Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» పాన్గోంగ్

పాన్గోంగ్ - లైన్ అఫ్ కంట్రోల్ !

13

పాన్గోంగ్ - త్సో ని పాంగోంగ్ సరస్సు అని కూడా పిలుస్తారు. ఇది జమ్మూ మరియు కాశ్మీర్ లోని లెహ్ జిల్లాలో ఉన్నది. ఇది సముద్ర మట్టానికి 4350 మీ. ఎత్తున ఉన్నది. ఇది చైనా క్రింద ఉన్న టిబెట్ సరిహద్దుగా ఉన్న చాంగ్ తాంగ్' పీఠభూమి మీద ఉన్నది. ఈ సరస్సు యొక్క పొడవు 134 కి.మీ. పైన ఉండి, దీనిలో సగానికి పైగా టిబెట్ మీద ఉన్నది. భారతదేశం స్పష్టంగా చైనీస్ దాడులు పరిశీలించటానికి ఎక్కడ నుండి వీలవుతుందో ఇది అక్కడే ఖచ్చితమైన ప్రాంతంలో ఉంది. సరస్సు ఈ విధంగా వివాదాస్పద భూభాగం మారింది. దీని గుండా లైన్ అఫ్ యాక్చువల్ కంట్రోల్ వెళుతున్నది.

ఇది ఉప్పునీటి సరస్సు ఐనప్పటికీ, పాన్గోంగ్ పూర్తిగా శీతాకాలంలో ఘనీభవిస్తుంది. ఈ సరస్సులోని నీరు ఎక్కువ చవుడు కలిగి ఉండటం వలన ఈ నీరు వ్యవసాయానికి ఎక్కువ ఉపయోగపడదు. ఇందులో జలచరాలు కూడా ఎక్కువకాలం జీవించలేవు. కేవలం కొన్ని రకాల చెట్లు, పొదలు ఈ సరస్సు చుట్టూ ఉన్నాయి. అనేక రకాల వలస పక్షులు, వివిధ రకాల పక్షులు సంతాన ఉత్పత్తి కోసం ఈ సరస్సుకు వొస్తుంటాయి. వేసవికాలంలో పొడుగు తల ఉన్న బాతులు, బ్రహ్మిని బాతులు ఈ ప్రాంతంలో చూడవొచ్చు. ఇంకా, అడవి పందికొక్కులు, కియాంగ్ లను చూడవొచ్చు.

ఈ సరస్సు రామ్సర్ ఒప్పందంలో ఎంపికకు దగ్గరగా ఉన్నది, అంతర్జాతీయ ప్రాధాన్యమున్న తడినేలలు పరిరక్షణ కోసం ఏర్పాటు చేయబడింది. ప్రత్యేకంగా దూరతీరాలనుండి వొచ్చే వలస పక్షుల కోసం ఏర్పాటు చేయబడింది. దీనికి ఇంటర్నేషనల్ ప్రాధాన్యత ఉన్నది. పన్గోంగ్ త్సో, ఈ ఒప్పందం కింద ఎంపిక అయినట్లయితే మొదటి పరిసర దక్షిణ ఆసియా సరస్సు అవుతుంది. నివేదికల ప్రకారం, సరస్సు కృంగిపోతున్నది, దీనికి సాక్ష్యంగా సరస్సు లో మట్టి మరియు ఇసుక నిల్వలు మందపాటి పొరలుగా పెరుగుతున్నాయి.

ఇక్కడి ప్రక్రుతి దృశ్యాలను '3 ఇడియట్స్' మరియు 'ది ఫాల్' అనే సినిమాలలో తీసుకున్నారు. ఈ సినిమాలు 2010 మరియు 2006 లో వచ్చాయి. ఈ సినిమాల విజయం తరువాత ఈ ప్రదేశానికి ఇంకా ఎక్కువ ప్రాచుర్యం ప్రపంచమంతటా వొచ్చింది.

ఈ ప్రాంతం వేసవిలో సమతలఉష్ణం మరియు శీతాకాలంలో అతి శీతలంగా ఉంటుంది. యాత్రికులు దీనిని వేసవికాలంలో సందర్శించవొచ్చు. మే నుండి సెప్టెంబర్ వరకు ఈ ప్రాంతంలో అత్యధిక మరియు అత్యల్ప ఉష్ణోగ్రతలు వరుసగా 40 డిగ్రీల సెంటిగ్రేడ్, 5 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటాయి. యాత్రికులు వర్షాకాలంలో, జూలై నుండి సెప్టెంబర్ మధ్యలో కూడా ఈ ప్రాంతాన్ని దర్శించవొచ్చు. శీతాకాలంలో ఇక్కడ అత్యధిక మరియు అత్యల్ప ఉష్ణోగ్రతలు వరుసగా 24 డిగ్రీల సెంటిగ్రేడ్, -14 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటాయి. అందువలన యాత్రికులకు శీతాకాలం అంత అనుకూలం కాదు.

ప్రయాణికులు ఇక్కడికి 204 కి.మీ. దూరంలో ఉన్న లెహ్ విమానాశ్రయం ద్వారా చేరుకోవొచ్చు. ప్రయాణికులు జమ్మూ తావి రైల్వే స్టేషన్ వరకు రైలులో వొచ్చి, అక్కడనుండి టాక్సీలొకాని, కాబ్ లలోకాని ఇక్కడకు చేరుకోవొచ్చు. ఇక్కడకు 120 కి.మీ. దూరం లో లెహ్ యొక్క ఫ్యంగ్ త్రోక్పో బస్సు స్టాప్ ఉన్నది.

పాన్గోంగ్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

పాన్గోంగ్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం పాన్గోంగ్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? పాన్గోంగ్

  • రోడ్డు ప్రయాణం
    రహదారి ద్వారా: ప్రయాణికులు అద్దె కార్లు లేదా ప్రైవేట్ వాహనాల ద్వారా ఈ స్థలాన్ని సందర్శించుకోవొచ్చు. ఎవరైతే పాన్గోంగ్ కు ట్రిప్ వేయాలనుకున్తున్నారో, వారికి చాలా రెంటల్ ఏజెన్సీస్ ద్విచక్ర వాహనాలని మరియు నాలుగు చక్రాల వాహనాలని అద్దెకు ఇస్తున్నారు
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైల్ ద్వారా: జమ్మూ తావి రైల్వే స్టేషన్ పాన్గోంగ్ కు దగ్గరలో ఉన్నది. ఈ రైల్వే జంక్షన్ ఇండియాలోని , త్రివేండ్రం, న్యూ డిల్లి, చండీఘర్, శ్రీనగర్, గోవా,ముంబై వంటి అతి పెద్ద నగరాలకి జత చేయబడి ఉన్నది.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమానం ద్వారా: పాన్గోంగ్ కు దగ్గరగా 218 కి. మీ. దూరంలో లెహ్ విమానాశ్రయం ఉన్నది. ఈ విమానాశ్రయం ఇండియాలోని అతిపెద్ద నగరాలకి, న్యూ డిల్లి, జమ్మూ, శ్రీనగర్ వంటి వాటికి అనుసంధించబడింది. విదేశీ పర్యాటకులు లెహ్ ద్వారా న్యూ డిల్లీకి జత చేసిన విమానాలలో వెళ్లవొచ్చు. పాన్గోంగ్ నుండి టాక్సీస్, బస్సులు లెహ్ విమానాశ్రయానికి ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
11 Mar,Wed
Check Out
12 Mar,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu

Near by City