చాముండా దేవి ఆలయం పాలంపూర్ కు 10 కి. మీ. ల దూరం లోను, ధర్మశాల కు15 కి. మీ.ల దూరం లో కలదు. చుట్టూ కొండలు, అడవులు, బెనార్ నది ఒడ్డున ఈ టెంపుల్ కలదు. ఇది సుమారు 700 సంవత్సరాల కిందటిది. దేశం లోని 51 శక్తి పీటాలలో ఒకటి. దీనిలో దుర్గ అవతారమైన చాముండా మాత వుంటుంది. టెంపుల్ వాతావరణం ఎంతో ప్రశాంతం గా వుండటం చేత అనేక మంది భక్తులు ఇక్కడ ధ్యానాన్ని చేస్తారు.
టెంపుల్ ఆవరణ లో అందమైన కొలను కలదు. దీనిలోని నీరు పవిత్రమైనది గా భావిస్తారు. టెంపుల్ కాంప్లెక్స్ లో అందమైన పెయింటింగ్ లు కలవు. ఇక్కడ వన గంగా నదీ పాయ, ఒక ఆయుర్వేది దిస్పెంసరి, ఒక సంస్కృతం కాలేజీ , ఒక లైబ్రరీ కూడా కలవు. ఈ లైబ్రరీ లో అనేక పురాతన వ్రాత ప్రతులు, వేదాలు, పురాణాలు, ఉపనిషద్ లు, ఆస్ట్రాలజీ పుస్తకాలు కలవు.



Click it and Unblock the Notifications