పన్హాలా  హిల్ స్టేషన్ - అద్భుత ప్రశాంత వాతావరణం

ప్రశాంతమైన పన్హాల హిల్ స్టేషన్ మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో కలదు. ఈ పట్టణం సముద్ర మట్టానికి సుమారు 3200 అడుగుల ఎత్తులో ఉంది. ఈ రాష్ట్రంలో ఇది అతి చిన్న నగరంగా పేరుపొందింది.

సాంస్కృతిక గుర్తింపు పన్హాలా చరిత్ర పరిశీలిస్తే ఒక్కసారి మనకి ఇది శివాజీ పాలనలోని మరాఠా సామ్రాజ్య వైభవాన్ని గుర్తు చేస్తుంది. ఈ ప్రాంతంపై శివాజి 500 రోజులు మాత్రమే పట్టు కలిగి ఉన్నాడు. పన్షాలా తర్వాతి కాలంలో అంటే సుమారు 1827 సంవత్సరంలో బ్రిటీష్ పాలనకిందకు వచ్చేసింది.

పన్హాలా కోట ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణ. సజ్జా కోఠి అనేది ఒక శిక్షలు అమలు చేసే గది. కోటలో ఒక ప్రధాన ప్రదేశం. ఇక్కడనుండే శివాజీ ఒక్క క్షణంలో తప్పించుకున్నాడు.  తీన్ దర్వాజా ప్రవేశంలో, రాచరికపు కోటకు ప్రవేశంలో మూడు గేట్లు ఉంటాయి. ఈ ప్రవేశ గోడలు చాలా పెద్దవి, ఎక్కువ వెడల్పుతో హుందాగా నిలబడి ఉంటాయి. బ్రిటీష్ వారు కోటను ముట్టడించింది ఈ గేటు ద్వారానే అని చెపుతారు.

పురాతనకాలంలో వీరికి ధాన్యాగారంగా ఉపయోగపడిన అంబర్ ఖానా కోట కూడా చూడదగినది. సమీపంలోని సోమేశ్వర దేవాలయం ఆధ్యాత్మికులకు ఆసక్తి కలిగిస్తుంది. గత వైభవానికి చిహ్నంగా ఉంటుంది.  

ట్రెక్కింగ్ చేసేందుకు పన్హాలా చాలా బాగుంటుంది. ఆహ్లాదంగాను, ప్రశాంతంగాను, కాలుష్యంలేకుండా ఉండి చక్కటి సహజ వాతావరణాన్ని చూపుతుంది. కాంక్రీట్ అడవులనుండి కొద్ది రోజులు దూరంగా ఉండి ఆనందించాలనుకునే వారికి పన్హాలా ఎంతో విశ్రాంతి నిస్తుంది.  ఇక్కడ కల అనేక కోటలు పరిశీలిస్తే, పన్హాలా హిల్ స్టేషన్ ట్రెక్కింగ్ సౌకర్యాలతో ఎంతో ఉత్సాహాన్నిస్తుంది. పర్యాటకులు ఇక్కడి అందమైన లోయ సందర్శన కూడా చేయవచ్చు. అందాలతో ఆశ్చర్య పరుస్తూనే మీకు ఎంతో ప్రశాంతత కలిగించే ప్రదేశం ఇది.  పన్హాలా, ఎపుడు, ఎందుకు మరియు ఎట్లా సందర్శించాలి?

చిన్నది మరియు అందమైనది అయిన పన్హాలా హిల్ స్టేషన్ సందర్శన సంవత్సరం పొడవునా చేయవచ్చు. వేసవిలో కూడా అధిక వేడి ఉండదు. చల్లగానే ఉంటుంది. వర్షాలు స్ధానిక పర్యావరణాన్ని ఆహ్లాదంగా చేస్తాయి. తాజాగాలి, చల్లని పరిసరాలు, జలపాతాలు, కోటలు వంటివి పర్యాటకులను ఆకర్షిస్తాయి. సంవత్సరంలో ఏ సమయంలో అయినా సరే చిన్నపాటి విశ్రాంతి పొందేందుకు పన్హాలా బాగుంటుంది. మీరు వర్షాలు ఇష్టపడని వారైతే, జూలై మరియు ఆగస్టులు వెళ్ళకండి.  విమాన, రైలు, రోడ్డు మార్గాల ద్వారా పన్హాలా తేలికగా చేరవచ్చు. మహారాష్ట్రలోని పెద్ద నగరం కొల్హాపూర్ సమీపంలో ఉంటుంది. విమానం పై చేరాలనుకునేవారు. సమీప కొల్హాపూర్ విమానాశ్రయంనుండి చేరవచ్చు. ఇక్కడినుండి పన్హాలా చేరేందుకు టాక్సీలు లభ్యంగా ఉంటాయి. రోడ్డు లేదా రైలు మార్గాలు కూడా కొల్హాపూర్ కు సౌకర్యంగా ఉంటాయి. మహా రాష్ట్రలోని అన్ని నగరాలకు కొల్హాపూర్ నుండి రవాణా సౌకర్యాలు కలవు.  

పన్హాలా పర్యాటక కేంద్రం మన గత పాలకుల చరిత్రను, వైభవాన్ని గుర్తు చేస్తుంది. ఈ ప్రదేశంలో వివిధ ప్రదేశాలలో ఉన్న కోటలు పర్యాటకులను బిజీ చేస్తాయి. ఇప్పటికే మీరు మీ డైలీ రొటీన్ చర్యలతో విసిగిపోయి ఉన్నవారైతే, త్వరలో వచ్చే మీ సెలవులను ఇక్కడి విశ్రాంతికి ఉపయోగించి ఆనందించండి.    

Please Wait while comments are loading...