Search
  • Follow NativePlanet
Share
» »9 రోజుల్లో దక్షిణ భారతంలోని ప్ర‌సిద్ధ తీర్థ‌యాత్ర‌ల‌ను చూసేయొచ్చు..

9 రోజుల్లో దక్షిణ భారతంలోని ప్ర‌సిద్ధ తీర్థ‌యాత్ర‌ల‌ను చూసేయొచ్చు..

భార‌త్‌లో ప్ర‌సిద్ధిచెందిన పుణ్య‌క్షేత్రాలు చాలానే ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా ద‌క్షిణ భార‌తం గురించి చెప్పాలంటే ఇక్క‌డ ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఆధ్యాత్మిక ప్ర‌దేశం పేరుగాంచింది. ద‌క్షిణ భార‌తంలో ప్ర‌సిద్ధిచెందిన పుణ్య‌క్షేత్రాల‌ను ద‌ర్శించుకుకోవాల‌నుకునేవారికి ఐఆర్‌సిటిసి ఓ స్పెష‌ల్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్యాకేజీలో భాగంగా మొత్తం తొమ్మిది రోజుల ప్ర‌యాణం చేయాల్సి ఉంటుంది. ఈ 9రోజుల్లో ఏడు పుణ్య‌క్షేత్రాల ద‌ర్శ‌న భాగ్యం పొందొచ్చు. ఇది రైలు ప్ర‌యాణం..

ఐఆర్‌సిటిసి భ‌క్తుల‌కు భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ ద్వారా 'దివ్య దక్షిణ యాత్ర' టూర్ అనే ప్యాకేజీనీ తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీలో భాగంగా అరుణాచలం, రామేశ్వరం, త్రివేండ్రం, కన్యాకుమారి, తంజావూరు, మధురై, తిరుచ్చి వంటి ప్రాంతాల‌ను చూడొచ్చు. ముందుగా సికింద్రాబాద్ నుంచి ట్రైన్ ప్ర‌యాణం ప్రారంభ‌వుతుంది. భారత్ గౌరవ్ టూరిస్ట్‌ రైలు ప్ర‌యాణికుల‌కు 2AC, 3AC, SL తరగతులలో ఈ స్పెష‌ల్ టూర్ ప్యాకేజీనీ అందిస్తోంది. అతి త‌క్కువ ధ‌ర‌తోనే ఈ ట్రిప్‌ని ఎంజాయ్ చేయొచ్చు.

ఐఆర్‌సిటిసి అందిస్తోన్న ఈ స్పెష‌ల్ టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.14, 250 ఉంటుంది. దివ్య దక్షిణ యాత్రలో కన్యాకుమారి, మధురై, రామేశ్వరం, తిరువణ్ణామలై, తంజావూరు, తిరుచ్చి, త్రివేండ్రం వంటి ప్రాంతాల‌ను ఈ ప్యాకేజీలో కవర్ చేస్తారు. ఇక‌, ఈ టూర్ ప్యాకేజీ ఆగస్టు 4వ తేదిన సికింద్రాబాద్ నుంచి ప్రారంభమ‌వుతుంది.

IRCTC Tour Package South India

తొమ్మిది రోజులు ప్ర‌యాణమిలా...

ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా మొద‌టిరోజు సికింద్రాబాద్ నుంచి భారత్ గౌరవ్ రైలు బయలుదేరుతుంది. ఈ ట్రైన్ రెండు తెలుగు రాష్ట్రాలలోని కాజీపేట, వరంగల్, విజయవాడ, నెల్లూరుతో సహా పలు స్టేషన్లలో ఆగుతుంది. ఈ ప్ర‌యాణంలో రెండో రోజు తిరువణ్ణామలై స్టేషన్‌కు చేరుకుంటారు. అక్క‌డి నుంచి హోట‌ల్ చేరుకుని, అక్క‌డ ప్రెష్ అయ్యిన వెంట‌నే అరుణాచ‌లం సంద‌ర్శ‌నానికి వెళ్తారు. అరుణాలేశ్వరుడి దర్శన భాగ్యం అనంత‌రం కుదల్‌నగర్‌కు వెళ్లేందుకు తిరువణ్ణామలై స్టేషన్‌కు చేరుకుంటారు. ఇక‌, మూడోరోజు కూడల్ నగర్ స్టేషన్‌కు చేరుకుంటారు. అక్క‌డి నుంచి రోడ్డు ప్ర‌యాణంలో రామేశ్వరానికి వెళ్తారు.

