ఊటీ లోని బొటానికల్ గార్డెన్స్ లేదా ప్రభుత్వ బొటానికల్ గార్డెన్స్ సుమారు 22 హెక్టార్ ల లో విస్తరించి వున్నాయి. దోద్దబెట్ట శిఖరం ఏటవాలు ప్రదేశాల లో కల ఈ గార్డెన్ లు పచ్చటి తివాచీ ల వాలే కనపడతాయి. వీటి నిర్వహణ అంతా తమిళ్ నాడు హార్టికల్చర్ శాఖ నిర్వహిస్తుంది. ఈ గార్డెన్ లను 1847 సంవత్సరం లో వేసారు వీటిని ఇంగ్లీష్ ఆర్కిటెక్ట్ విలియం గ్రహం మేక్వీర్ రూపొందించారు. స్వాతంత్రానికి ముందు వీటిలోకి ప్రవేశానికి సభ్యత్వం అవసరం. యురోపెయన్ లకు మాత్రమే అది వుండేది.
నెలకు రూ.3 వసూలు చేసేవారు. ప్రతి సంవత్సరం ఈ గార్డెన్ లను లక్షలాది పర్యాటకులు దర్శిస్తారు. ఇక్కడ అన్ని రకాల మొక్కలు వుంటాయి. సాధారణ చెట్ల నుండి ఔషధ మొక్కలు, బోన్సాయ్ మొక్కలు కలవు. గార్డెన్ ఆవరణ లో ఒక పెద్ద ప్రాచీన చెట్టు కాండం కలదు. ఇది సుమారు 20 మిలియన్ సంవత్సరాల నాటిది గా చెపుతారు.