ఊటీ లేక్ , ఊటీ దర్శించే పర్యాటకులకు ప్రసిద్ధ ఆకర్షణ. ఇది ఒక కృత్రిమ సరస్సు. దీనిని 1824 లో జాన్ సుల్లివాన్ సుమారు 65 ఎకరాల లో నిర్మించారు. వర్షాకాలం లో కొండలపై నుండి పడే నీటిని ఈ సరస్సు పొందుతుంది. అది నిండిన వెంటనే సుమారు మూడు సార్లు ఖాళీ చేస్తారు. స్థానిక మత్స్యకారులు ఇక్కడ చేపలు వేతాడతారు. ఈ సరస్సు సమీపంలో ఒక బస్సు స్టాండ్, ఒక రేస్ కోర్స్ మరియు ఒక పార్క్ నిర్మించటం వలన మరియు భౌగోళిక కారణాలుగా కుచించుకు పోయింది. ప్రస్తుతం బోటు విహారాల కారణంగా నే ప్రసిద్ధి చెందినది. బోటు విహారం చేస్తూ ప్రకృతి దృశ్యాలు ఆనందించవచ్చు. మే నెలలో ప్రభుత్వం రెండు రోజులపాటు బోటు రేస్ లు నిర్వహిస్తుంది.



Click it and Unblock the Notifications