Search
  • Follow NativePlanet
Share
» »ఏపీలోని అమృత్ భారత్ స్కీం రైల్వే స్టేష‌న్‌ల లిస్ట్ ఇదే..

ఏపీలోని అమృత్ భారత్ స్కీం రైల్వే స్టేష‌న్‌ల లిస్ట్ ఇదే..

భార‌తీయ‌ రైల్వే మంత్రిత్వ శాఖ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ ద్వారా మెరుగైన ఫ‌లితాల‌ను అందించేందుకు సిద్ధ‌మైన విష‌యం తెలిసిందే. భారతదేశం అంతటా రైల్వే స్టేషన్‌ల‌లో సమగ్ర అభివృద్ధి ప్రణాళికను రూపొందించింది. ఈ స్కీమ్‌లో భాగంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని 72 రైల్వే స్టేషన్‌ల‌ను అభివృద్ధి చేసేందుకు ఎంపిక చేయ‌బ‌డ్డాయి. రైల్వే మంత్రిత్వ శాఖ‌ ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే పనులకు రూ.8,400 కోట్లు కేటాయించింది. ఈ పథకం ద్వారా కేవ‌లం స్టేష‌న్‌ల సుంద‌రీక‌ణ మాత్ర‌మే కాకుండా దీర్ఘ‌కాలిక అభివృద్ధే ల‌క్ష్యంగా ప్ర‌ణాళిక‌లు రూపుదిద్దుకున్నాయి. దీంతో రాష్ట్రంలో ఎంపిక చేయ‌బ‌డ్డ 72 రైల్వే స్టేష‌న్‌ల రూపురేఖ‌లు మారిపోనున్నాయి. ఈ ప్ర‌ణాళిక ఏపీలో ప‌ర్యాట‌క రంగం అభివృద్ధికి కూడా దోహ‌ద‌ప‌డ‌నుంది.

amritbharatyojana , ap

స్కీం ప్ర‌త్యేక‌లు

అమృత్ భారత్ స్టేషన్ పథకం దీర్ఘకాలిక విధానంతో నిరంతర ప్రాతిపదికన స్టేషన్ల అభివృద్ధి కోసం రూపొందించబ‌డింది. స్టేషన్ యాక్సెస్, సర్క్యులేటింగ్ ఏరియాలు, వెయిటింగ్ హాల్స్, టాయిలెట్లు, అవసరమైన లిఫ్ట్/ఎస్కలేటర్లు, పరిశుభ్రత, ఉచిత Wi-Fi, స్థానిక ఉత్పత్తుల కోసం కియోస్క్‌లు వంటి సౌకర్యాలను మెరుగుపరచడం కోసం దశలవారీగా మాస్టర్ ప్లాన్‌లను సిద్ధం చేస్తున్నారు. ఈ పథకం స్టేష‌న్ ప‌రిధిలోని నగరం యొక్క రెండు వైపులా స్టేషన్‌ల‌ను ఏకీకృతం చేయడం, మల్టీమోడల్ ఇంటిగ్రేషన్, దివ్యాంగులకు సౌకర్యాలు, పర్యావరణ అనుకూల ప‌రిశ‌రాలు, బ్యాలస్ట్‌లెస్ ట్రాక్‌ల ఏర్పాటు వంటివి ప్ర‌ణాళిక‌లో భాగంగా ఉంటాయి. ప్రతి స్టేషన్‌లో ప్ర‌యాణీకుల అవ‌స‌రాల‌ను దృష్టిలో ఉంచుకుని సమాచార వ్యవస్థలు, ఎగ్జిక్యూటివ్ లాంజ్‌లు, వ్యాపార సమావేశాల కోసం నామినేటెడ్ స్థలాలు, ల్యాండ్‌స్కేపింగ్ మొదలైనవి ఈ స్కీం ద్వారా ల‌భించ‌నున్నాయి.