అక్కడ హోటల్‌కి వెళ్లి... ఫ్రెష్ అప్ అయిన అనంత‌రం అక్క‌డి ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రాల ద‌ర్శ‌నం ఉంటుంది. ఇక, ఆ రోజు రాత్రంతా అక్క‌డే ఉండాలి. మ‌రుస‌టి రోజు (నాలుగోరోజు) మధ్యాహ్న భోజనం చేసి రామేశ్వరం నుంచి మధురైకి బస్సు ప్ర‌యాణం ఉంటుంది. అక్క‌డ‌ మీనాక్షి అమ్మన్ సంద‌ర్శ‌నం అనంత‌రం షాపింగ్‌కు బ‌య‌లుదేరుతారు. అక్క‌డి నుంచి కన్యాకుమారి ప్రయాణానికి మ‌రో ట్రైన్ ఎక్కాల్సి ఉంటుంది. ఐదోరోజు కొచ్చువేలి రైల్వే స్టేషన్ చేరుకుంటారు. అక్క‌డి నుండి రోడ్డు మార్గంలో కన్యాకుమారికి వెళ్తారు. అక్క‌డ రాక్ మెమోరియల్, గాంధీ మండపం, సన్‌సెట్ పాయింట్ వంటి ప్రాంతాల‌ను సందర్శిస్తారు.

రాత్రికి బస అక్క‌డే ఉంటుంది. మ‌రుస‌టిరోజు (ఆరోరోజు) కన్యాకుమారిలోని హోటల్ నుంచి చెక్ అవుట్ అయ్యి, రోడ్డు మార్గంలో త్రివేండ్రం బయలుదేరతారు. అక్క‌డ ప్ర‌సిద్ధిచెందిన అనంత పద్మనాభస్వామి దేవాలయం, కోవలం బీచ్ ను వీక్షిస్తారు. తిరుచిరాపల్లికి వెళ్లేందుకు మ‌రో ట్రైన్ ఎక్కాల్సి ఉంటుంది. మ‌రుస‌టి రోజు తిరుచిరాపల్లికి వెళ్లి అక్క‌డ హోటల్ కి తీసుకెళ్తారు. హోటల్‌లో ప్రెష‌ప్ అయ్యాక శ్రీరంగం ఆలయ సంద‌ర్శ‌న ఉంటుంది. మధ్యాహ్న భోజనం ముగించుకుని రోడ్డు మార్గంలో తంజావూరికి బ‌య‌లుదేరుతారు. అక్క‌డ తంజావూరు బృహదీశ్వర ఆలయాన్ని వీక్ష‌ణ ఉంటుంది. ఇక‌, అక్క‌డి నుంచి సికింద్రాబాద్ తిరుగు ప్రయాణానికి తంజావూరులో తిరిగి ట్రైన్ బయలుదేరుతుంది. రెండు రోజుల ప్ర‌యాణం ఉంటుంది.

ప్యాకేజీ ధ‌ర‌ల వివ‌రాలు..

ఎకానమీ క్లాస్ అయితే పెద్ద‌ల‌కు-రూ.. 14250 చెల్లించాలి.. అదే పిల్ల‌ల‌కయితే ((5-11 సంవత్సరాలు) రూ. 13250 చెల్లించాల్సి ఉంటుంది. స్టాండర్డ్ పెద్ద‌ల‌క‌యితే, రూ 21900 అవుతుంది. పిల్ల‌ల‌కు రూ..20700 చెల్లించాలి. కంఫర్ట్ క్లాస్‌ పెద్ద‌ల‌క‌యితే రూ. 28450- చిన్న పిల్ల‌ల‌క‌యితే రూ.. 27010 చెల్లించాలి. ట్రైన్‌లో ఉండే సీట్ల సంఖ్య ఇదే.. 716 (SL: 460, 3AC: 206, 2AC: 50)

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+