వెన్ లాక్ డౌన్స్ అనేది ఒక ప్రసిద్ధ పిక్నిక్ ప్రదేశం దాని సుందర దృశ్యాల కారణంగా ఇక్కడ అనేక ఫిలిం షూటింగ్ లు జరుగుతాయి. ఏటవాలు కొండలు, పచ్చటి మైదానాలు మీ హృదయాన్ని పులకింప చేస్తాయి. వెన్ లాక్ డౌన్ ప్రాంతం సుమారు 20,000 ఎకరాలలో విస్తరించి వుంది. ఈ ప్రదేశం లో యుకలిప్తాస్ చెట్లు హుందాగా నిలబడి వుంటాయి.
స్వాతంత్రానికి పూర్వం ఈ ప్రదేశం యురోపెయన్ లలో ఎంతో ప్రసిద్ధి పొందినది. వారు ఇక్కడకు హంటింగ్ కు వచ్చేవారు. దీనిని ఉదగమండలం హంట్ అనేవారు. ఇండియా కు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇక్కడ హంటింగ్ నిషేధించారు. ఊటీ కి వచ్చిన వారు ఇక్కడకు తప్పక వస్తారు. ఇక్కడ ఒక జింఖాన క్లబ్ , గోల్ఫ్ కోర్స్ మరియు ప్రభుత్వ గొర్రెల ఫార్మ్ కూడా కలవు.



Click it and Unblock the Notifications