భారతదేశం పర్యాటక ప్రదేశాలకు పెట్టింది పేరు. ఇక్కడ ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు పర్యాటకులను రా రమ్మంటూ ఆహ్వనిస్తుంటాయి. ఇక్కడ కేవలం జలపాతాలు, హిల్‌స్టేషన్‌లు, ఆధ్యాత్మిక ప్రదేశాలు మాత్రమే కాదు. అత్యంత భయంకరమైన రహస్య ప్రదేశాలు, సొరంగాలవంటివెన్నో ఉన్నాయి. ఇక, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అలాంటి గుహలు చాలానే ఉన్నాయి.
ముఖ్యంగా బెలుంగుహలు, బొర్రాగుహలు వంటివి ఇక్కడ ప్రసిద్ధిచెందినవి. అయితే, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక అద్భుతమైన, అత్యంత పెద్దదైన సొరంగం ఉంది. అదికూడా ప్రకృతి అందాలతో కప్పబడి ఉంటుంది. ఇక, ఈ సొరంగానికి ఎంతో చరిత్ర కూడా ఉంది. రండి ఆ సొరంగం విశేషాలెంటో తెలుసుకుందాం పదండి.
ఇక, ఈ సీజన్‌లో చాలామంది విహారయాత్రలకు ప్లాన్ చేస్తుంటారు. అందులో ముఖ్యంగా చల్లని ప్రదేశాలు ముందుగా మన జాబితాలో ఉంటాయి. అయితే చరిత్ర గురించి తెలుసుకోవాలనుకోనేవాళ్లు తప్పకుండా ఈ సొరంగాన్ని వీక్షించాల్సిందే. ఎందుకంటే ఈ సొరంగం స్వాత్రంద్యోమ్య సమయంలో కీలకపాత్ర వహించింది.
అప్పటి ఉద్యమకారులంతో బ్రిటిష్ వారి నుంచి తమను తాము రక్షించుకునేందుకు ఇక్కడే దాక్కునేవారని చరిత్ర చెబుతోంది. అదే తెలంగాణలో అర్జుల్ లొద్ది సొరంగం. ఈ సొరంగం పూర్తిగా ప్రకీతి అందాలతో చుట్టుముట్టబడి ఉంటుంది. ఇంతటి అద్భుతమైన దృశ్యాన్ని వీక్షించేందుకు పర్యాటకులు బారులు తీరుతుంటారు. ఒక్క తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల వారు కూడా వస్తుంటారు. ఇక, ఈ సొరంగం చుట్టూ పచ్చని అందాలు, పర్యాటకులు ఎంతో ఇష్టపడే కొలనులు కూడా కలవు.

అర్జునుడి దేవాలయం.. ఎంతో ప్రత్యేకం..
అర్జున్‌లొద్ది సొరంగం రాష్ట్రంలోని ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం మెస్రంగూడ గ్రామ పంచాయతీకి సుమారు ఐదు కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. రోంపల్లి పంచాయితీ పరిధిలోని దట్టమైన అటవి ప్రాంతంలో ఈ సొరంగం వెలసిందని ఇక్కడివారు చెబుతుంటారు. ఇక, ఈ సొరంగం ఇక్కడికి వచ్చేవారిని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సొరంగాన్ని ఇక్కడి గిరిజనులు అర్జునుడి దేవాలయంగా పూజిస్తారు.
అంతేకాదండోయ్ ఈ సొరంగం ఉన్న సమీపంలో గ్రామానికి కూడా అర్జున్‌లొద్ది అనే పేరును పెట్టారు ఇక్కడివారు. ఇంకా ఇక్కడి గిరిజనులు ఈ సొరంగం వద్దకు వచ్చి ఎంతో భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహిస్తుంటారు. ఈ ప్రాంతం గిరిజనుల కట్టుబొట్టు జీవన విధానంలాగే వాళ్ళ ఆచార వ్యవహారాలు,ఆరాధన తీరు తెన్నుల కూడా ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. ఇక, ఈ ప్రాంతంలో పూర్వం పాండవులు తిరిగారని, వారు ఈ సొరంగంలో బంగారు కిరీటాలను ఉంచారని ఇక్కడి గిరిజనుల ప్రగాడ విశ్వాసం..ఈ ప్రాంతంలోని ప్రజలంతా భీముడి సంతానమని ఇక్కడి వారి నమ్మకం.అందుకే, ఈ ప్రాంతంలోని గిరిజనులు ఎక్కువ శాతం భీముడు,అర్జునుడు పేర్లనే పెట్టుకుంటారు.
రిస్క్‌తో కూడుకున్న పని..
ఈ సొరంగాన్ని చూడాలంటే ఎంతో రిస్క్‌తో కూడుకున్న పనే. ఎందుకంటే ఈ సొరంగం లోపల ఎలాంటి వెలుతురు ఉండదు. మొత్తం చీకటితో కమ్మేసుకుని ఉంటుంది. ఈ సొరంగాన్ని చూడాలని చాలామంది విశ్వప్రయత్నాలు చేశారు కానీ, అవేమీ ఫలితంచలేదు. ఇందులో ఎలాంటి ఆక్సీజన్ ఉండదు. ఊపిరాడక చాలామంది వెనుదిరిఇవచ్చే చూసేందుకు చాలామంది



Click it and Unblock the Notifications













