Search
  • Follow NativePlanet
Share
» »దేశంలోని ఈ రైల్వే స్టేషన్‌లు అత్యధిక ప్లాట్‌ఫారమ్‌లు క‌లిగిన‌వి...

దేశంలోని ఈ రైల్వే స్టేషన్‌లు అత్యధిక ప్లాట్‌ఫారమ్‌లు క‌లిగిన‌వి...

దేశ వ్యాప్తంగా జనాభాలో సగానికి పైగా ప్రజలు ప్రయాణాలు చేసేందుకు ఎక్కువ‌గా రైలు మార్గాన్నే ఎంచుకుంటారు. ఎందుకంటే, రైలు మార్గాలు త‌క్కువ ఖ‌ర్చుతో పాటు సౌక‌ర్య‌వంత‌మైన ప్ర‌యాణాన్ని అందిస్తాయి. ఎంత‌దూర‌మైన ప్ర‌యాణం చేసే వెసులుబాటు ఉంటుంది. భారతీయ రైల్వేలు కూడా తన ప్రయాణీకుల సౌకర్యార్థం కొత్తదనాన్ని తీసుకురావడానికి ఈ కార‌ణాలే కీల‌క‌మ‌ని చెప్పుకోవాలి. ఇక‌, శీతాకాలపు సెలవుల సమయం ద‌గ్గ‌ర‌ప‌డుతుంది.

కాబ‌ట్టి చాలామంది ప్ర‌జ‌లు ఈ స‌మ‌యంలో క్రిస్మ‌స్, న్యూఇయ‌ర్ వేడుక‌లు జ‌రుపుకునేందుకు ప‌ర్య‌ట‌న కోసం ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకుంటుంటారు. దేశ‌వ్యాప్తంగా వేల సంఖ్య‌లో రైల్వేస్టేష‌న్లు ఉన్నాయి. కానీ, రైల్వేస్టేష‌న్ల‌లో అత్య‌ధిక ఫ్లాట్‌ఫార‌మ్‌లు క‌లిగిన స్టేష‌న్లు ఎక్క‌డున్నాయో మీకు తెలుసా? ఎక్కువ ఫ్లాట్‌ఫామ్‌లు క‌లిగిన రైల్వేస్టేష‌న్‌లు మ‌న‌దేశంలో చాలానే ఉన్నాయి. ఈ సెల‌వుల్లో ఆ స్టేష్ల‌నను సంద‌ర్శిస్తే స‌రిపోతుంది. రండి. ఆ స్టేష‌న్లు ఎక్కుడున్నాయో తెలుసుకుందాం.

howrahrailwaystationinkolkata

కోల్‌క‌త్తాలోని హౌరా రైల్వేస్టేష‌న్‌...

భారతదేశంలో అత్యధిక ప్లాట్‌ఫారమ్‌లు కలిగిన రైల్వే స్టేషన్ల‌ గురించి చెప్పాలంటే మొద‌ట‌గా గుర్తుకు వచ్చే పేరు హౌరా స్టేష‌న్‌. కోల్‌కతాలోని హౌరా రైల్వే స్టేషన్ అత్యధిక ప్లాట్‌ఫారమ్‌లను కలిగి ఉన్న స్టేషన్‌గా పేరుగాంచింది. ఈ స్టేషన్‌లో మొత్తం 26 ప్లాట్‌ఫారమ్‌లు ఉన్నాయి. ఈ స్టేష‌న్‌కు మ‌రో ప్ర‌త్యేక‌త ఉంది. 26 ట్రాక్‌ల రైల్వే లైన్ కూడా ఇక్క‌డ వేయబడింది. ఇది దేశంలో అత్యంత పెద్ద నెట్ వర్క్ ఉన్న రైల్వేష్టేషన్‌గా పేరుగాంచింది. నగరంలో నాలుగు ఆపరేటింగ్ స్టేషన్స్ ఉన్నాయి. దేశంలో అత్యంత రద్దీగా ఉండే అతి పెద్ద రైల్వే ష్టేషన్‌గా కూడా ఇది ప్ర‌సిద్ధిచెందింది.

