉష్ణోగ్రతల నుంచి మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఎందుకంటే ఇంకా ఇది పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్‌లకు మంచి మూలం, శరీరంలో ద్రవ సమతుల్యతను కాపాడుకోవడంలో ఇది ఎంత‌గానో సహాయపడుతుంది. మజ్జిగలో కాల్షియం, పొటాషియం, విటమిన్ B12, ప్రోటీన్ వంటి పోషకాలు పుష్కలంగా ల‌భిస్తాయి. మ‌జ్జిగ‌లో యాంటీమైక్రోబయల్ గుణాలు ఉండే లాక్టిక్ యాసిడ్ కూడా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో ఎంతో సహాయపడుతుంది.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+