అరణ్ముల పార్ధసారధి దేవాలయం పాతానం తిట్ట సమీపంలోని అరణ్ముల అనే చిన్న గ్రామంలో కలదు. ఈ దేవాలయం పంబా నది ఒడ్డున అందమైన పరిసరాలలో కలదు. దేవాలయంలో క్రిష్ణుడి అవతారమైన పార్ధసారధి ప్రధాన దైవం. చేతితో సుదర్శన చక్రం ధరించి ఉంటాడు. ఈ దేవాలయాన్ని కేరళ ప్రాచీన శిల్పశైలిలో నిర్మించారు.
దేవాలయ భవనం గుండ్రంగా ఉంటుంది. ఈ దేవాలయంతోపాటు, అరణ్మెల వల్లంకాలి, అనే స్నేక్ బోట్ రేస్ ని కూడా ఓనం పండుగ సమయంలో చూడవచ్చు. ఓణం సమయంలో అరణ్ముల సందర్శన పర్యాటకులకు ఎంతో ప్రశాంతతను కలిగిస్తుంది.