Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పన్హాలా హిల్ స్టేషన్ » వాతావరణం

పన్హాలా హిల్ స్టేషన్ వాతావరణం

సందర్శనకు అనుకూల సమయం పన్హాలా నగర వాతావరణం సంవత్సరం పొడవునా ఆహ్లాదంగానే ఉంటుంది. అయితే, వర్షాలు అధికంగా ఉండే జూలై మరియు ఆగస్టు నెలలు పర్యటనలకు సూచించదగినవి కావు. వేసవి మరియు శీతాకాలం పర్యటనకు అనుకూలంగా ఉంటాయి. 

వేసవి

 వేసవి పన్హాలాలో వేసవి కాలం మార్చి నుండి మే వరకు ఉంటుంది. వేసవి వేడిగా ఉన్నప్పటికి అధిక వేడి ఉండదు. ఉష్ణోగ్రత సుమారు 28 డిగ్రీ సెంటీగ్రేడ్ గా ఉంటుంది.  

వర్షాకాలం

వర్షాకాలం పన్హాలాలో వర్షాకాలం జూన్, జూలై, ఆగస్ట్ మరియు సెప్టెంబర్ నెలలలో ఉంటుంది. ఈ ప్రాంతం అధిక వర్షాలు పొందుతుంది. అయినప్పటికి ప్రాంత అందచందాలు చూడటానికి ఇది తగిన సమయం. ఈ సమయంలో సగటు ఉష్ణోగ్రతలు 23 డిగ్రీలుగా ఉంటాయి.

చలికాలం

శీతాకాలం శీతాకాలం నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉంటుంది. ఇక్కడ శీతాకాలం చలి అధికమే. ఉష్ణోగ్రతలు కనిష్టం 10 డిగ్రీలు, గరిష్టం 25 డిగ్రీ సెంటీ గ్రేడ్ గా ఉంటాయి.