మార‌నున్న రూపురేఖ‌లు

అమృత్ భారత్ స్టేషన్ పథకంలో ఎంపిక చేయ‌బ‌డిన‌ స్టేషన్ గుండా వెళ్లే రైళ్ల ప్రయాణికులు కనీసం రెండు LED ఆధారిత స్టేషన్ నేమ్ బోర్డులను చూడొచ్చు. ప్రతి స్టేషన్‌లోని భవనాలతోపాటు ఫ్లోరింగ్ ఆధునిక శైలిలో నిర్మాణం ఉంటుంది. స్టేష‌న్‌ల‌లో ఇప్ప‌టికే 600 మీటర్ల పొడవుతో ఉన్న ప్లాట్ ఫాంల పొడవును 760 మీటర్ల నుంచి 840 మీటర్ల వరకు పెంచ‌నున్నారు. స్టేషన్ల వద్ద ట్రాక్‌ల‌ శుభ్రత, సులభమైన నిర్వహణ కోసం 'బ్యాలస్ట్ లెస్ ట్రాక్'ల ఏర్పాటు ఉంటుంది.

amritbharatyojana

ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉండే ఎన్ఎస్‌జీ 1-4, ఎస్‌జీ 1- 2 కేటగిరీ స్టేషన్లలో ఎస్కలేటర్ల ఏర్పాటు, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా వీల్ చెయిర్లు, ప్రత్యేక ప్రవేశ మార్గాలు ఉంటాయి. స్థానిక ఉత్పత్తుల విక్రయానికి స్టేష‌న్‌లో కనీసం రెండు స్టాల్స్ ఏర్పాటు చేయ‌నున్నారు. అంతేకాదు, ప్రతి స్టేషన్ మొదటి అంతస్తులో ప్రత్యేకంగా రూఫ్ ప్లాజా నిర్మాణం కూడా ఇందులో భాగంగా ఉండ‌నుంది. ద‌శ‌వారీలో ఈ ప‌నుల‌ను ప్రారంభించ‌నున్నారు. ఈ ఆధునికీక‌ర‌ణ ప‌నులకు అవ‌స‌ర‌మైన ప్ర‌ణాళిలు రూపొందుతున్నాయి. ఇవి పూర్తిస్థాయిలో అమ‌ల్లోకి వ‌స్తే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఈ 72 రైల్వే స్టేష‌న్‌ల రూపురేఖ‌లు పూర్తిగా మారిపోనున్నాయి.

స్టేష‌న్‌ల లిస్ట్ ఇదే..

ఆదోని, అనకాపల్లి, అనంతపురం, అనపర్తి, అరకు, బాపట్ల,

భీమవరం టౌన్, బొబ్బిలి జంక్షన్, చీపురుపల్లి, చీరాల,

చిత్తూరు, కడప, కంబం, ధర్మవరం, డోన్, దొనకొండ, దువ్వాడ, ఎలమంచిలి, ఏలూరు, గిద్దలూరు,

గుడివాడ, గూడూరు, గుణదల, గుంటూరు, హిందూపురం,

ఇచ్చాపురం, కదిరి, కాకినాడ టౌన్, కొత్తవలస, కుప్పం, కర్నూలు నగరం, మాచర్ల, మచిలీపట్నం,

మదనపల్లి రోడ్, మంగళగిరి, మార్కాపురం రోడ్, దొనకొండ,

మాత్రాలయం రోడ్, నడికుడి జంక్ష‌న్‌, నంద్యాల, నరసరావుపేట,

నర్సాపూర్, నౌపాడ జంక్షన్, నెల్లూరు, నిడదవోలు, ఒంగోలు,

పాకాల, పలాస, పార్వతీపురం, పిడుగురాళ్ల, పీలేరు,

రాజంపేట, రాజమండ్రి, రాయనపాడు, రేణిగుంట, రేపల్లె,

సామర్లకోట, సత్తెనపల్లె, సింహాచలం, సింగరాయికొండ,

శ్రీకాళహస్తి, శ్రీకాకుళం రోడ్, సూళ్లూరుపేట,

తాడేపల్లిగూడెం, తాడిపత్రి, తెనాలి, తిరుపతి, తుని, విజయవాడ, వినుకొండ, విశాఖపట్నం, విజయనగరం జంక్షన్

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+