Search
  • Follow NativePlanet
Share
» »మ‌రో నాలుగునెల‌ల్లో ఫాట్ ఫామ్‌పై ఆగ‌నున్న... వందేభార‌త్ స్లీప‌ర్ కోచ్‌లు..

మ‌రో నాలుగునెల‌ల్లో ఫాట్ ఫామ్‌పై ఆగ‌నున్న... వందేభార‌త్ స్లీప‌ర్ కోచ్‌లు..

Vande bharat: మ‌రో నాలుగునెల‌ల్లో ఫాట్ ఫామ్‌పై ఆగ‌నున్న... వందేభార‌త్ స్లీప‌ర్ కోచ్‌లు..

దేశంలో వందేభార‌త్ రైళ్ల హావా కొన‌సాగుతోంది. త‌క్కువ స‌మ‌యంలో ప‌ర్యాట‌కుల‌ను వారి వారి గ‌మ్య‌స్థానాల‌కు చేర్చ‌డంలో ఇవి ఎంతగానో స‌హాయ‌ప‌డుతున్నాయి. అందుకే ఈ రైళ్ల‌కు డిమాండ్ పెరిగింది. ఈ మ‌ధ్య‌కాలంలో వందేభార‌త్ రైళ్ల‌ సంఖ్య‌ను కూడా పెంచారు. ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా 33 వందేభార‌త్ రైళ్లు న‌డుస్తున్నాయి. అయితే వీటిలో క‌నిపించే ప్ర‌ధాన‌లోపం స్లీప‌ర్ కోచ్‌లు లేక‌పోవ‌డం. త్వ‌ర‌లోనే వందేభార‌త్ రైళ్ల‌లో స్లీప‌ర్ కోచ్‌లు ప్ర‌వేశ‌పెట్టనున్న‌ట్లు రైల్వేశాఖ నిర్ణ‌యం తీసుకుంది. 2023 డిసెంబర్‌లో స్లీపర్-ఎడిషన్ వందేభారత్ ప్రోటోటైప్ సిద్ధమవుతుందని, మార్చి 2024లో విడుదల చేస్తామని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపిన సంగ‌తి తెలిసిందే. 2024 మార్చి నాటికి చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) నుంచి బయటకు వస్తుంది. అంటే మ‌రో నాలుగునెల‌ల్లో వందేభార‌త్ స్లీప‌ర్ కోచ్‌లు ప్లాట్ ఫాంపై ఆగ‌నున్నాయి..

Vande bharath sleeper coach

ప్ర‌యాణికుల కోసం 823 బెర్త్‌లు..

స్లీపర్ వందే భారత్ రైలు మొదటి వెర్షన్ డిజైన్ చివ‌రి దశకు చేరుకుంది. కొత్త డిజైన్‌తో వందే భారత్ స్లీపర్ ట్రైన్ తయారీకి రంగం సిద్ధం చేసినట్టు భార‌త రైల్వే శాఖ‌ ప్రకటించింది. దీనిని సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వందేభార‌త్ స్లీప‌ర్ రైలులో 857 బెర్త్‌లు ఉంటాయ‌ని వెల్లండించింది. ఇందులో ప్రయాణికుల కోసం 823 బెర్త్‌లు, సిబ్బందికి 34 ఉండనున్నాయి. స‌హ‌జంగా మామూలు రైలులో అయితే, ప్ర‌యాణికుల కోసం నాలుగు టాయిలెట్లు అందుబాటులో ఉంటాయి. అయితే స్లీపర్ వందే భారత్‌లో మాత్రం నాలుగు టాయిలెట్లకు బదులుగా మూడు టాయిలెట్లు మాత్ర‌మే ఉండ‌నున్నాయి. అంతేకాదు ఇందులో ఒక మినీ ప్యాంట్రీ కూడా ఉండబోతుంద‌ట‌..

స్వ‌దేశీ ప‌రిజ్ఞానంతో నిర్మించిన‌వి...

ఈ వందేభార‌త్ స్లీప‌ర్ కోచ్‌లు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన‌వి. వీటిలో జర్నీ చేయడం ప్రయాణికులకు ఓ సరికొత్త అనునుభూతిని కలిగిస్తాయి. ఈ రైళ్ల‌లో ఉండే ప్ర‌త్యేక‌త‌లు స్పీడ్, సేఫ్టీ, సర్వీస్. ప్ర‌స్తుతం ఈ వందేభార‌త్ స్లీప‌ర్ కోచ్ రైళ్ల ఫొటోలు సోష‌ల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ స్లీప‌ర్ కోచ్‌లో ఉండే మ‌రో ప్ర‌త్యేక‌త ఏంట‌టే, ఇందులో లోయర్, అప్పర్ బెర్తులు మాత్రమే ఉంటాయి. మిడిల్ బెర్త్‌లు ఉండ‌వు. ఇందులో ఉండే పై బెర్త్‌ చేరుకునేందుకు ఉపయోగించే నిచ్చెన కూడా సరికొత్త డిజైన్‌లో క‌నిపిస్తుంది. అది పెద్ద గ్లాస్ విండో, దాని కింద ఒక టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్‌లో ప్ర‌యాణికుల వ‌స్తువుల‌ను పెట్టుకోవ‌చ్చు.

Vandebharath sleeper coach

మ‌రో 200 స్లీప‌ర్ వందేభార‌త్ రైళ్ల త‌యారీ...

అయితే, వీటితో పాటు మ‌రో 200 స్లీపర్ వందే భారత్ రైళ్ల తయారీకి TMH-RVNL, BHEL-Titagarh వ్యాగన్ల కన్సార్టియమ్‌లకు రైల్వే శాఖ కాంట్రాక్టు ఇచ్చిన‌ట్లు స‌మాచారం. ఈ స్లీపర్ వందే భారత్ రైళ్లన్నీ ఒకే డిజైన్‌ను కలిగి ఉంటాయని తెలిపారు. తుది డిజైన్‌ను TMH, Titagarh ఆమోదించనున్నాయని రైల్వే శాఖ మంత్రి పేర్కొన్నారు. ప్ర‌యాణికుల‌కు మరింత సౌకర్యవంతంగా ఉండేలా స్లీపర్ వందే భారత్ రైళ్లు డిజైన్ చేయబడ్డాయని ఆయ‌న అన్నారు. స‌హ‌జంగా మాములు రైళ్ల‌లో పై బెర్త్‌ను చేరుకోవాలంటే, పిల్ల‌లు కానీ, ముస‌లివాళ్లు కానీ ఇబ్బంది ప‌డేవాళ్లు. అయితే వందేభారత్ స్లీప‌ర్ రైళ్లో మాత్రం పై బెర్త్‌ను సులభంగా చేరుకునేలా డిజైన్ చేశామ‌ని మంత్రి తెలిపారు. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో రాత్రికి రాత్రి దూరప్రయాణాలు చేసే ప్రయాణికులకు ఈ వందేభారత్ స్పీపర్ కోచ్‌లు సౌకర్యవంతంగా ఉంటాయని ఆయన చెప్పారు.

More News

Read more about: tmh rvnl bhel titagarh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+