సీల్దా రైల్వే స్టేషన్..

దేశంలో అత్యధిక ప్లాట్‌ఫారమ్‌లు క‌లిగిన రైల్వేస్టేష‌న్ల జాబితాలో రెండ‌వ స్థానంలో ఉంది సీల్దా రైల్వేస్టేష‌న్‌. ఈ స్టేష‌న్ వెస్ట బెంగాల్‌లో ఉంటుంది. ఈ రైల్వే స్టేషన్ దేశంలో అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ రైల్వే స్టేషన్‌లో మొత్తం 20 ప్లాట్‌ఫారమ్‌లు ఉన్నాయి. ఈ స్టేష‌న్ మిస్టర్ వాల్టర్ గ్లాన్‌విల్లే రూపొందించించారు. సీల్దాలోని అసలు ప్రధాన స్టేషన్ 1869లో నిర్మించబడింది.

chhatrapatishivajiterminusstationinmumbai

ముంబైలోని ఛత్రపతి శివజీ టెర్మినస్ స్టేష‌న్‌...

దేశ ఆర్థిక రాజధానిగా పిలువబడే ముంబై నగరంలోని ఛ‌త్ర‌ప‌తి శివాజీ టెర్మిన‌ల్ రైల్వేస్టేష‌న్‌ దేశంలోని అత్య‌ధిక ఫ్లాట్‌ఫామ్ క‌లిగిన స్టేష‌న్ల జాబితాలో మూడో స్థానంలో ఉంది. ఈ రైల్వే స్టేషన్‌లో మొత్తం 18 ప్లాట్‌ఫారమ్‌లు ఉన్నాయి, ఈ స్టేషన్‌ను గతంలో విక్టోరియా టెర్మినస్ అని కూడా పిలిచేవారు. ముంబాయ్ లోని ఛత్రపతి శివాజీ రైల్వే స్టేషన్ ఇండియాలోనే అతి పెద్ద రైల్వేష్టన్‌గా పేరుగాంచింది. అంతేకాకుండా, ఆల్ టైమ్ బెస్ట్ రైల్వే స్టేషన్‌గా కూడా ఇది గుర్తింపు పొందినది. ఇది బెస్ట్ ఫంక్షనల్ రైల్వే స్టేషన్. ఇండియాలోని అతి పెద్ద, రద్దీగా ఉండే రైల్వేష్టషన్‌ల‌లో ఇది ఒకటి.

న్యూఢిల్లీ రైల్వే స్టేషన్

దేశంలో అత్యధిక ప్లాట్‌ఫారమ్‌లను కలిగి ఉన్న రైల్వే స్టేషన్లలో దేశ‌ రాజధానిలో నిర్మించిన న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ పేరు కూడా ఉంది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లోని మొత్తం ప్లాట్‌ఫారమ్‌ల సంఖ్య 16. మ‌రో ప్ర‌త్యేక‌త ఏంట‌టే, పండుగ లేదా సెలవుల సమయంలో ఈ స్టేషన్ నుండి దాదాపు 400 రైళ్లు నడుస్తాయి.

chennairailwaystation1

చెన్నై రైల్వే స్టేషన్

ద‌క్షిణాదిన కూడా అత్య‌ధిక ప్లాట్‌ఫారమ్‌లు క‌లిగిన రైల్వేస్టేష‌న్లున్నాయి. అందులో ఒక‌టి చెన్నై రైల్వేస్టేష‌న్‌? ఇది చెన్నైలో ఉంది. ఈ స్టేషన్ పేరు చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్. ఈ స్టేషన్‌లో మొత్తం 15 ప్లాట్‌ఫారమ్‌లు ఉన్నాయి.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+